
ప్రభుత్వ తొందరపాటుతనం రాజకీయ అక్రమం!
న్యూఢిల్లీ:లోక్ పాల్ నియామక ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని బీజేపీ డిమాండ్ చేసింది. అవినీతీ నిరోధక విభాగమైన లోక్ పాల్ నియామక విషయంలో ప్రభుత్వం తొందపాటుతనం పూర్తిగా రాజకీయ అక్రమని, ఎన్నికల నియావళికి వ్యతిరేకమని బీజేపీ నేత అరుణ్ జైట్లీ అన్నారు.కేంద్రప్రభుత్వం అనుసరిస్తున్న విధానం పూర్తిగా అనుమానించాల్సిందేనని, ఇలాంటి అనవసరపు తొందరపాటు వల్ల లోక్ పాల్ ఏర్పడకముందే దాని విశ్వసనీయతకు విఘాతం కలుగుతుందన్నారు. ఈమేరకు జైట్లీ యూపీఏ చర్యను తప్పుబడుతూ తన బ్లాగ్ లో అభిప్రాయాలు రాశారు.
'ఈనెల 27 లేదా 28 న లోక్ పాల్ నియమకానికి ప్రధాని కమిటీని సమావేశపరుస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్నికలు సగం పూర్తయ్యాయి. కొన్ని రోజుల్లో కొత్త ప్రభుత్వం ఏర్పడే నేపథ్యంలో ఇటువంటి చర్యలు అనైతికమని' జైట్లీ పేర్కొన్నారు.