'నారాయణ పేరు ఖరారు చేయలేదు' | K Narayana name not finalised for khammam lok sabha seat | Sakshi
Sakshi News home page

'నారాయణ పేరు ఖరారు చేయలేదు'

Published Tue, Apr 1 2014 7:57 PM | Last Updated on Mon, Aug 13 2018 8:27 PM

'నారాయణ పేరు ఖరారు చేయలేదు' - Sakshi

'నారాయణ పేరు ఖరారు చేయలేదు'

ఖమ్మం: ఎంపీ స్థానానికి కె.నారాయణ అభ్యర్థిత్వంపై జిల్లా కమిటీ సమావేశంలో చర్చ జరిగిందని సీపీఐ ఖమ్మం జిల్లా కార్యదర్శి హేమంత్‌రావు తెలిపారు. ఆయన పేరును ఇంకా ఖరారు చేయలేదని స్పష్టం చేశారు. ఈ నెల 5 లేదా 6 తేదీల్లో జరిగే జిల్లా కార్యవర్గ సమావేశంలో ఎంపీ అభ్యర్థి ఎవరనేదానిపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. కాంగ్రెస్‌తో పొత్తు ఖరారైతే ఖమ్మం పార్లమెంట్‌కు పోటీ చేయాలని భావిస్తున్నట్టు తెలిపారు. పొత్తులపై ఇంకా తుది నిర్ణయం జరగక పోవడం వల్ల ఎంపీ అభ్యర్థి ఎవరనేదానిపై ప్రకటన చేయడం లేదన్నారు.

ఖమ్మం లోక్సభ స్థానానికి సీపీఐ అభ్యర్థిగా ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి నారాయణ పేరును ఖరారు చేసినట్టు అంతకుముందు వార్తలు వచ్చిన నేపథ్యంలో ఆయనీ వివరణ ఇచ్చారు. సీపీఐ-కాంగ్రెస్ పొత్తులో భాగంగా సీపీఐ రెండు లోక్సభ, 17 శాసనసభ స్థానాలను కోరుతున్న విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement