సీమాంధ్రలో ఉభయ కమ్యూనిస్టు పార్టీలు కలసికట్టుగా సాగే దిశగా చర్చలు జరుగుతున్నాయి. సీపీఐ, సీపీఎం నేతలు సోమవారం సమావేశమై ఈ విషయంపై చర్చించారు.
హైదరాబాద్: సీమాంధ్రలో ఉభయ కమ్యూనిస్టు పార్టీలు కలసికట్టుగా సాగే దిశగా చర్చలు జరుగుతున్నాయి. సీపీఐ, సీపీఎం నేతలు సోమవారం సమావేశమై ఈ విషయంపై చర్చించారు. ఆంధ్రప్రదేశ్లో పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయించారు.
ఆంధ్రప్రదేశ్లో 9 స్థానాల విషయంలో అభిప్రాయభేదాలున్నాయని చెప్పారు.
సీపీఎం నాయకుడు మధు, సీపీఐ నేత రామకృష్ణ విలేకరులతో మాట్లాడారు. సీమాంధ్రలో నామినేషన్ల ఉపసంహరణ గడువులోగా పరస్పర అవగాహనకు రావాలని నిర్ణయించినట్టు తెలిపారు. తెలంగాణలో సీపీఐ కాంగ్రెస్తో జతకట్టింది.