సాక్షి, మంచిర్యాల : తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్‌ఎస్)లో నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. మంచిర్యాల అసెంబ్లీ, ఆదిలాబాద్, పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గాలకు అభ్యర్థులను మంగళవారం టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ప్రకటించారు. దీంతో గులాబీ శ్రేణుల్లో నెల కొన్న గందరగోళం సద్దుమణిగినట్లయింది. అయి తే ఈ కేటాయింపు పార్టీలోని అసంతృప్తులకు ఆజ్యం పోసినట్లయింది. జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు మొదటి జాబి తాలోనే పార్టీ అభ్యర్థులను ప్రకటించి, టీఆర్‌ఎస్ తూర్పు జిల్లా కేంద్రమైన మంచిర్యాలకు మాత్రం పేరు వెల్లడించకపోవడం పార్టీలో చర్చకు దారి తీసింది.
పలువురు ఆశావహులు ఈ స్థాన ంపై కనే ్నయడమే కాకుండా ప్రయత్నాలు చేశారు. అయితే మంగళవారం వెల్లడించిన జాబితాలో కాంగ్రెస్ నుంచి ఇటీవలే పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్యే దివాకర్‌రావు అభ్యర్థిత్వాన్నే కేసీఆర్ ఖరారు చేశారు. దీంతోపాటు పెద్దపల్లి పార్లమెంటు స్థానంలో ఎవరు బరిలో దిగుతారనే ఉత్కంఠకు తెరదించారు. సిట్టింగ్ ఎంపీ జి.వివేక్ టీఆర్‌ఎస్‌కు గుడ్‌బై చెప్పి సొంతగూటికి చేరిన నేపథ్యంలో ఇక్కడ పార్టీ అభ్యర్థి ఎవరనే సమస్య ఎదురైంది. ఒకరిద్దరు నాయకుల పేర్లు పరిశీల నలోకి వచ్చినప్పటికీ టీఆర్‌ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకుడు బాల్క సుమన్ పేరును ప్రకటించారు. ఆది లాబాద్ పార్లమెంటు అభ్యర్థిగా ఊహించినట్లుగానే గోడం నగేశ్ పేరును వెల్లడించారు. కానీ, బోథ్ అసెంబ్లీ ని యోజకవర్గ అభ్యర్థిని ప్రకటించలేదు. నేడే నామినేషన్ చివరి రోజు కావడంతో ఎవరికి ఇస్తారనే చర్చ జరుగుతోంది.
అసంతృప్తుల రగడ
అభ్యర్థుల ఖరారును టీఆర్‌ఎస్ శ్రేణులు జీర్ణించుకోలేక పోతున్నాయి. తాము కోరిన సమయంలో పరిశీలిస్తామని హామీ ఇచ్చిన పార్టీ పెద్దలు ఇప్పుడు టిక్కెట్ల కేటాయింపులో ఆ విధంగా చేయనేలేదని వ్యాఖ్యానిస్తున్నారు. బోథ్ నియోజకవర్గం నుంచి టిక్కెట్టు ఆశించిన రాములునాయక్, రాథోడ్ బాపురావ్‌లు తమకు అభ్యర్థిత్వం ఖరారు కాకపోవడంతో తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్లు సమాచారం. రాథోడ్ బాపురావు ఒకడుగు ముందుకు వేసి నామినేషన్ దాఖలు చేశారు. మరోవైపు ఖానాపూర్ నుంచి చౌహాన్ విజయలక్ష్మీ టీఆర్‌ఎస్ రెబ ల్‌గా బరిలో ఉన్నారు. మంచిర్యాల నియోజకవర్గంలోనూ ఇదే తరహాలో అసంతృప్తి నెలకొంది.
బీసీలకు దక్కని గుర్తింపు
మంచిర్యాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తమ సామాజికవర్గానికి టిక్కెట్టు కేటాయించాలని పలువురు బీసీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు టీఆర్‌ఎస్ కేంద్ర కార్యాలయం వద్ద నిరసన తెలపడమే కాకుండా.. పార్టీ పెద్దలను కలిసి విన్నవించారు. అయితే పార్టీ వీరి విజ ్ఞప్తిని పరిగ ణనలోకి తీసుకోకుండా దివాకర్ రావుకే టిక్కెట్టు ఖరారు చేసింది. ఈ పరిణామంతో ప లువురు బీసీ నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
టీఆర్‌ఎస్ లో నెలకొన్న ఉత్కంఠకు తెర
Published Wed, Apr 9 2014 2:15 AM | Last Updated on Tue, Oct 9 2018 5:27 PM
Advertisement
Advertisement