అరుణ్ జైట్లీ
న్యూఢిల్లీ: ఎన్నికల పొత్తుపై టిడిపితో చర్చలు కొనసాగుతున్నాయని బిజెపి సీనియర్ నేత అరుణ్ జైట్లీ చెప్పారు. చర్చలు ఇంకా ఒక కొలిక్కిరాలేదన్నారు. అందుకే అభ్యర్థుల జాబితా ప్రకటించలేదని చెప్పారు. రెండు పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదిరిన తరువాత జాబితా విడుదల చేస్తామని జైట్లీ చెప్పారు.
బిజెపితో పొత్తు కోసం మొదటి నుంచి టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వెంపర్లాడుతున్న విషయం తెలిసిందే. అయితే రాష్ట్ర బిజెపి నేతలు టిడిపితో పొత్తుకు సుముఖంగా లేరు. ఆ పార్టీ అధిష్టానం మాత్రం పొత్తు పెట్టుకోవాలన్న ఉద్దేశంతో ఉంది. సీట్ల సర్ధుబాటు విషయంలో వారి మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. ముఖ్యంగా బిజెపి తెలంగాణలో ఎక్కువ సీట్లు అడుగుతోంది. బిజెపి అడిగినన్ని సీట్లు ఇవ్వడానికి టిడిపి సుముఖంగాలేదు. దాంతోనే పేచీ వచ్చింది.