ఒంగోలు, న్యూస్‌లైన్: ప్రాదేశిక ఎన్నికల మలిదశ పోరుకు రంగం సిద్ధమైంది. రెండో దశ ఎన్నికలు జిల్లాలోని 28 మండలాల్లో ఈనెల 11న జరగనున్నాయి. ఆది నుంచి వైఎస్సార్ సీపీ అభ్యర్థులు ప్రచారంలో ముందంజలో ఉండగా..అంతర్గత పోరుతో సతమతమవుతున్న టీడీపీ నాయకులు ప్రాదేశిక అభ్యర్థులను పట్టించుకోవడం లేదు. సర్వేల పేరుతో అసెంబ్లీ అభ్యర్థుల ఎంపికలో చంద్రబాబు తాత్సారం చేస్తుండటంతో జిల్లా నేతలు కూడా ప్రాదేశిక ప్రచార భారాన్ని మోసేందుకు వెనకడుగు వేస్తున్నారు.
జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు రెండో దశలో ఒంగోలు, కొత్తపట్నం, సంతనూతలపాడు, చీమకుర్తి, మద్దిపాడు, నాగులుప్పలపాడు, కొండపి, జరుగుమల్లి, మర్రిపూడి, పొన్నలూరు, సింగరాయకొండ, టంగుటూరు, కందుకూరు, వలేటివారిపాలెం, గుడ్లూరు, ఉలవపాడు, లింగసముద్రం, కనిగిరి, పీసీపల్లి, సీఎస్‌పురం, పామూరు, వెలిగండ్ల, హనుమంతునిపాడు, దర్శి, కురిచేడు, దొనకొండ, ముండ్లమూరు, తాళ్లూరు మండలాల్లో ఈనెల 11న నిర్వహించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఎక్కువగా అత్యంత సమస్యాత్మక గ్రామాలు నేటితో తెర
ఈ మండలాల్లో ఉండటంతో పోలీసులను కూడా భారీ స్థాయిలో మొహరించేందుకు జిల్లా అధికారులు సిద్ధమవుతున్నారు. బుధవారం సాయంత్రం 5 గంటలకల్లా ప్రచారానికి తెరపడుతుంది. పోలింగ్ కేంద్రాలుండే పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలకు ఈనెల 10వ తేదీ సెలవు ప్రకటించారు.
ప్రచార పర్వంలో వైఎస్సార్‌సీపీ ముందంజ:
తొలిదశ ఎన్నికల్లో సానుకూలంగా ఉన్న ఓటింగ్ సరళితో వైఎస్సార్ సీపీ శ్రేణులు రెట్టించిన ఉత్సాహంతో మలివిడత పోరుకు సన్నద్ధమయ్యాయి. ప్రతి కార్యకర్త విజయమే పరమావధిగా పనిచేస్తుంటే..టీడీపీలో మాత్రం అంతర్గత కుమ్ములాటలు దిగువస్థాయి నాయకులను కుంగదీస్తున్నాయి. సంతనూతలపాడు నియోజకవర్గ నేతల్లో తీవ్ర అసంతృప్తి కనిపిస్తోంది. టీడీపీ తరఫున జెడ్పీ చైర్మన్ అభ్యర్ధిత్వాన్ని ఆశిస్తున్న జెడ్పీ వైస్ చైర్మన్ మన్నె రవీంద్ర, ఒంగోలు మాజీ ఎమ్మెల్యే ఈదర హరిబాబు పోటీ చేస్తున్న రెండు జెడ్పీటీసీ స్థానాలు రెండో దశలోనే ఉన్నాయి. దాంతో వారు దాదాపు తమ ప్రాంతాలకే పరిమితమయ్యారు. ఈదర హరిబాబు అప్పుడప్పుడూ కొత్తపట్నం మండలంలో పర్యటిస్తున్నా..ఆ ప్రాంత కేడర్‌లో మనోధైర్యం నింపలేకపోయారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
డీలాపడిన ‘దేశం’ అభ్యర్థులు:
ప్రాదేశిక స్థానాలకు పోటీ చేస్తున్న తెలుగు తమ్ముళ్లు తమ నేతలు పూర్తి సహకారం అందిస్తాం అంటేనే బరిలోకి దిగారు. ఆ మేరకు నామినేషన్ వేసి ప్రచారం చేస్తున్నా వారి నుంచి ఆశించిన సహకారం మాత్రం లభించడం లేదని వాపోతున్నారు. నాయకుల మధ్య విభేదాలు తారస్థాయిలో ఉన్నాయి. మండలానికి రెండు మూడు వర్గాలు ఏర్పడటంతో ప్రాదేశిక బరిలో ఉన్న అభ్యర్థుల్లో నిరాశా నిస్పృహలు నెలకొన్నాయి. ఈ దశలో మద్యం, డబ్బు పంపిణీపైనే దృష్టిపెట్టి ఓటర్లను ఆకర్షించేందుకు యత్నిస్తున్నారు.
11న మలివిడత ప్రాదేశిక పోరు
Published Wed, Apr 9 2014 2:26 AM | Last Updated on Sat, Sep 2 2017 5:45 AM
Advertisement
Advertisement