
మోడీ హవా మీడియా సృష్టి
గువాహటి: దేశంలో నరేంద్ర మోడీ గాలి వీస్తోందంటూ జరుగుతున్న ప్రచారాన్ని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కొట్టిపాడేశారు. అదంతా మీడియా సృష్టేనని చెప్పారు. భార్య గురుశరణ్ కౌర్‌తో కలసి గురువారం దిస్‌పూర్ ప్రభుత్వ పాఠశాలలో ఓటు వేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ఓడిపోతుందని తాను అనుకోవడంలేదన్నారు. ఫలితాలు వచ్చే వరకూ ఎదురు చూడాలని చెప్పారు. తమ పార్టీ మెజార్టీ సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఆయన ఉదయం ఢిల్లీ నుంచి వాయుసేన ప్రత్యేక విమానంలో ఇక్కడికి వచ్చారు.