తుది పోరులో 317 మంది
తుది పోరులో 317 మంది
Published Wed, Mar 19 2014 3:32 AM | Last Updated on Sun, Sep 2 2018 4:46 PM
ముగిసిన మున్సిపల్ నామినేషన్ల ఉపసంహరణ పర్వం
చివరి రోజు రంగం నుంచి తప్పుకొన్న 249 మంది
31 వార్డుల్లో కాంగ్రెస్‌కు అభ్యర్థులు లేరు
పాలకొండలో అత్యధికంగా 42 మంది స్వతంత్రులు
వైఎస్‌ఆర్‌సీపీ, టీడీపీ ఢీ అంటే ఢీ
శ్రీకాకుళం సిటీ, న్యూస్‌లైన్: పురపోరుకు బల గాలు సిద్ధమయ్యాయి. నామినేషన్ల ఘట్టం పరిసమాప్తం కావడంతో ఇక ప్రచార యుద్ధానికి ప్రధాన పార్టీలు అస్త్రశస్త్రాలకు పదును పెడుతున్నారు. వ్యూహప్రతివ్యూహాల్లో నిమగ్నమయ్యారు. ఈ ఎన్నికల్లో నామినేషన్ల దశలోనే కాంగ్రెస్ చేతులెత్తేయడంతో వైఎస్‌ఆర్‌సీపీ, టీడీపీల మధ్య ప్రధాన పోరాటం జరగనుంది. మంగళవారం సాయంత్రంతో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో ఎన్నికల అధికారులు ఆయా మున్సిపాలి టీల్లో బరిలో మిగిలిన అభ్యర్థుల వివరాలు ప్రకటించారు. జిల్లాలో ఎన్నికలు జరుగుతున్న ఇచ్ఛాపురం, పలాస-కాశీబుగ్గ, ఆమదాలవలస, పాలకొండ మున్సిపాలిటీల్లో మొత్తం 91 వార్డులుండగా 317 మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
మొత్తం 571 నామినేషన్లు దాఖలు కాగా, పరిశీలన తర్వాత 566 మంది మిగిలారు. వీరిలో 249 మంది అభ్యర్థులు ఉపసంహరించుకోవడంతో తుది బరిలో 317 మంది నిలిచారు. చివరి రోజున ఆమదాలవలసలో 78 మంది, ఇచ్ఛాపురంలో 67, పలాస-కాశీబుగ్గలో 53, పాలకొండలో 51 మంది నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. దీంతో అసలు పోరు మొదలైంది. ఇక ప్రచారం ఊపందుకోనుంది. వచ్చే రెండు నెలల్లో జరగనున్న ఎన్నికల్లో మొదటివి మున్సిపల్ ఎన్నికలే కావడంతో ఇక్కడ సాధిం చే విజయం సార్వత్రిక ఎన్నికలపై పెను ప్రభావం చూపుతుంది. అందువల్లే ప్రధాన పార్టీలైన వైఎస్సార్ కాంగ్రెస్, తెలుగుదేశం, కాంగ్రెస్‌లు వీటిని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. కాగా అన్ని మున్సిపాల్టీల్లోనూ వైఎస్సార్ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ తరపున వార్డులకు సమాన సంఖ్యలో అభ్యర్థులు ఉండటం విశేషం.
వైఎస్సార్‌సీపీ, టీడీపీల మధ్యే...!
నాలుగు మున్సిపాలిటీల్లోనూ నామినేషన్ల ఉపసంహరణ చివరి రోజున అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు తమకు వ్యతిరేకంగా ఉన్న అభ్యర్థులను రంగం నుంచి తప్పిం చేందుకు తీవ్రంగా ప్రయత్నిం చాయి. బుజ్జగింపులు, బెదిరింపు లు జోరుగా సాగాయి. ఫలితంగా పెద్ద సంఖ్యలో అభ్యర్థులు రంగం నుంచి తప్పుకొన్నారు. మరికొం దరు కూడా ఇతరత్రా కారణాలతో నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. తుదిపోరుకు నిలిచిన అభ్యర్థులను పరిశీలిస్తే నాలుగుచోట్ల కూడా వైఎస్సార్‌సీపీ, టీడీపీల మధ్యే ప్రధాన పోటీ నెలకొన్నట్లు స్పష్టమైంది. దాదాపుగా అన్ని చోట్లా కాంగ్రెస్ అభ్యర్థులు నామమాత్రంగానే కొనసాగుతున్నారు. పాలకొండలో 20 వార్డుల కు గాను 6 చోట్లే ఆ పార్టీ అభ్యర్థులు ఉన్నా రు. కేంద్రమంత్రి కృపారాణికి చెందిన శ్రీకాకుళం లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని పలాసలో 25 వార్డులకు 14, ఇచ్ఛాపురంలో 23 వార్డులకు 16 చోట్ల, ఆమదాలవల సలో 23 వార్డుల కు 19 చోట్ల కాం గ్రెస్ అభ్యర్థులు ఉన్నారు. మొత్తం జిల్లాలో 31 వార్డుల్లో కాంగ్రెస్‌కు అభ్యర్థులు లేరు. కాగా అత్యధికంగా పాలకొండలో 42 మంది స్వతంత్రులు బరిలో ఉండటం విశేషం. ఇక్కడ 14వ వార్డు ఏకగ్రీవమైన విషయం తెలిసిందే. ఈ నెల 30న జరుగనున్న ఎన్నికల్లో విజేతలయ్యేందుకు ప్రధానంగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్, టీడీపీ అభ్యర్థుల్లో తీవ్ర పోటీ నెలకొంది. అయితే స్థానికంగా నాయకత్వ లేమితో తెలుగుదేశం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది.
బరిలో ఉన్నది వీరే..
మున్సిపాలిటీ మొత్తం వార్డులు వైఎస్సార్‌సీపీ టీడీపీ కాంగ్రెస్ ఇతరులు మొత్తం
ఆమదాలవలస 23 23 23 19 16 81
ఇఛ్చాపురం 23 23 23 16 16 78
పలాస-కాశీబుగ్గ 25 25 25 14 12 76
పాలకొండ 20 17 17 06 42 82
Advertisement
Advertisement