పొత్తుల తలుపులు మూసుకోలేదు | No close doors to alliance of Telagana, says Harish rao | Sakshi
Sakshi News home page

పొత్తుల తలుపులు మూసుకోలేదు

Published Thu, Apr 3 2014 1:13 AM | Last Updated on Fri, Aug 10 2018 6:45 PM

పొత్తుల తలుపులు మూసుకోలేదు - Sakshi

పొత్తుల తలుపులు మూసుకోలేదు

* సాక్షితో పొత్తులపై టీఆర్‌ఎస్ సీనియర్ నేత హరీష్‌రావు
కాంగ్రెస్.. బీజేపీ.. ఏ పార్టీతోనైనా పొత్తు ఉండొచ్చు
* టీఆర్‌ఎస్ సీనియర్ నేత హరిష్‌రావు
* టీడీపీ-బీజేపీ పొత్తు ప్రయుత్నం అపవిత్రం

 
 అమరవీరుల కుటుంబాలను తగిన రీతిలో గౌరవిస్తాం. కచ్చితంగా వాళ్లకు సీట్లు ఇస్తాం. అందులో అనుమానం లేదు. కొన్ని పార్టీలు శవ రాజకీయాలు చేస్తున్నాయి. టీడీపీ నుంచి మరో తొమ్మిది మంది ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌తో టచ్‌లో ఉన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీకి చెందిన చాలా మంది ఎమ్మెల్యేలు పార్టీలో చేరుతామని చెప్తున్నారు.
 
వర్ధెల్లి వెంకటేశ్వర్లు, సంగారెడ్డి: తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్)-కాంగ్రెస్ పార్టీల వుధ్య పొత్తుకు తలుపులు వుూసుకుపోలేదు. ఇంకా పొత్తు తలుపులు తెరిచే ఉన్నాయుని అనుకుంటున్నా. దీనిపై టీఆర్‌ఎస్ పొత్తుల కమిటీ కసరత్తు చేస్తూనే ఉంది...’ అని ఆ పార్టీ అధినేత కేసీఆర్ మేనల్లుడు, ఆ పార్టీ అగ్రనేతల్లో ఒకరైన సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు చెప్పారు. బుధవారం ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడుతూ టీఆర్‌ఎస్-కాంగ్రెస్ పార్టీల వుధ్య పొత్తు ఉందో లేదో తేల్చి చెప్పకుండానే ఇంకా పొత్తు తలుపులు మూసుకుపోలేదని అంటూనే బీజేపీతో కూడా ఉండే అవకాశాలు లేకపోలేదని నర్మగర్భంగా చెప్పారు.
 
 అదే సవుయంలో టీడీ పీతో బీజేపీ పొత్తు ప్రయుత్నాలు చేయుడాన్ని హరీష్‌రావు తీవ్రంగా తప్పుపట్టారు. మరో పక్క బీజేపీతో టీఆర్‌ఎస్ పొత్తు పెట్టుకుంటే ఎలా ఉంటుందనే అంశాన్ని ప్రస్తావించి నప్పుడు కొట్టివేయకుండా అన్యాపదేశంగా వుద్దతు తెలిపి రాజకీయు విజ్ఞతను ప్రదర్శించారు. టీఆర్‌ఎస్‌తో పొత్తులు కోరుకునే పార్టీలు అసెంబ్లీ అభ్యర్థుల జాబితా ఎప్పుడో సిద్ధం చేశారుు. పొత్తుల ఖరారు కోసమే ఆ జాబితాల్ని బయట పెట్టడం లేదు. పొత్తులపై పార్టీ కమిటీ కసరత్తు ఒకటి రెండు రోజుల్లో స్పష్టత రావచ్చని హరీష్ పేర్కొన్నారు.
 
 ఒంటరి పోరుకు సిద్ధంగా ఉన్నామంటూనే పొత్తుల తలుపులు ఇంకా మూసుకోలేదని టీఆర్‌ఎస్  కీలక నేత టి.హరీష్‌రావు అంటున్నారు. కాంగ్రెస్‌తో పొత్తు అవకాశాలను కొట్టివేయకుండానే బిజేపీతోనూ జత కలిసే అవకాశం లేకపోలేదన్న సంకేతాలు ఇస్తున్నారు. జోగిపేటలో ‘సాక్షి’తో ఆయన తాజా రాజకీయ పరిణామాలపై మాట్లాడారు. హరీష్‌రావు అభిప్రాయాలు ఆయన మాటల్లోనే...
 తెలంగాణ పదాన్ని ఉచ్చరించడానికే ఇష్టపడని టీడీపీతో బీజేపీ పొత్తు ప్రయుత్నాలు చేయుడం అపవిత్ర చర్య. పార్లమెంటులో తెలంగాణ  రాష్ట్ర బిల్లుకు బీజేపీ నాయకురాలు సుష్మాస్వరాజ్  సహకరించిన తర్వాత ‘పెద్దమ్మ (సోనియా గాంధీ)తో పాటు ఈ చిన్నమ్మ (సుష్మ)ను కూడా గుర్తు పెట్టుకోండి..’అని విజ్ఞప్తి చేశారు. కానీ, బీజేపీ నాయకులు ఆమెను గుర్తు పెట్టుకోకుండా తెలంగాణ ద్రోహి చంద్రబాబును నమ్ముకుని నష్టపోయే దారిలో వెళ్తున్నారు. ఇది బీజేపీకి తీరనినష్టం. తెలంగాణ పదాన్నే నిషేధించిన చంద్రబాబుకు తెలంగాణ ప్రజలు ఎట్లా ఓట్లు వేస్తారు?
 
 పొత్తు వల్లే ఓడిపోయామన్నారు...
 బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్లనే 2004లో ఓడిపోయామని చంద్రబాబు అప్పట్లో చెప్పారు. బీజేపీతో పొత్తు పెట్టుకోవడం పెద్ద తప్పేనని చెంపలు వేసుకున్నారు. నరేంద్ర మోడి ప్రధానమంత్రి పదవికే పనికిరాడని తేల్చేశారు. ఇప్పుడు అదే మోడీ తో కాళ్లబేరానికి సిద్ధపడుతున్నారు. తెలంగాణ టీడీపీ నాయకులే చంద్రబాబు బొమ్మను పక్కనబెట్టి ఎన్నికల ప్రచారం చేసుకుంటున్నారు. ఈ స్థితిలో చంద్రబాబు బొమ్మ పెట్టుకుని బీజేపీ తెలంగాణలో ఏమని ఓట్లు అడుగుతుంది? ఈ పార్టీల పొత్తు కుదిరితే టీఆర్‌ఎస్‌కు ఎలాంటి నష్టం జరగదు. తెలంగాణ కోసం ఉద్యమాలు చేసింది టీఆర్‌ఎస్ వూత్రమే! జనం టీఆర్‌ఎస్ వెంటే ఉంటారు. పొత్తులకు సంబంధించి  కాంగ్రెస్‌తో ఉన్నంత దూరమే బీజేపీతో కూడా ఉంది. ఏ పార్టీతోనైనా పొత్తు ఉండవచ్చు.
 
 అధికారానికి చేరువగా టీఆర్‌ఎస్
 ఎన్నికల బరిలో టీఆర్‌ఎస్ ఒంటరిగానే నిలవాలని భావిస్తోంది.  కాంగ్రెస్ పార్టీతో పొత్తుకు తలుపులు పూర్తిగా వుూసుకున్నాయుని చెప్పలేను. తెలంగాణ రాష్ర్టంలో టీఆర్‌ఎస్సే అతిపెద్ద పార్టీ కాబోతోంది. ఏ సర్వే చూసినా టీఆర్‌ఎస్‌కు 55 నుంచి 60 సీట్లు రానున్నాయుని చెబుతున్నారుు. ఎన్నికల నాటికి ఇంకా పెరుగుతాయుని అంచనా. అధికారానికి కొద్ది దూరంలో ఆగిపోతే ఆగిపోతాం. అధికార పగ్గాలు అందుకోడానికి పదో, పదిహేనో సీట్లు అవసరమైతే టీఆర్‌ఎస్‌కు మద్దతిచ్చే స్నేహపూర్వక పార్టీల సహకారం తీసుకుంటాం. కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో కూడా టీఆర్‌ఎస్ కీలక పాత్ర పోషిస్తుంది. రాష్ట్రంలో మాకు సహకరించే పార్టీకి కేంద్రంలో మేం కూడా సహకరిస్తాం. నిజానికి కాంగ్రెస్, బీజేపీ పార్టీలు రెండు కూడా టీఆర్‌ఎస్‌తో పొత్తులు పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాయి.   
 
 వివేక్‌ది స్వయంకృతం...
 ఎంపీ జి.వివేక్ టీఆర్‌ఎస్‌ను వీడాలన్న నిర్ణయం స్వయంకృతాపరాధం. ఎందుకు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారో నాకు తెలియదు. ఆయన వెళ్లిపోయినందుకు ఏమాత్రం బాధలేదు. కానీ ఎస్టాబ్లిష్ అయిన ఒక టీవీ ఛానల్ దూరమవుతుందని బాధపడ్డాం. పెద్దపల్లి పార్లమెంటు సీటు సహజంగానే టీఆర్‌ఎస్‌ది. అక్కడ సర్వే చేయిస్తే 72% టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా ఉంది. ధర్మపురి ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్‌ను ఇక్కడి నుంచి నిలబెట్టే ఆలోచనలో ఉన్నాం. ఆయున గతంలో మేడా రం ఎమ్మెల్యేగా కూడా చేశారు. ఈశ్వర్ బంపర్ మెజార్టీతో గెలుస్తారు.
 
 మెదక్, గజ్వేల్‌ల నుంచి కేసీఆర్ పోటీ..
 కేసీఆర్ మెదక్ పార్లమెంటు స్థానం నుంచి  పోటీ చేసేందుకే ఎక్కువ అవకాశాలున్నాయి. మా నివేదికల ప్రకారం టీఆర్‌ఎస్ నర్సాపూర్, పటాన్‌చెరు నియోజకవర్గాల్లో కొద్దిగా బలహీన ంగా ఉంది. కేసీఆర్ మెదక్ ఎంపీగా పోటీచేస్తే దాని పరిధిలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీకి తిరుగుండదు. గజ్వేల్ అసెంబ్లీ టీడీపీ నియోజకవర్గ ఇంచార్జి ప్రతాపరెడ్డి టీఆర్‌ఎస్‌లోకి వస్తే గజ్వేల్ సీటు ఆయనకే ఇద్దామని అనుకున్నాం. కేసీఆర్ మాట్లాడారు, నేను కూడా  మాట్లాడా. ఎందుకో ప్రతాపరెడ్డి వెనుకాడారు. వీటన్నింటినీ బేరీజు వేశాక కేసీఆరే గజ్వేల్ అసెంబ్లీ స్థానానికి కూడా బరిలో దిగనున్నారు. గజ్వేల్ నియోజకవర్గంలోని ములుగు మండలంలో చంద్రబాబుకు చెందిన హెరిటేజ్ సంస్థ కోల్డ్ స్టోరేజీలు ఉన్నాయి. ఈ కారణంగా టీడీపీకి గజ్వేల్ కీలకం. అందుకే ఇక్కడ టీడీపీ కోట్ల రూపాయుల్ని ఖర్చు చేస్తోంది. రైతులకు హెరిటేజ్ బర్రెలు ఇస్తోంది. డబ్బులు ఇస్తోంది. గజ్వేల్ కోసం టీడీపీ ఎన్నో విషప్రయత్నాలు చేస్తోంది. అరుునా ఇక్కడ టీఆర్‌ఎస్‌దే పైచేరుు.
 
  గత పాలనపై చంద్రబాబు పెదవి విప్పరేం?
 చంద్రబాబు ఆల్ ఫ్రీ మాటలు చెప్తున్నారు. చంద్రబాబుకు సవాల్ చేస్తున్నా. తొమ్మిదేళ్ల తన పాలనను తిరిగి తెస్తానని చంద్రబాబు ప్రజల్లోకి వెళ్లగలరా? టీడీపీ వూటలు వింటుంటే నమ్మించి తెలంగాణ ప్రజల గొంతు కోసేట్టట్టుంది. తెలంగాణ ప్రజలు బలంగా కోరుకుంటున్న అంశాలను టీడీపీ ఎందుకు ప్రస్తావించడం లేదు. తెలంగాణను ముంచే పోలవరం డిజైన్ మార్చమని మేం మొదటి నుంచి చెప్తున్నాం. చంద్రబాబు దీనిపై పెదవి కూడా విప్పడం లేదు. విద్యా సంస్థల్లో ఉమ్మడి ప్రవేశాల గురించి ప్రస్తావన కూడా చంద్రబాబు చేయుకపోవడాన్ని బట్టే ఆయునకు తెలంగాణపై ఎంత ప్రేవు ఉందో అర్ధం చేసుకోవచ్చు.   
 
 శవరాజకీయూలు తగదు
 తెలంగాణ కోసం ఉద్యమించిన అన్ని వర్గాల వారితోబాటు అమరవీరుల కుటుంబాలను తగిన రీతిలో గౌరవిస్తాం. కచ్చితంగా వాళ్లకు సీట్లు ఇస్తాం. అందులో అనుమానం లేదు. కొన్ని పార్టీలు శవ రాజకీయాలు చేస్తున్నాయి. అమర వీరుల త్యాగాలను రాజకీయం చేస్తున్నాయి.  తవు తల్లిదండ్రులు ఎమ్మెల్యేలు కావాలని వారు ప్రాణత్యాగం చేయలేదు. వాళ్లు బంగారు తెలంగాణ కోరుకున్నారు. నవతరానికి బంగారు బాటలు వేయాలకున్నారు. తెలంగాణ పార్టీ అమరుల త్యాగాలను, వాళ్ల కుటుంబాలను  ఎప్పుడూ మరిచిపోదు. వారికి అండగా నిలబడుతాం.
 
 దక్షిణ తెలంగాణలోనూ పార్టీ బలంగానే ఉంది..
 దక్షిణ తెలంగాణ జిల్లాల్లో టీఆర్‌ఎస్ బలంగా లేదన్నది దుష్ర్పచారమే. అన్ని జిల్లాల్లో మాకు బలమైన క్యాడర్ ఉంది. పాలమూరులో కనీసం 11 అసెంబ్లీ స్థానాలు గెలుచుకుంటాం. రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లో సగం సీట్లు మాకే వస్తాయి. ఖమ్మం జిల్లాలో కూడా జలగం వెంకట్రావ్ చేరాక టీఆర్‌ఎస్ బాగా పుంజుకుంది. పార్టీ బలహీనంగా ఉందనే ప్రశ్నే లేదు. టీడీపీ నుంచి తొమ్మిది మంది ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌తో టచ్‌లో ఉన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీకి చెందిన చాలా మంది ఎమ్మెల్యేలు పార్టీలో చేరుతామని చెప్తున్నారు. ఉద్యమ కారులకు, విద్యార్ధులకు, అమర వీరుల కుటుంబాలకు సీట్లు ఇవ్వాలనే ఆలోచనతోనే వారిని పార్టీలోకి తీసుకోవడం లేదు.
 
 టీఆర్‌ఎస్‌కే జేఏసీ వుద్దతు
 తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమించిన ఏకైక రాజకీయు పార్టీ టీఆర్‌ఎస్. త్యాగాలు చేసింది. కష్టాల కోర్చింది. తెలంగాణ సాధనలో జేఏసీ  ప్రధాన భూమిక పోషించింది. అరుుతే జేఏసీ వుద్దతు వూత్రం టీఆర్‌ఎస్‌కే ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement