
రూ.16 కోట్ల విలువైన బంగారం స్వాధీనం
అనంతపురం : అనంతపురం జిల్లాలో పోలీసుల తనిఖీల్లో భారీగా బంగారం పట్టుబడింది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు ముసలమ్మకట్ట వద్ద అనంతపురం నుంచి కడప వెళుతున్న వాహనంలో సుమారు 16 కోట్ల రూపాయల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ సొత్తు మణప్పురం సంస్థదని సిబ్బంది చెబుతున్నారు.
కాగా ప్రొద్దుటూరులో ఓ బంగారు దుకాణం ప్రారంభిస్తున్న సందర్భంగా ఆభరణాలను తరలిస్తున్నట్లు సిబ్బంది తెలిపారు. అయితే దానికి సంబంధించిన ఆధారాలు చూపాలని పోలీసులు కోరారు. స్వాధీనం చేసుకున్న బంగారు ఆభరణాలను బుక్కరాయ సముద్రం పోలీస్ స్టేషన్కు తరలించారు. సరైన ఆధారాలు, ఇన్కం ట్యాక్స్ పేపర్లు చూపించిన తర్వాతే స్వాధీనం చేసుకున్న సొత్తును తిరిగి అప్పగిస్తామని పోలీసులు చెబుతున్నారు.