మున్సిపల్‌ ఎన్నికల ఫలితాలపై వీడని సస్పెన్స్‌ | Suspense Continue on Municipal Poll Results in Andhra Pradesh | Sakshi
Sakshi News home page

మున్సిపల్‌ ఎన్నికల ఫలితాలపై వీడని సస్పెన్స్‌

Published Fri, Mar 28 2014 1:38 PM | Last Updated on Sun, Sep 2 2018 5:20 PM

మున్సిపల్‌ ఎన్నికల ఫలితాలపై వీడని సస్పెన్స్‌ - Sakshi

మున్సిపల్‌ ఎన్నికల ఫలితాలపై వీడని సస్పెన్స్‌

హైదరాబాద్ : మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై ఇంకా సస్పెన్స్ వీడలేదు. మున్నిపల్ ఎన్నికల ఫలితాలపై విచారణను హైకోర్టు ఏప్రిల్ 1వ తేదీకి వాయిదా వేసింది. సార్వత్రిక ఎన్నికలు పూర్తయ్యేవరకూ మున్సిపల్ ఫలితాలను నిలిపివేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై హైకోర్టు శుక్రవారం సుదీర్ఘంగా విచారణ జరిగింది. అనంతరం పిటిషన్ తదుపరి విచారణను వచ్చే నెల 1వ తేదీకి వాయిదా వేసింది. కాగా ఫలితాల విషయంలో సుప్రీంకోర్టు తీర్పులో స్పష్టత లేదని రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ సందర్భంగా న్యాయస్థానానికి తెలిపింది. స్పష్టత కోసం రివ్య్యూ పిటిషన్ వేయనుంది.

ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను రెండు విడతలుగా ఏప్రిల్ 6, 11 తేదీల్లో నిర్వహించేందుకు సుప్రీంకోర్టు రాష్ట్ర ఎన్నికల సంఘానికి నిన్న అనుమతి ఇచ్చింది. అయితే వీటి ఫలితాలను మాత్రం సార్వత్రిక ఎన్నికల పోలింగ్ తరవాతే వెల్లడించాలని ఆదేశించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement