'మాకు పోయేదేమీ లేదు....మీకే నష్టం'
హైదరాబాద్ : రాష్ట్రంలో టీడీపీ - బీజేపీ పొత్తుల విషయంలో సయోధ్య కుదరటం లేదు. నామినేషన్ల దాఖలుకు ఇంకా రెండు రోజుల సమయమే ఉంది. అయినప్పటికీ ఎమ్మెల్యే స్థానాల విషయంలో ఇరు పార్టీలు గందరగోళంలో ఉన్నాయి. పొత్తు విషయంలో టీడీపీ చర్యలు అనైతికమని బీజేపీ మండిపడుతోంది. ఏ అభ్యర్థినీ మార్చేది లేదని ఆపార్టీ స్పష్టం చేసింది.
బీజేపీకి కేటాయించిన స్థానాల్లో టీడీపీ అభ్యర్థులను నిలబెడితే తాము కూడా పోటీ చేస్తామని బీజేపీ వెల్లడించింది. పోటీకి నిలబడితే తమకు పోయేదేమీ...టీడీపీ అవకాశాలను దెబ్బతీస్తామని బీజేపీ హెచ్చరించింది. మరోవైపు బీజేపీ సీనియర్ నేత ప్రకాష్ జవదేకర్ గురువారం హైదరాబాద్ చేరుకున్నారు. అలాగే రాష్ట్రంలో పొత్తులపై చంద్రబాబు మోసపూరిత వైఖరిని గుర్తించాలని బీజేపీ అధిష్టానంతో ఆపార్టీ నేతలు చర్చలు జరుపుతున్నారు. దాంతో ఈరోజు సాయంత్రానికి బీజేపీ-టీడీపీ పొత్తుపై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది.