గల్ఫ్ బాధితులు, రైతుల నిరసన స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి..
ఆర్మూర్, ఏళ్ల తరబడి తమ సమస్యల పరిష్కారం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చుట్టూ కాళ్లరిగిపోయేలా తిరిగినా పట్టించుకోకపోవడంతో, లోక్‌సభ ఎన్నికలలో తమ నిరసన తెలపడానికి గల్ఫ్ బాధితులు, రైతులు సిద్ధమవుతున్నారు. లోక్‌సభ ఎన్నికలను వేదికగా చేసుకొని నిజామాబాద్ లోక్‌సభ స్థానం నుంచి పెద్ద ఎత్తున స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు వేయాలని నిర్ణయించారు.
ప్రవాస భారతీయుల సంక్షేమ, హక్కుల వేదిక, పసుపు రైతుల సంఘం అధ్యక్షుడు కోటపాటి నర్సింహనాయుడు ఆధ్వర్యంలో సుమారు వంద మంది బాధితులు బుధవారం నామినేషన్ వేయబోతున్నారు. జనరల్ అభ్యర్థులకు రూ.25వేల నామినేషన్ ఫీజు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.12,500 నామినేషన్ ఫీజును గ్రామాభివృద్ధి కమిటీలు, రైతు సంఘాలు, గల్ఫ్ బాధితుల సంఘాలు సమకూర్చుకుంటున్నాయి.
నేడు లోక్‌సభకు ‘వంద’ నామినేషన్లు
Published Wed, Apr 9 2014 3:54 AM | Last Updated on Sat, Mar 9 2019 3:34 PM
Advertisement