రాహుల్‌ 10న, సోనియా 11న నామినేషన్‌ | Rahul Gandhi to file nomination from Amethi on April 10, Sonia from Raebareli on 11th | Sakshi
Sakshi News home page

రాహుల్‌ 10న, సోనియా 11న నామినేషన్‌

Published Sat, Apr 6 2019 4:56 AM | Last Updated on Sat, Apr 6 2019 4:56 AM

Rahul Gandhi to file nomination from Amethi on April 10, Sonia from Raebareli on 11th - Sakshi

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ అమేథీ లోక్‌సభ స్థానానికి ఈ నెల 10వ తేదీన, ఆయన తల్లి యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియాగాంధీ రాయ్‌బరేలీలో 11వ తేదీన నామినేషన్‌ వేయనున్నారు. ఈ రెండు కార్యక్రమాలకు రాహుల్, సోనియాలతోపాటు కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా కూడా హాజరు కానున్నారని కాంగ్రెస్‌ వర్గాలు తెలిపాయి. ఈ సందర్భంగా జరిగే భారీ రోడ్‌షోకు కాంగ్రెస్‌ అగ్రశ్రేణి నేతలతోపాటు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు తరలివస్తారని తెలిపాయి. ఈ రెండు నియోజకవర్గాలకు మే 6వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. అమేథీ, రాయ్‌బరేలీ స్థానాల్లో తమ అభ్యర్థులను నిలపబోమంటూ ఎస్‌పీ–బీఎస్‌పీ కూటమి ప్రకటించిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement