నేడు వైవీ, బాలినేని నామినేషన్లు | today balineni srinivasa reddy and yv subba reddy nominations | Sakshi
Sakshi News home page

నేడు వైవీ, బాలినేని నామినేషన్లు

Published Thu, Apr 17 2014 4:41 AM | Last Updated on Wed, Aug 29 2018 8:54 PM

today balineni srinivasa reddy and yv subba reddy nominations

సాక్షి, ఒంగోలు : వైఎస్సార్ కాంగ్రెస్ తరఫున ఒంగోలు లోక్‌సభ, అసెంబ్లీ అభ్యర్థులైన వైవీ సుబ్బారెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి గురువారం నామినేషన్లు దాఖలు చేయనున్నారు. ఇద్దరి నామినేషన్ దాఖలు ముహూర్తం మధ్యాహ్నం 2.05 నిముషాలకు నిర్ణయించారు. తొలుత వైవీ సుబ్బారెడ్డి 2.05 నిముషాలకు నామినేషన్  సమర్పించ నుండగా.. 2.06 కు బాలినేని శ్రీనివాసరెడ్డి నామినేషన్ వేయనున్నారు. ఈ మేరకు ఒంగోలు లోక్‌సభ స్థానం పరిధిలోని ఏడు నియోజకవర్గాల పార్టీ నేతలు, కార్యకర్తలు భారీ ఎత్తున తరలిరానున్నారు. ఉదయం పది గంటలకు కర్నూలు బైపాస్ రోడ్డు నుంచి ర్యాలీ ప్రారంభం కానుంది.

 ఆర్టీసీ బస్టాండ్, అద్దంకి బస్టాండ్, పాత కూరగాయల మార్కెట్ మీదుగా చర్చి సెంటర్‌కు ర్యాలీ చేరుకోనుంది. అనంతరం కలెక్టరేట్ కార్యాలయంలోని జిల్లా ప్రధాన ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ విజయకుమార్‌కు ఎంపీ అభ్యర్థి వైవీ సుబ్బారెడ్డి నామినేషన్ పత్రాలు  అందజేయనున్నారు. అదే విధంగా ఆర్డీవో కార్యాలయంలో ఆర్‌వోగా ఉన్న ఎస్.మురళికి అసెంబ్లీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి నామినేషన్ పత్రాలను అందజేయనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement