సీమాంధ్రను అంతర్జాతీయ చిత్రపటంలో సరికొత్తగా ఆవిష్కరించే కొత్త రాజధాని నగరాన్ని రూపొందిస్తారు. దీన్లో గ్రీన్‌జోన్లు, ఇన్నోవేషన్ హబ్‌లు, టౌన్‌షిప్‌లు, రిక్రియేషన్ జోన్లు, ఆరోగ్యం- విద్యా హబ్‌లు, స్మార్ట్ సిటీలో ఉండే సౌకర్యాలు... అన్నీ ఈ కొత్త రాజధానిలో చోటు చేసుకుంటాయి. పౌరులందరికీ భద్రత, రక్షణ కల్పించే ఈ రాజధాని నగరంలో నడిచి వెళ్లే దూరంలో అన్ని సౌకర్యాలు, సమస్త సౌకర్యాలుండే నివాస సముదాయాలు ఉంటాయి. పచ్చని, నివసించదగ్గ వాతావరణంలో పౌరులు భద్రంగా ఉంటారు. అటు కుప్పం నుంచి ఇటు శ్రీకాకుళం దాకా అందరికీ అందుబాటులో ఉండే ఈ రాజధాని... ఎవరైనా ఈజీగా చేరుకునేలా ఉంటుంది. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ వంటి నగరాలతోనూ కనెక్ట్ అయి ఉంటుంది.
విధాన సభ
500 ఎకరాల్లో నిర్మితమయ్యే విధాన సభ గార్డెన్స్... ప్రభుత్వ భవనాలకు అద్భుతమైన వేదికగా ఉంటుంది.
కొత్త నగరంలో విధానసభకు ఎదురుగా... స్టేట్‌మెంట్లతో కూడిన స్మారక కట్టడం.
విధాన సభ నిర్మాణాలు సీమాంధ్ర తాలూకు ఘనమైన సంస్కృతిని, విలువను ప్రతిబింబిస్తాయి.
విధాన సభ చుట్టూ చెరువులు, సెంట్రల్ పార్కు... దాని చుట్టూ రిటైల్, వినోద ప్రాంతాలు.
ఇన్నోవేషన్ హబ్
దీన్ని రాజధాని నగరంలో ఏర్పాటు చేస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఉండే పారిశ్రామిక వేత్తలు, మేధావులు, పెట్టుబడిదారుల్ని ఆకట్టుకునేట్టుగా ఉంటుంది.
సంప్రదాయేతర ఇంధనం, టెక్నాలజీ, వ్యవసాయం, తయారీ రంగాల్లో ఇన్నోవేషన్‌ను ప్రభుత్వం మద్దతిచ్చి ప్రోత్సహిస్తుంది.
ఇన్నోవేషన్ హబ్‌కు 500 ఎకరాల స్థలం. దీన్లో కార్పొరేట్లకు, పరిశోధన- అభివృద్ధి కార్యకలాపాలకు 20 లక్షల చదరపుటడుగుల కార్యాలయ స్థలం.
ప్రోత్సాహక సంస్థల ద్వారా విదేశీ ఇన్వెస్టర్లు, పరిశోధన సంస్థలు, విద్యా సంస్థల్ని రప్పించడానికి కృషి.
ఇవీ రాజధాని హైలైట్స్
100కు పైగా కమ్యూనిటీ పార్కులతో దేశంలోనే అత్యుత్తమ గార్డెన్ సిటీగా రాజధాని నగరం రూపొందుతుంది.
60 శాతం పచ్చదనం, పచ్చని సైకిల్ ట్రాక్‌లు, పర్యావరణ అనుకూల ఆర్కిటెక్చర్, సంప్రదాయేతర ఇంధనాల వినియోగం.
విద్యా, పరిశోధన, వ్యాపార, ప్రభుత్వ కార్యకలాపాలకు అవసరమైన మౌలిక సదుపాయాలతో అంతర్జాతీయ స్థాయి ఇన్నోవేషన్ హబ్.
ప్రభుత్వ భవనాలు, విధాన సభ రాష్ట్ర సంస్కృతిని ప్రతిబింబించేలా ఉంటాయి.
ఘనమైన సాంస్కృతిక సంపద... ఈ నగర కేంద్రం చుట్టూ అల్లుకుని ఉంటుంది.
నైబర్ హుడ్స్...
నివాస, వాణిజ్య ప్రాంతాలు రెండూ కలగలిపి ఉండేలా అభివృద్ధి. దీన్లో తక్కువ ఎత్తుండేవి, మధ్య స్థాయి భవనాలతో పాటు ఆకాశ హర్మ్యాలూ ఉంటాయి.
ఈ ప్రాంతాలకు నడిచివెళ్లే దూరంలోనే... అందరికీ అందుబాటులో 50 ఎకరాల పచ్చటి ఉద్యానవనం.
పచారీ కొట్లు, కార్యాలయాలు, పోస్టాఫీసు, రిటైల్ షాపులన్నీ నడిచి వెళ్లే దూరంలోనే.
ఆధారపడదగ్గ, స్మార్ట్ సిటీ ఇంటెలిజెంట్ రవాణా వ్యవస్థ, సెక్యూరిటీ కార్యకలాపాలు. సోలార్ లైటింగ్, వేస్ట్ మేనేజ్‌మెంట్, పర్యావరణ జోన్లు దీన్లో భాగంగా ఉంటాయి.