
పొత్తు కుదరలేదనే మాపై ఆరోపణలు: వెంకయ్య
తమ పార్టీతో పొత్తు పెట్టుకోవాలని టీఆర్ఎస్ ప్రయత్నించిందని, అది సఫలం కానందునే తమపై ఆరోపణలు చేస్తోందని బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు అన్నారు. ఆంధ్ర, తెలంగాణ రెండు ప్రాంతాల్లోనూ బీజేపీకి ఎక్కువ స్థానాలు వస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.మూడున్నాళ్ల ముచ్చట ప్రభుత్వాలు వద్దనుకుంటే బీజేపీకి ఓటేయాలని వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. గతంలో కూడా కేంద్రంలో ఒకసారి థర్డ్ ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పడినా అది మూడునాళ్ల ముచ్చటగానే మిగిలిపోయిందన్నారు.
టీఆర్ఎస్ ను ఓడించడమే తమ ముందున్న లక్ష్యమని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలొ అధికారం దిశగానే బీజేపీ యత్నిస్తోందన్నారు. కేంద్రలో సుస్థిరపాలన అందించాలంటే అది ఒక్క బీజేపీకే సాధ్యమన్నారు. టికెట్ల కేటాయింపులో కొన్ని పొరపాట్లు జరిగాయన్నారు.