ఓటమి భయంతోనే బీజేపీపై కేసీఆర్ నిందలు: వెంకయ్య
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖరరావులపై బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ.. గత్యంతరం లేకే కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చింది అని వెంకయ్య అన్నారు. తెలంగాణ ఆలస్యానికి, వెయ్యి మంది బలిదానాలకు కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌లదే బాధ్యత అని వెంకయ్యనాయుడు ఆరోపించారు.
ఓటమి భయంతోనే కేసీఆర్ బీజేపీపై నిందలు వేస్తున్నారని ఆయన అన్నారు. బీజేపీతో పొత్తుకు కేసీఆర్ ఎందుకు ముందుకువచ్చాడని వెంకయ్య ప్రశ్నించారు. తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు కింద పనిచేసిన విషయాన్ని కేసీఆర్ అని గుర్తించుకోవాలని వెంకయ్యనాయుడు హితవు పలికారు.
బీజేపీ-టీడీపీది అపవిత్ర పొత్తు అంటున్న కేసీఆర్ వ్యాఖ్యలను కేసీఆర్ తప్పుపట్టారు. గతంలో తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్న విషయాన్ని కేసీఆర్ మరిచిపోతే ఎలా అని వెంకయ్యనాయుడు చురకలంటించారు.