
కేంద్రంలో థర్డ్‌ఫ్రంట్ వస్తే ఆలోచిస్తాం: ఈటెల
సాక్షి, హైదరాబాద్: కేంద్రంలో థర్డ్‌ఫ్రంట్‌కు అవకాశం వస్తే ఆలోచిస్తామని టీఆర్‌ఎస్ శాసనసభాపక్ష మాజీ నేత ఈటెల రాజేందర్ అన్నారు. శనివారం ఆయనిక్కడ విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల అనంతర పరిస్థితులను బట్టి కేంద్రంలో ఎలాంటి వైఖరిని అనుసరించాలనేది నిర్ణయించుకుంటామన్నారు. గ్రామాల్లో తాగునీటికి, కరెంటుకు తీవ్ర ఇబ్బందులున్నా ఎన్నికల కోడ్‌ను సాకుగా చూపించి పరిష్కరించడం లేదని ఈటెల విమర్శించారు. గవర్నరు జోక్యం చేసుకుని, పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్‌ను లక్ష్యంగా చేసుకుని దుష్ర్పచారం, ప్రలోభాలు పెట్టినా టీఆర్‌ఎస్‌కు ప్రజలు పట్టంకట్టారని ధీమాను వ్యక్తం చేశారు. తెలంగాణలో తొలి ప్రభుత్వాన్ని టీఆర్‌ఎస్ ఏర్పాటుచేస్తుందన్నారు. నోముల నర్సింహ్మయ్య మాట్లాడుతూ పవన్ కల్యాణ్ ఎవరి ప్రయోజనాలకోసం పార్టీని పెట్టాడో తేలిపోయిందన్నారు.