పాలవుూరు పీఠమెవరికో..? | who won in the palamuru | Sakshi
Sakshi News home page

పాలవుూరు పీఠమెవరికో..?

Published Mon, Apr 21 2014 1:42 AM | Last Updated on Mon, Oct 8 2018 5:04 PM

పాలవుూరు పీఠమెవరికో..? - Sakshi

పాలవుూరు పీఠమెవరికో..?

జిల్లా కేంద్రమైన మహబూబ్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గం 1952లో ఏర్పడింది. తెలంగాణ కల సాకారం అరుున నేపథ్యంలో జరుగుతున్న ఈసారి ఎన్నికల్లో విజయుం ఎవరిని వరిస్తుందోనన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. ఉద్యవూన్ని నడిపించిన ఫలితంగానే తెలంగాణ వచ్చిందని టీఆర్‌ఎస్, తామిచ్చిన వూట ప్రకారమే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేశావుని కాంగ్రె స్, పార్లమెంటులో తెలంగాణ బిల్లుకు తవు పార్టీ వుద్దతు ఇవ్వడం వల్లే తెలంగాణ వచ్చిందని బీజేపీ చెప్పుకుంటున్నారుు. వైఎస్ రాజశేఖరరెడ్డి అవులు చేసిన అనేక సంక్షేవు పథకాల కు ఓటర్ల వుద్దతు లభిస్తుందనే ధీవూతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా ప్రచారంలో వుుందుంది.
 
వరకవుల దుర్వాసరాజు-పాలమూరు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున బెక్కరి శ్రీనివాసరెడ్డి బరిలో ఉన్నారు. ఇతర పార్టీలకు దీటుగా ప్రచారం చేస్తున్నారు.  హోరాహోరీ  ప్రయుత్నాల్లో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఒబెదుల్లా కొత్వాల్ టికెట్ దక్కించుకున్నారు. టీఆర్‌ఎస్ పార్టీ తరఫున కూడా అదే స్థారుులో ప్రయుత్నాలు జరిగి చివరికి ఉద్యోగ సంఘాల నాయుకుడు వి.శ్రీనివాస్‌గౌడ్‌కు టికెట్ లభించింది. గత సాధారణ ఎన్నికల్లో, ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ తరఫున పోటీచేసి ఓడిపోరుున సయ్యద్ ఇబ్రహీం టికెట్ రాకపోవడంతో కాంగ్రెస్‌లో చేరి భంగపడ్డారు. కాంగ్రెస్ లోనూ టికెట్  రాకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేస్తున్నారు. టీఆర్‌ఎస్ తిరుబాటు అభ్యర్థిగా సీహెచ్ అమరేందర్‌నాథ్ పోటీలో ఉన్నా ప్రధాన పోటీ టీఆర్‌ఎస్, కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల మధ్యే ఉంటుంది.

 వుుగ్గురిని వరించిన వుంత్రి పదవులు
 ఈ స్థానంలో ఒకసారి ఉప ఎన్నికతో కలిపి మొత్తం పదిహేను సార్లు ఎన్నికలు జరిగారుు. టీడీపీ నుంచి పి.చంద్రశేఖర్ నాలుగుసార్లు గెలుపొందితే, కాంగ్రెస్ అభ్యర్థిగా ఇబ్రహీం అలీ అన్సారీ రెండుసార్లు, ఎమ్.ఆర్.రెడ్డి ఒకసారి ఇండిపెండెంట్‌గా, మరోసారి కాంగ్రెస్ తరఫున విజయుం సాధించారు (వురోసారి వనపర్తిలో కూడా ఆయున గెలిచారు.). 1957లో ప్రజా పార్టీ నుంచి ఇ.చిన్నప్ప విజయుం సాధించారు. ఇక్కడ గెలిచిన వారిలో ముగ్గురు మంత్రులుగా చేశారు. ఇబ్రహీం అలీ అన్సారీ,  కాసు బ్రహ్మానందరెడ్డి, పీవీ నరసింహారావు, జలగం వెంగళరావు మంత్రివర్గాలలో పనిచేశారు. చంద్రశేఖర్, ఎన్టీ రావూరావు, నారా చంద్రబాబునాయుుడు వుంత్రివర్గాల్లో ఉన్నారు. 1995 తెలుగుదేశం సంక్షోభ సమయంలో ఎన్టీ రామారావు పక్షాన ఉండి ఆతర్వాత నారా చంద్రబాబు నాయుడు చెంతకు చేరిపోయూరు. 1989లో చంద్రశేఖర్‌ను ఓడించిన కాంగ్రెస్ అభ్యర్థి పులి వీరన్న 1993లో కోట్ల విజయభాస్కర్‌రెడ్డి మంత్రివర్గంలో సభ్యుడిగా ఉన్నారు.

తిరుగుబాటు అభ్యర్థులకూ పట్టం
ఆయా పార్టీల నుంచి టికెట్ ఆశించి భంగపడిన వారు స్వతంత్రులుగా పోటీచేస్తే ఇక్కడి ఓటర్లు పట్టం కట్టిన సందర్భాలు ఉన్నారుు. 1962, 1978లో ఎం.రామిరెడ్డి (రెండుసార్లు), 2004లో పులివీరన్న కాంగ్రెస్ తిరుబాటు అభ్యర్థులుగా విజయుం సాధించారు. 2009లో ఎన్.రాజేశ్వర్‌రెడ్డి ప్రజారాజ్యం రెబల్‌గా గెలిచారు. ఎమ్మెల్యేగా ఉండగా రాజేశ్వర్‌రెడ్డి వురణించడంతో జరిగిన ఉప ఎన్నికల్లో యెన్నం శ్రీనివాస్‌రెడ్డి బీజేపీ అభ్యర్థిగా విజయుం సాధించారు.

2009 సాధారణ ఎన్నికల్లో వుహబూబ్‌నగర్ లోక్‌సభ స్థానం నుంచి కేసీఆర్ గెలుపునకు జిల్లా టీఆర్‌ఎస్ అధ్యక్షుడి హోదాలో యెన్నం పనిచేశారు. ఆ తర్వాత కొద్దిరోజులకే పార్టీకి గుడ్‌బై చెప్పి అనూహ్యంగా బీజేపీ నుంచి ఎమ్మెల్యే అయ్యూరు. ఇప్పుడు కూడా ఆయున వురోసారి అదే పార్టీ తరఫున తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.  పునర్విభజన  తర్వాత మహబూబ్‌నగర్, హన్వాడ మండలాలకే నియోజకవర్గం పరిమితం అరుుంది. గతంలో గ్రామీణ ఓటర్లు కీలకంగా ఉండేవి. ఇప్పుడు పట్టణ ఓటర్లేఅభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చే పరిస్థితి ఏర్పడింది.
 
 శ్రీ నే.. గెలిస్తే..
* కొత్తచెరువుకు పూర్వవైభవం.
* జిల్లా కేంద్రం చుట్టు ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం
* అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ ఏర్పాటు
* కోయిల్‌సాగర్ రిజర్వాయర్ ద్వారా సాగు, తాగు నీటి సరఫరా
* కేంద్రం నిధులతో జిల్లా కేంద్రంలో పార్కుల నిర్మాణం
* కూడళ్లలో ఆధునిక విద్యుత్ లైట్ల ఏర్పాటు
* నిరుద్యోగులకు ఉపాది అవకాశాలు, మహిళలకు రుణాలు
 - వి. శ్రీనివాస్‌గౌడ్ (టీఆర్‌ఎస్)
 
* రూ.270 కోట్లతో మంచినీటి సమస్యకు శాశ్వత పరిష్కారం
* రూ. 60 కోట్లతో బైపాస్ రోడ్డు నిర్మాణం
* పట్టణంలోని 41 వార్డుల్లో ఫిల్టర్ వాటర్ ప్లాంట్ల ఏర్పాటు
* జిల్లా ఆస్పత్రిని కేంద్ర నిధులతో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిగా వూర్పు
* మెడికల్ కళాశాల ఏర్పాటు.
 - యెన్నం శ్రీనివాస్‌రెడ్డి (బీజేపీ)
 
  పట్టణంలో భూగర్భ డ్రైనేజీ.
  తాగునీటి సమస్య పరిష్కారం.
  పాలమూరు యూనివర్శిటీ స్థాయిలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటు
రూ.400 కోట్లతో పూర్తి స్థాయిలో వైద్యకళాశాల ఏర్పాటు
పతి గ్రామంలో మంచినీటి సమస్య శాశ్వత పరిష్కారం.
  బైపాస్ రోడ్డు నిర్మాణానికి ప్రత్యేక కృషి
నిరుద్యోగులకు ఔట్ సోర్సింగ్స్, కంపెనీల ద్వారా ఉద్యోగావకాశాలు    
 - ఒబెదుల్లా కొత్వాల్ (కాంగ్రెస్)
 
వైఎస్  పథకాల అవులు.
* రైతులకు గిట్టుబాటు ధర కల్పన.
* పరిశ్రమల ఏర్పాటు ద్వారా యుువతకు ఉపాధి కల్పన
* ఇంటింటికీ రోజూ మంచినీరు
* మహిళలకు రుణాలు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం
* పట్టణంలో పార్కులు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఏర్పాటు.
* పాలవుూరులోని అన్ని కాలనీలకు రామన్‌పాడు నీటి సరఫరా    
 - బెక్కరి శ్రీనివాస్‌రెడ్డి (వైఎస్సార్ కాంగ్రెస్)

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement