కిరణ్ బేడీ ఢిల్లీ సీఎం అవుతారా? | Will Kiran Bedi become Delhi CM? | Sakshi
Sakshi News home page

కిరణ్ బేడీ ఢిల్లీ సీఎం అవుతారా?

Published Wed, May 21 2014 2:36 PM | Last Updated on Sat, Sep 2 2017 7:39 AM

కిరణ్ బేడీ ఢిల్లీ సీఎం అవుతారా?

కిరణ్ బేడీ ఢిల్లీ సీఎం అవుతారా?

దేశంలోని తొలి మహిళా పోలీస్ ఐపీఎస్ కిరణ్ బేడీ ఢిల్లీ సీఎం కావాలనుకుంటున్నారా? ' అడిగితే సీఎం పదవిని స్వీకరిస్తాను' అని ఆమె ట్వీట్ చేయడంతో ఈ ఊహాగానాలు ఒక్క సారిగా జోరందుకున్నాయి.

కిరణ్ బేడీ మొదట్నుంచీ బిజెపి సానుభూతిపరురాలే. ఆమె నరేంద్ర మోడీకి అనుకూలంగా ప్రకటనలు కూడా చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో బిజెపి ఆమను ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ముందుకు రమ్మని కోరింది. అయితే అప్పట్లో ఆమె దీన్ని తిరస్కరించింది. 'ఈ సారి ఆఫర్ చేస్తే తిరస్కరించను' అని అని ఆమె ట్వీట్ చేశారు.

అన్నా హజారే, అరవింద్ కేజరీవాల్ తో కలిసి అవినీతి వ్యతిరేక పోరాటంలో పాల్గొన్న కిరణ్ బేడీ ఆ తరువాత అరవింద్ కేజరీవాల్ ను వ్యతిరేకించారు.

ఇప్పుడు మళ్లీ ఢిల్లీ రాష్ట్ర్ర ఎన్నికలు జరిగే అవకాశాలు ఉండటంతో కిరణ్ బేడీ వ్యాఖ్యలు ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. అయితే ఆమె బిజెపిలో చేరతారా లేదా అన్నది మాత్రం ఇంకా తెలియరాలేదు. మరోవైపు ఆప్ మాజీ ఎమ్మెల్యే వినోద్ బిన్నీ మాత్రం కిరణ్ బేడీని సీఎం చేయాలని బిజెపి, ఆప్, కాంగ్రెస్ లను కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement