
నేటి నుంచి మద్యం షాపులు బంద్
సాయంత్రం 6 గంటల నుంచి 30వ తేదీ సాయంత్రం వరకు మూసేయాలి
సాక్షి, హైదరాబాద్: ఈనెల 30న సార్వత్రిక ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో నేటి సాయుంత్రం 6 గంటల నుంచి తెలంగాణ ప్రాంతంలోని మద్యం షాపులు వుూసివేయూలని అధికారులు ఆదేశాలు జారీచేశారు. ఈనెల 30వ తేదీ సాయుంత్రం 6 గంటల వరకు మూసి ఉంచాలని, ఈ నిబంధనలు స్టార్ హోటళ్లతో పాటు, టూరిజం వంటి మద్యం విక్రయాలు జరిగే సెంటర్లకు వర్తించనున్నాయుని వారు పేర్కొన్నారు. కాగా, రెండు రోజుల పాటు వరుసగా నిషేధం ఉండడంతో మద్యం కొనుగోళ్లు ఒక్కసారిగా పెరిగాయి. పలు ప్రాంతాల్లో షాపుల్లో మద్యం కొరత నెలకొంది.