11 గంటలకు వైఎస్ జగన్ నామినేషన్ | YS Jagan will be filed Nomination at 11 o'clock | Sakshi
Sakshi News home page

11 గంటలకు వైఎస్ జగన్ నామినేషన్

Published Thu, Apr 17 2014 9:16 AM | Last Updated on Tue, Aug 14 2018 4:21 PM

11 గంటలకు వైఎస్ జగన్ నామినేషన్ - Sakshi

11 గంటలకు వైఎస్ జగన్ నామినేషన్

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈరోజు ఉదయం 11 గంటలకు పులివెందుల శాసనసభ నియోజకవర్గం అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయనున్నారు.

పులివెందుల(వైఎస్ఆర్ జిల్లా): వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈరోజు ఉదయం 11 గంటలకు పులివెందుల శాసనసభ నియోజకవర్గం అభ్యర్థిగా  నామినేషన్ దాఖలు చేయనున్నారు.   జగన్ తన సతీమణి భారతితో కలిసి ఉదయం 9.10 గంటలకు ఇడుపులపాయలో తండ్రి దివంగత మహానేత డాక్టర్ వైఎస్ఆర్  సమాధి వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. నామినేషన్ పత్రాలను సమాధి వద్ద ఉంచి ప్రార్ధన చేశారు.  అక్కడి నుంచి నేరుగా పులివెందుల బయలుదేరుతారు. పులివెందులలో తన నివాసం నుంచి మద్దతుదారులతో ర్యాలీగా బయలుదేరుతారు. పులివెందుల పూల అంగళ్ల సర్కిల్‌లో  బహిరంగసభలో ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు.  

  అనంతరం ముద్దనూరు రోడ్డుమీదుగా జూబ్లీ బస్టాఫ్, నాలుగు రోడ్ల సర్కిల్, తహశీల్దార్ కార్యాలయానికి చేరుకుని ఉదయం 11గంటలకు  రిటర్నింగ్ అధికారికి వైఎస్ఆర్ సీపీ  అభ్యర్థిగా నామినేషన్ పత్రాలను జగన్ అందజేస్తారు. జగన్ నామినేషన్ వేస్తున్న సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించేందుకు లభిమానులు, కార్యకర్తలు  తరలివస్తున్నారు.

జగన్ తొలిసారిగా పులివెందుల నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. 2009 ఎన్నికలలో కడప లోక్సభ  అభ్యర్థిగా పోటీ చేసి ప్రత్యర్థిపై 1.75లక్షలపైచిలుకు ఓట్లతో గెలుపొందారు. అనంతరం 2011లో వైఎస్‌ఆర్ సీపీని స్థాపించి, మేలో జరిగిన ఉప ఎన్నికలలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన  5,45,043 ఓట్ల భారీ మెజార్టీ సాధించడంతో జాతీయ స్థాయిలోనే ఆయన పేరు మారుమోగింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement