ఏలూరు సిటీ, న్యూస్‌లైన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ చింతలపూడి, గోపాలపురం నియోజకవర్గాల్లో బుధవారం నిర్వహిం చిన ‘వైఎస్సార్ జనభేరి’ రోడ్ షో, ఎన్నికల ప్రచార సభలకు ప్రజలు వెల్లువలా తరలివచ్చారు. ఎండను సైతం లెక్కచేయకుండా రాజశేఖరరెడ్డి సతీమణి విజ యమ్మను చూసేందుకు, ఆమె ప్రసంగాన్ని వినేందుకు మహిళలు, వృద్ధులు, యువత రోడ్ల వెంబడి బారులు తీరారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, కార్యకర్తలు, నాయకులు భారీసంఖ్యలో మోటార్ సైకిళ్ల ర్యాలీతో విజయమ్మ రోడ్ షోను వెంబడించారు. చంద్రబాబు అవినీతి, అరాచక పాలనను గుర్తు చేస్తూనే.. పేదల గుండెచప్పుడు అయిన వైఎస్సార్ సువర్ణయుగాన్ని ప్రస్తావిస్తూ.. పేదల భవిష్యత్ రేడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలకు ఏం చేయబోతున్నారో వివరిస్తూ విజయమ్మ ముందుకు సాగారు. ప్రజల కష్టాలు గుర్తించిన వైఎస్ పాలన మళ్లీ రావాలం టే ప్రజలు విజ్ఞతతో ఆలోచించి ‘ఫ్యాను గుర్తు’కు ఓటెయ్యాలని కోరారు. రాష్ట్రంలో ఫ్యాను గాలి బలంగా వీస్తోందని, ఆ గాలికి చంద్రబాబు లాంటి విషపాలకులు కొట్టుకుపోయేలా చేయూలని ప్రజలకు పిలుపునిచ్చారు.
వైఎస్‌కు ముందు చంద్రబాబు పాలన, అనంతరం కిరణ్ సర్కారు హయూంలో ప్రజలు ఎదుర్కొన్న కష్టాలను వివరిస్తూ మంచి పాలకులను ఎన్నుకోవాలని కోరారు. ధర్మాజీగూడెం నుంచి ప్రారంభమైన జనభేరి రోడ్ షోలో వేలాదిగా ప్రజానీకం పాల్గొన్నారు. ధర్మాజీగూడెం బస్టాండ్ సెంటర్ భారీగా చేరిన ప్రజల ను ఉద్దేశించి విజయమ్మ ప్రసంగించా రు. ఆ ప్రాంతంలో సీఎస్‌ఐ క్రైస్తవ సంస్థ డీనరీ కె.బెంజిమన్, పి.సువర్ణరాజు, పాస్లర్లు ఎం.దేవదానం, జి.నానిబాబు విజయమ్మకు ఎదురేగి శుభాశీస్సులు తెలిపారు. మఠంగూడెం సమీపంలో పార్టీ నాయకులు ఘంటా మురళి భారీ సంఖ్యలో కార్యకర్తలతో కలసి స్వాగతం పలికారు. అదే ప్రాంతంలో మహిళలు తరలివచ్చి విజయమ్మకు సంఘీభావం తెలిపారు. లింగపాలెం సెంటర్, ఫాతి మాపురం అడ్డరోడ్డు, చింతలపూడి పార్టీ కార్యాలయం వద్ద విజయమ్మ కార్యకర్తలు, అభిమానులను ఉద్దేశించి ప్రసంగించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని, ఫ్యాను గుర్తు ఓటెయ్యాలని అభ్యర్థించారు.
అనంతరం ప్రగడవరం, కామవరపుకోట వరకూ రోడ్‌షో సాగింది. ఆ తర్వాత నేరుగా గోపాలపురం చేరుకున్న విజయమ్మ జనభేరి బహిరంగ సభలో పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గ అభ్యర్థి తోట చంద్రశేఖర్, రాజమండ్రి పార్లమెం టరీ నియోజకవర్గ అభ్యర్థి బొడ్డు అనంతవెంకటరమణ చౌదరి, చింతలపూడి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ మద్దాల దేవీ ప్రియ, గోపాలపురం ఎమ్మెల్యే అభ్యర్థి తలారి వెంకట్రావు, మాజీ ఎమ్మెల్యేలు మద్దాల రాజేష్, ఘంటా మురళి, పార్టీ సీఈసీ సభ్యుడు చెలికాని రాజబాబు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ బొమ్మారెడ్డి నాగచంద్రారెడ్డి, ఏఎంసీ చైర్మన్ కేవీకే దుర్గారావు, నాయకులు కారుమంచి రమేష్, ఇళ్ల భాస్కరరావు, కూసం రామ్మోహన్‌రెడ్డి, ముల్లంగి శ్రీనివాసరెడ్డి, కాండ్రేగుల శ్రీహరి పాల్గొన్నారు.
‘విజయ’భేరి
Published Thu, Apr 17 2014 3:04 AM | Last Updated on Mon, May 28 2018 1:21 PM
Advertisement