
ముఖకాంతికి...
చదివింత...
సత్యవర్షి
నీ దూకుడు...
‘బొమ్మకు చెలగాటం వాహనదారులకు ప్రాణ సంకటం’ అన్నట్టు పరిస్థితి మారడంతో అధికారులు రంగంలోకి దిగక తప్పలేదు. అమెరికాలోని లోవా ప్రాంతపు యుఎస్ రూట్ 61లో ఓ కార్‌డీలర్ తన ప్రచారం కోసం భారీ హోర్డింగ్‌ని ఏర్పాటు చేశాడు. అత్యంత వ్యయప్రయాసలతో ఏర్పాటు చేసిన ఈ హోర్డింగ్ చాలా సహజంగా, వినూత్నంగా అనిపిస్తూ అందర్నీ ఆకట్టుకుంటోంది. అచ్చం మనిషిలా అనిపించే మానిక్వెన్‌ను కూడా ఆ బోర్డ్ మీద ఏర్పాటు చేశారు. చూసేవాళ్లకి హోర్డింగ్ అవతలి నుంచి ఇవతలకి ఎవరో దూకుతున్నట్టు ఉంటుందది. అంతవరకూ బానే ఉంది కానీ.. ఇది మరీ సహజంగా ఉండడంతో... దారిన పోయే వాహనచోదకులు బెంబేలెత్తడం ప్రారంభించారు. ‘‘ఎవరిదో ఆ దూకుడు? మీరొచ్చి కాస్త ఆపుడు’’ అంటూ అక్కడి ప్రభుత్వ ఎమర్జన్సీ నెంబరు 911కు వరుసపెట్టి ఫోన్లు రావడం ప్రారంభించాయి.
దీంతో చిర్రెత్తిన ప్రభుత్వవర్గాలు... సదరు బోర్డును తొలగించమంటూ ఆదేశాలు జారీ చేశారు. తప్పనిసరి పరిస్థితుల్లో బోర్డును తొలగించిన వెస్ట్ బర్లింగ్‌టన్ వాసి కార్ డీలర్ బ్రాడ్ డెర్రీ... ‘‘ఈ బోర్డును ఎంతో ఇష్టపడి తయారు చేయించా. చాలా మంది దీన్ని మెచ్చుకున్నారు, సెల్ఫీలు దిగారు కూడా. కాని భద్రత దృష్ట్యా తొలగించక తప్పడం లేదు’’ అంటూ విచారం వ్యక్తం చేశాడు.