ఆగస్టు 29న పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు | Celebrities celebrate the birthday on August 29, | Sakshi
Sakshi News home page

ఆగస్టు 29న పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు

Published Fri, Aug 28 2015 11:56 PM | Last Updated on Mon, Jul 15 2019 9:21 PM

ఆగస్టు  29న పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు - Sakshi

ఆగస్టు 29న పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు

ఈరోజు మీతో పాటు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు:
నాగార్జున (నటుడు); కె.రాధాకృష్ణన్ (శాస్త్రవేత్త); విశాల్ (నటుడు).

 
ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 9. ఇది కుజసంఖ్య. 9 పరిపూర్ణతకు నిదర్శనం. వీరి పుట్టిన తేదీ 29. ఇది చంద్రునికి సంబంధించిన సంఖ్య కాబట్టి ఈ సంవత్సరం కుజచంద్రుల ప్రభావంతో చంద్రమంగళ యోగం ఏర్పడుతుంది. దీనివల్ల విదేశీ యానం, స్థిరాస్తుల కొనుగోలు లేదా అభివృద్ధి  జరుగుతుంది. 29 సంవత్సరాలు దాటిన వారికి మంచి మార్పులు వస్తాయి. ఇతర కులస్థులతో ప్రేమలో ఉన్న వారికి అంతగా ఫలప్రదంగా ఉండదు కాబట్టి తగిన జాగ్రత్త అవసరం. సూర్యుడు, గురువు సింహరాశిలో ఉండటం వల్ల రాజకీయాలలో ఉన్న వారికి పదవీ యోగం. ఉద్యోగస్థులకు ప్రమోషన్లు కానీ, కోరుకున్న ప్రదేశాలకు బదిలీ అవడం కానీ జరుగుతుంది. వ్యాపార రంగంలో ఉన్న వారికి ప్రభుత్వపరంగా సహాయ సహకారాలు, సబ్సిడీలు అందుతాయి. కుజుని ప్రభావం వల్ల తోటివారితో వాదనలు పెట్టుకుని దూరం చేసుకునే ప్రమాదం ఉంది కాబట్టి వాదనలకు దూరంగా ఉండటం మంచిది. పదునైన ఆయుధాల వాడేటప్పుడు, వాహనాలను నడిపేటప్పుడూ అప్రమత్తత అవసరం.

లక్కీ నంబర్స్: 1,2,3,6,9; లక్కీ కలర్స్: వైట్, సిల్వర్, క్రీమ్, గోల్డెన్, శాండల్; లక్కీ డేస్: శని, సోమ, మంగ, శుక్రవారాలు
 సూచనలు: సుబ్రహ్మణ్యేశ్వరునికి అభిషేకం, వికలాంగులకు సాయం  చేయడం, సోదరులను, తల్లిని కాని, తత్సమానులను కానీ ఆదరించడం, రక్తదానం చేయడం మంచిది.                              
 - డాక్టర్ మహమ్మద్ దావూద్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement