సౌకర్యంగా... స్మార్ట్ యాప్స్ | Comfortable ... smart apps | Sakshi
Sakshi News home page

సౌకర్యంగా... స్మార్ట్ యాప్స్

Published Wed, Apr 2 2014 1:30 AM | Last Updated on Sat, Sep 2 2017 5:27 AM

సౌకర్యంగా... స్మార్ట్ యాప్స్

సౌకర్యంగా... స్మార్ట్ యాప్స్

 మహిళలకు స్మార్ట్ సాయం అందుబాటులో ఉంది. వినియోగించుకోవాలే కానీ సౌకర్యంగా , వినోదంగా ఉపయోగపడతాయి. వ్యక్తిగత సౌకర్యం, పిల్లల పెంపకం వంటి విషయాల దగ్గర నుంచి ఆపద సమయాల్లో సాయంగా నిలవడం వరకూ... అనేక రకాలుగా సాయపడుతున్నాయి స్మార్ట్‌ఫోన్ అప్లికేషన్లు. అలాంటి ఓ మూడు మీ కోసం...
 
షాపర్
: షాపింగ్ విషయంలో సహాయకారిగా ఉండే ఈ అప్లికేషన్ ఐ స్టోర్ నుంచి బాగా డౌన్‌లోడ్ అవుతున్న అప్లికేషన్‌గా నిలుస్తోంది. ఇంట్లో అవసరాల గురించి ఈ అప్లికేషన్‌లో ఒక లిస్టును తయారు చేసుకోవచ్చు. గుర్తొచ్చినవి గుర్తొచ్చినట్టుగా నోట్ చేసి పెట్టుకొంటూ ఉంటే మాల్‌కు వెళ్లాకా మరో ఆలోచన లేకుండా లిస్టును చూసుకొని సరుకులను కొనుగోలు చేసేయవచ్చు.
 
ఐ పిరియడ్
: రుతుక్రమం గురించి సైకిల్ క్యాలెండర్‌ను తయారుచేస్తుంది ఈ అప్లికేషన్.  దీంతో 12 నెలల పాటు పిరియడ్స్ గురించి ముందస్తుగా ఒక అంచనాను ఏర్పరుచుకోవడానికి వీలుంటుంది. ఈ క్రమాన్ని అనుసరించి ఈ కార్యక్రమాలను రూపొందించుకోవడానికి అవకాశం ఉంటుందని రూపకర్తలు పేర్కొన్నారు. భార్యలతో పాటు భర్తలు కూడా ఈ అప్లికేషన్‌ను అనుసరించి ఫ్యామిలీతో ప్రోగ్రామ్స్‌ను ఫిక్స్ చేసుకోవచ్చని వారు  అభిప్రాయపడ్డారు.
 
బేబీ ట్రాకర్: చిన్న పిల్లలు ఉన్న తల్లులకు బాగా ఉపయోగపడే అప్లికేషన్ ఇది. పసిపాపకు ఫీడింగ్ విషయంలో డైరీలాగా ఉపయోగపడుతుంది ఈ అప్లికేషన్. చిన్నారుల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, వారి ఆరోగ్యం పట్ల వ్యవహరించాల్సిన తీరు గురించి వివరాలందిస్తుంది. ఐఓఎస్‌పై పనిచేస్తుంది ఈ అప్లికేషన్. ఆండ్రాయిడ్ కోసం వేరే అప్లికేషన్లు అందుబాటులో ఉన్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement