గుండె దాదాపు రోజుకు లక్షసార్లు స్పందిస్తుంది!
ఏడాదిలో 36,00,000 సార్లు, జీవితకాలంలో దాదాపు 250 కోట్ల సార్లు (2.5 బిలియన్‌సార్లు) కొట్టుకుంటుంది.
⇒ {పతి నిమిషానికీ 30 లీటర్ల రక్తం మన గుండె ద్వారా పంప్ అవుతుంది.
⇒ మన జీవితకాలంలో మన గుండె నుంచి ప్రవహించే రక్తాన్ని మన ఇంట్లోని కొళాయి ద్వారా ప్రవహింపజేస్తే అది 45 ఏళ్లపాటు ఎడతెరిపి లేకుండా ప్రవహిస్తూనే ఉంటుంది.
⇒ మన కంటిపాప కార్నియాకు తప్ప శరీరంలోని ప్రతి కణానికీ (అంటే... 75 ట్రిలియన్ కణాలకు) అవిశ్రాంతంగా రక్తం అందుతూనే ఉంటుంది.
⇒ గుండె అనే అవయవం ఒక పంప్‌లాగా పనిచేస్తుంది. ఈ పంప్‌ను నడిపించడానికి అవసరమైన కరెంట్ సైనో ఏట్రియల్ నోడ్ అనే చోట వెలువడుతుంది. దీని నుంచి ఒక జీవితకాలంలో వెలువడే శక్తినంతా కలగలిపితే ఒక ట్రక్కు చంద్రుడి వద్దకు వెళ్లి మళ్లీ తిరిగి వచ్చేంత శక్తి వెలువడుతుంది.
హెల్త్ టిప్స్
⇒ చర్మ సంరక్షణకు గ్రీన్ టీ చక్కగా ఉపయోగపడుతుంది. ఇందులో ఈ-విటమిన్‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్‌ల కంటే ఇరవై రెట్లు శక్తిమంతంగా పని చేసే యాంటిఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీరకణాలను ఎప్పటికప్పుడు ఉత్తేజితం చేస్తాయి.
⇒ గర్భిణీలకు ఉదయాన్నే కాని మరికొందరిలో ఏం తిన్నా కూడా వెంటనే వాంతులవడాన్ని చూస్తుంటాం. ఉదయాన్నే పరగడుపున ఒక టేబుల్ స్పూన్ తేనెలో అంతే మోతాదు నిమ్మరసాన్ని కలిపి తీసుకుంటే వాంతులు ఆగిపోతాయి. తిన్నది కడుపులో ఇముడుతుంది.
⇒ రోజూ ఒక టేబుల్ స్పూన్ తేనె తీసుకుంటుంటే ఆరోగ్యానికి మంచిది. తేనెలో చిటికెడు కుంకుమపువ్వు కలిపి తీసుకుంటుంటే రక్తప్రసరణ మెరుగవుతుంది. రక్తవృద్ధి అవుతుంది. చర్మానికి మెరుపు వస్తుంది.
అపోహ - వాస్తవం
వ్యాయామం ఎప్పుడు మొదలుపెట్టాలి
అపోహ: వ్యాయామం యౌవనంలో ఉన్నప్పుడే మొదలు పెట్టాలి. ఇరవైలు, ముప్ఫైలలో సాధ్యం కాకపోతే కనీసం నలభైలలో అయినా వ్యాయామం చేయవచ్చు. కానీ 50 ఏళ్లు దాటిన తర్వాత వ్యాయామం చేయడం మంచిది కాదు. యుక్త వయసు నుంచి అలవాటు ఉన్న వారు మాత్రమే 60, 70లలో కూడా వ్యాయామం చేయవచ్చు. అంతే తప్ప ఈ వయసులో వ్యాయామం మొదలుపెట్టరాదు.
వాస్తవం: ఈ అభిప్రాయం తప్పు. వ్యాయామాన్ని ఏ వయసులోనైనా మొదలుపెట్టవచ్చు. మనదేశంలో వార్ధక్యంలోకి అడుగుపెట్టిన తరవాత నడకకే పరిమితమవుతుంటారు. కానీ పాశ్చాత్య దేశాల్లో దాదాపు 50 మంది పురుషులు, స్త్రీలు 87 ఏళ్ల వయసులో వెయిట్స్‌తో వర్కవుట్స్ చేస్తుంటారు. మొదలు పెట్టిన పదివారాల్లోనే వీరి కండరాలు శక్తిమంతం అవుతాయి. దీంతోపాటు పదివారాల తర్వాత వారి నడకవేగంలో గణనీయమైన మార్పు కనిపిస్తుంది.