భలే భలే భాగ్యనగరం | Hyderabad Is Best Tourist Place | Sakshi
Sakshi News home page

Published Wed, May 9 2018 1:38 PM | Last Updated on Tue, Sep 4 2018 5:44 PM

Hyderabad Is Best Tourist Place - Sakshi

సమ్మర్‌లో విదేశాలకో..ఇతర రాష్ట్రాలకో టూర్‌ వెళ్దామనుకున్నా కుదరలేదా...అయితేనేం చింతించకండి. మన భాగ్యనగరంలోనూ చూడాల్సిన ప్రదేశాలు...తెలుసుకోవాల్సిన విశేషాలెన్నో ఉన్నాయి. ఈ వేసవిలో మన నగరంలో కుటుంబ సమేతంగా వెళ్లి చూడాల్సిన టూరిస్ట్‌ స్పాట్స్‌ గురించి ప్రత్యేక కథనం...

సాక్షి, సిటీబ్యూరో : హైదరాబాద్‌.. వందల ఏళ్ల చరిత్ర కలిగిన గొప్ప నగరం.. ఈ పేరు వింటే చాలు ముందుగా గుర్తుకొచ్చేది చార్మినార్‌.. ఇదొక్కటేనా ఇంకేమీ లేవా అంటే బోలెడు..! వీటిలో మీరెన్ని చూశారు అని ఎవరైనా అడిగితే నోరెళ్లబెడతాం. నగరంలో కాలంతోపాటు పరుగెత్తుతూ సిటీ అందాలను, చారిత్రక నేపథ్యాన్ని మరచిపోయాం. కనీసం ఈ వేసవిలో అయినా భాగ్యనగరం అందాలను చూసొద్దాం

గోల్కొండ కోట  
గోల్కొండ కోట అందాలను ఎంతసేపు చూసినా తనివి తీరదు.  ఇక అమితాబ్‌ బచ్చన్‌ గంభీరమైన వాయిస్‌ ఓవర్‌తో సాగే సౌండ్స్‌ అండ్‌ లైట్‌ షో చూడటం గుర్తుండిపోతుంది. గోల్కొండ కోటకు వెళ్లే దారిలో నగీనా గార్డెన్, రామదాసు బందీఖానా, కోటపై దర్బార్‌ హాల్‌ కూడా ఉన్నాయి. 

సాగర్‌లో షికార్‌ 
హుసేన్‌సాగర్‌ సిటీకే తలమానికం.. ట్యాంక్‌బండ్‌పై నడుచుకుంటూ వెళితే ఆ అనుభూతే వేరు.. ఇక బోటు షికారు చేస్తే ఆనందమే.. ఆనందం.. అందుకోసం అధికారులు బోట్లను ఏర్పాటు చేసింది. వాటిలో సాగర్‌ చుట్టూ తిరిగి రావచ్చు. స్పీడ్‌ బోట్‌లో అలలపై అలవోకగా తేలియాడొచ్చు. భారీ బుద్ధుడి విగ్రహాన్ని వీక్షించవచ్చు.

ఖిల్వత్‌ ప్యాలెస్‌ .. చౌమహల్లా  
నగరంలోనే కాక దేశ, విదేశ పర్యాటకులను ఆకర్షిస్తూ ప్రఖ్యాతి గాంచింది చౌమహల్లా ప్యాలెస్‌. 12 ఎకరాల్లో ఈ మహల్‌ విస్తరించి ఉంది.  ప్యాలెస్‌లోని ఉద్యానవనం, వాటర్‌ ఫౌంటేన్లు సందర్శకులను కట్టిపడేస్తాయి. 

పురానీ హవేలీ 
రాచరికపు వైభావానికి ప్రతీకగా కుతుబ్‌షాహీల ప్రధాన మంత్రి నివాస గృహంగా గుర్తింపు పొందిన పురానీ హవేలీ సాలార్‌జంగ్‌ మ్యూజియం సమీపంలో ఉంది. యూ ఆకారంలో ఉన్న ఈ రాజ భవనంలో అనేక విద్యాలయాలు కొనసాగుతున్నాయి. ఇందులో ఒక భాగాన్ని మ్యూజియంగా రూపొందించారు. ప్రపంచ ప్రఖ్యాత నిజాం వార్డ్‌రోబ్‌ మ్యాన్యువల్‌ లిఫ్ట్‌  ఇక్కడ స్పెషల్‌ అట్రాక్షన్‌. 30 నిమిషాల పాటు ప్రదర్శనలో విశేషాలు వీక్షించే అవకాశం ఉంది. 

చార్మినార్‌ 
దీన్ని 1591లో నిర్మించారు. ఈ కట్టడ నిర్మాణానికి సున్నం మాత్రమే ఉపయోగించారు. దీని ఎత్తు 180 అడుగులు. లక్కగాజులు అమ్మే లాడ్‌ బజార్‌ ఇక్కడికి దగ్గర్లో ఉంది. ముత్యాల వ్యాపారం కూడా ఇక్కడి నుంచే ప్రారంభమైంది. 

తారామతి బారాదారి 
తారామతి బారాదారి నాడు కులీకుతుబ్‌షాహీ సంస్థానంలో ఓ గొప్ప సాంస్కృతిక కేంద్రం. ఆ చారిత్రక కట్టడాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం మంచి పర్యాటక కేంద్రంగా తయారు చేసింది. పర్యాటకులకు అందుబాటులో ఏసీ రూమ్‌లు, ఫొటోషూట్, సినిమా ఘటింగ్‌లు, హోటల్‌ రూమ్‌లు, బుకింగ్‌లు, ఆడిటోరియం అందుబాటులో ఉన్నాయి. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు సందర్శించవచ్చు. 

సాలార్జంగ్‌ మ్యూజియం
ప్రపంచంలోనే అతిపెద్ద వన్‌మ్యాన్‌ కలెక్షన్‌ మ్యూజియంగా  ప్రసిద్ధిగాంచిన ప్రదర్శనశాలను సుమారు గంట పది నిమిషాల సేపు సందర్శించవచ్చు. 

జలవిహార్‌
జలకాలాటలకు కేరాఫ్‌ జలవిహార్‌. వాటర్‌ గేమ్స్, డీజే రెయిన్‌ డ్యాన్స్, వేవ్‌ పూలు, క్రేజిన్‌ కైట్, డ్వస్టర్‌ లైట్, మ్యాట్‌రైడ్, సింగిల్‌ డ్యూట్, డబుల్‌ డ్యూట్‌ రైడ్‌ తదితర ఇక్కడి ప్రత్యేకత.

  

ఎన్టీఆర్‌ గార్డెన్‌
ట్రీహౌస్, థీమ్‌ పార్కు, టాయ్‌ ట్రైన్, డౌన్‌ టౌన్‌ గేమ్స్, బోటింగ్, మచ్‌ అండ్‌ ట్రీ టవర్‌ ఇక్కడి ప్రత్యేకతలు. ఎటు చూసినా పచ్చందాలు కనిపిస్తాయి. 

లుంబినీ పార్క్‌ 
లుంబినీ పార్కులో విహారం మైమరిపిస్తుంది. వాటర్‌ గేమ్, లేజర్‌ షో, టాయ్‌ ట్రైన్, మ్యూజికల్‌ నైట్, మ్యూజికల్‌ ఫౌంటెయిన్‌ ఇక్కడి ప్రత్యేకతలు.

 

బిర్లామందిర్‌ 
సిటీకి నడిబొడ్డున ఉంది. ఎత్తైన కొండపై  ఆహ్లాదకర వాతావరణంలో శ్రీవారిని దర్శించుకోవచ్చు. బిర్లా టెంపుల్‌ను దర్శిస్తే సగం హైదరాబాద్‌ను కనుచూపు మేరలో చూడొచ్చు. 

శిల్పారామం 
50 ఎకరాల విస్తీర్ణంలో వ్యాపించి ఉన్న శిల్పరామం ఆకట్టుకుంటోంది. సాంప్రదాయకంగా తయారుచేసిన హస్తకళలను  ఇక్కడ చూడవచ్చు. దేశవ్యాప్తంగా తయారైన కళారూపాయలు ఇక్కడ విక్రయిస్తారు.ముఖ్యంగా కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు ఉపయోగించే వస్తాలు, ఇతర అలంకరణ సామగ్రి లభ్యమవుతుంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement