కొత్త పరిశోధన
వయసు మళ్లిన వాళ్లకు శాకాహార నూనెలు, చేపనూనెల్లోని కొవ్వులు మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. శాకాహార నూనెలు, చేప నూనెల్లోని మేలు చేసే కొవ్వు పదార్థాలు గుండెజబ్బులు, పక్షవాతం, అధిక రక్తపోటు బారి నుంచి కాపాడతాయని, ఫలితంగా ఎక్కువకాలం ఆరోగ్యంగా జీవించేందుకు దోహదపడతాయని స్వీడన్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
అరవయ్యేళ్లకు పైబడిన వయసు గల నాలుగువేల మందిపై జరిపిన పరిశోధనల్లో శాకాహార నూనెలు, చేప నూనెల్లోని పాలీ అన్‌శాచ్యురేటెడ్ కొవ్వులు గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయని తేలినట్లు స్వీడన్‌లోని ఉప్సలా వర్సిటీ నిపుణుడు డాక్టర్ అల్ఫ్ రైజరస్ చెబుతు న్నారు. సాధారణంగా వయసు మళ్లిన వారి ఆహారంలో 25-30 శాతం కంటే అధికంగా కొవ్వు పదార్థాలు ఉండవని, ఈ కొవ్వులు మేలైన పదార్థాల నుంచి వచ్చినవిగా చూసుకుంటే చాలని ఆయన అంటున్నారు.
ఆ కొవ్వులు మంచివే..!
Published Sat, Jun 27 2015 11:41 PM | Last Updated on Sun, Sep 3 2017 4:28 AM
Advertisement