అవకాశాలను అందిపుచ్చుకుంటారు | take hold of opportunities | Sakshi
Sakshi News home page

అవకాశాలను అందిపుచ్చుకుంటారు

Published Fri, Oct 16 2015 11:59 PM | Last Updated on Sun, Sep 3 2017 11:04 AM

అవకాశాలను అందిపుచ్చుకుంటారు

అవకాశాలను అందిపుచ్చుకుంటారు

అక్టోబర్ 17 నుంచి 23 వరకు
 
టారో బాణి
 
ఏరిస్ (మార్చి 21- ఏప్రిల్ 20)
డబ్బు, అధికారం, పేరు ప్రతిష్ఠలు... వీటి గురించిన ఆలోచన లేకపోతేనే సంతోషంగా ఉండగలరని గ్రహించండి. చేపట్టిన కొత్త పని/వ్యాపారం లేదా ప్రాజెక్టులో విజయం సాధిస్తారు. మీ కల నిజం కాబోతోంది. పనికి సంబంధించి పూర్తి పరిజ్ఞానం పొందుతారు. తగిన జాగ్రత్త తీసుకోకుంటే మీ బంధం మాత్రం బీటలు వారే ప్రమాదం ఉంది. కలిసొచ్చే రంగు: పీచ్
 
టారస్ (ఏప్రిల్ 21-మే 20)
దైవం పట్ల, తన పట్ల విశ్వాసం ఉన్నవాడు ఎప్పటికీ సడలక, వడలక ప్రవాహం ఎటు తీసుకుపోతే అటు కొట్టుకుపోతాడు. కొత్త ఇల్లు కొనడం లేదా ఉన్న ఇల్లు మారడం జరగవచ్చు. కళ్యాణ ఘడియలు మోగే సూచనలు కనిపిస్తున్నాయి. మీదైన శైలిలో వ్యవహరించి, అందరినీ ఆక ట్టుకుంటారు. డబ్బుకు లోటుండదు. కలిసొచ్చే రంగు: పగడం ఎరుపు రంగు
 
జెమిని(మే 21-జూన్ 21)
మీ భావోద్వేగాలను బలవంతంగా అణచుకోవాలని చూడకండి. ఎప్పుడూ ఇతరులను అనుకరిస్తూ, అనుసరిస్తూ ఉంటే మీ మనుగడ క్రమంగా మరుగున పడుతుంది. నిదానంగా మీ పనులు మీరు చేసుకుంటూ పోతే పరిస్థితి అదే చక్కబడుతుంది. విజయం, ఆనందం ఈ వారం మీ వెంటే. రొమాన్స్‌లో మునిగి తేలతారు ఈ వారం. కలిసొచ్చే రంగు: పసుప్పచ్చ
 
క్యాన్సర్ (జూన్22-జూలై 23)
జీవితం అంతా అనుకున్నదనుకున్నట్టుగా సాఫీగా నడిచిపోతుంది. చేతినిండా పని ఉంటుంది. అయితే కొంత మార్పు అవసరం. భవిష్యత్తును ఊహించగలిగే జ్ఞానం మీకు ఎంతో ఉపకరిస్తుంది. అనూహ్యంగా పెద్దమొత్తంలో డబ్బు అందుతుంది. పై అధికారుల మీ పనితీరుపట్ల సంతృప్తి చెందుతారు. ఈ గురువారం మీకు అదృష్టకరంగా ఉంటుంది. కలిసొచ్చే రంగు: గ్రీన్
 
లియో  (జూలై 24-ఆగస్టు 23)
పోరాడి పనులు సాధించుకోవలసి వస్తుంది. అహాన్ని చంపుకోవలసి వస్తుంది. మీ లక్ష్యాలు నెరవేరతాయి. అయితే పనుల విషయంలోనూ, లక్ష్యాల విషయంలోనూ మరింత అవగాహనతో, మరింత రాజీధోరణితో వ్యవహరించాల్సి ఉంటుంది. తీరానికి ఆవలి దరిని స్పష్టంగా చూడగలుగుతారు. అంటే లక్ష్యాన్ని చేరుకోగలరని మీరూహించగలరు. కలిసొచ్చే రంగు: సిల్వర్
 
వర్గో  (ఆగస్టు24-సెప్టెంబర్ 23)
జీవితంలో అనుకోని అవకాశాలు కలిసి వస్తాయి. వెంటాడుతున్న గతాన్ని పట్టించుకోకుండా వర్తమానం వైపు దృష్టిని మళ్లించడం మంచిది. కోర్టు వ్యవహారాలు, లిటిగేషన్లు అనుకూలిస్తాయి. అదృష్టం, విజయం వరిస్తాయి. ఒక కప్పులో నల్ల రాతి ఉప్పును పోసి గుమ్మం ముందు ఉంచడం ద్వారా నెగటి వ్ ఎనర్జీని పారద్రోలవచ్చు. కలిసొచ్చే రంగు: నలుపు
 
లిబ్రా (సెప్టెంబర్ 24- అక్టోబర్ 23)

మీకు మీరుగా గీసుకున్న హద్దులనుంచి బయటపడి అందమైన కలలు కనండి. సాకారం చేసుకునేందుకు ప్రయత్నించండి. ఒక ప్రయాణం మీకు అనుకోని అవకాశాలను తెచ్చిపెడుతుంది. పనిలో మిమ్మల్ని ప్రముఖంగా నిలబెడుతుంది. మీ ధోరణి, దృక్పథాలలో మార్పు రాకపోతే మీ ప్రేమను ఎప్పటికీ సాధించలేరని గ్రహించండి. కలిసొచ్చే రంగు: ఎల్లో
 
స్కార్పియో  (అక్టోబర్ 24-నవంబర్ 22)

ఇది అదృష్టకరమైన వారం. అంతా సజావుగా సాగుతుంది. ఫలానా పని చేయవలసిందే అని ఎవరినీ ఒత్తిడి చేయకండి. జరిగేవి జరగనివ్వండి. ఈ వారం మిమ్మల్ని విజయం వరిస్తుంది. పనిలో బాగా బిజీగా ఉంటారు. మీ విజయాన్ని, అభివృద్ధిని చూసి జనాలు ఆశ్చర్యపోతారు. మీ బంధం మీకెంతో ఆనందాన్నిస్తుంది. కలిసొచ్చే రంగు: పిస్తా గ్రీన్
 
శాజిటేరియస్ (నవంబర్23-డిసెంబర్ 21)
జీవితమన్నాక రకరకాల ఒడిదొడుకులు, సమస్యలు, సవాళ్లు తప్పవు. వాటిని ఎదుర్కోలేమని భయపడి చతికిలబడిపోతే ముందుకెళ్లలేము. ఒక్క అవకాశానికే పరిమితం కావద్దు. వచ్చిన అవకాశాలన్నీ అందిపుచ్చుకోండి. జీవితమనే ప్రయాణంలో సాహసోపేతమైన అడుగు వేస్తారు. ఈ మంగళవారంలోగా పెద్ద నిర్ణయాన్ని తీసుకోవలసి వస్తుంది. కలిసొచ్చే రంగు: క్రీమ్
 
 
క్యాప్రికార్న్   (డిసెంబర్ 22-జనవరి 20)
జీవితానికి భద్రత లభిస్తుంది. సంపూర్తిగా, స్వచ్ఛంగా జీవించడం అలవాటు చేసుకుంటే ప్రతి ఒక్క సందర్భమూ ఆనందాన్నిస్తుంది. కొన్ని విషయాలలో మీ అంచనాలు ఫలిస్తాయి. ఇతరులకు నచ్చదేమో అని మీ ధోరణిని మార్చుకోనక్కరలేదు. మీకు నచ్చినట్లు జీవించండి. ముదురు ఎరుపు, ముదురు నారింజ రంగుల జోలికి ఈ వారం వెళ్లకండి. కలిసొచ్చే రంగు: వైట్
 
 
అక్వేరియస్ (జనవరి 21-ఫిబ్రవరి 19)
ప్రకృతిలో మమేకమైనప్పుడే అందులోని అసలైన ఆనందాన్ని అనుభవించగలం. అంతకు మించిన బహుమతి లేదు. కెరీర్‌పరంగా కొంచెం బరువుగా, బాధ్యతగా, భయంగా అనిపించవచ్చు. భయపడకండి. భావోద్వేగాలను అదుపు చేసుకోండి. కొంతకాలంపాటు దిగుళ్లన్నింటికీ దూరంగా విందు వినోదాలతో కాలక్షేపం చేయండి. కలిసొచ్చే రంగు: రస్ట్ బ్రౌన్
 
పైసిస్  (ఫిబ్రవరి 20-మార్చి 20)
మీకు సంతోషాన్నిచ్చే పనికి బదులుగా ఇష్టంలేనివి చేసి, బాధపడి మాత్రం ఏం లాభం?  మీరు ఎలా ఉంటే మీకు సంతోషంగా ఉంటుందో ఇప్పటికైనా గ్రహించండి. కొన్ని విషయాలలో, భావోద్వేగాలలో సమతౌల్యాన్ని పాటించండి. మీ ఆశలు ఫలించే వారమిది. మీకు ఇష్టమైన, నచ్చిన వ్యక్తులను కలుస్తారు. ఊహించని విధంగా డబ్బొస్తుంది. కలిసొచ్చే రంగు: లైట్ గ్రీన్
 
 ఇన్సియా కె.
 టారో అండ్  ఫెంగ్‌షుయ్ అనలిస్ట్, న్యూమరాలజిస్ట్

 
 సౌర వాణి

 
ఏరిస్ (మార్చి 21- ఏప్రిల్ 20)

శుభకార్యాలని గురించిన ఆలోచనలు వస్తాయి. తొందరలో ఫలించే వీలుంది. పరిహాసమైనా విరోధానికి దారితీసే పరిస్థితి కన్పిస్తోంది కాబట్టి, ఈవారం ఎవరితోనూ ఏవిధమైన చర్చలూ, వాగ్వివాదాలూ లేకుండా గడపండి. ప్రయాణ సమయాల్లో వస్తువుల జాగ్రత్తని పాటించండి. ఆరోగ్యం బాగుంటుంది.
 
 ఏరిస్ (మార్చి 21- ఏప్రిల్ 20)

శుభకార్యాలని గురించిన ఆలోచనలు వస్తాయి. తొందరలో ఫలించే వీలుంది. పరిహాసమైనా విరోధానికి దారితీసే పరిస్థితి కన్పిస్తోంది కాబట్టి, ఈవారం ఎవరితోనూ ఏవిధమైన చర్చలూ, వాగ్వివాదాలూ లేకుండా గడపండి. ప్రయాణ సమయాల్లో వస్తువుల జాగ్రత్తని పాటించండి. ఆరోగ్యం బాగుంటుంది.
 
టారస్  (ఏప్రిల్ 21-మే 20)
కర్షకులకు కొత్త ఆశలు చిగురించే అవకాశముంది. ఎంత వత్తిడి వచ్చినా, భూమిని అమ్మే ఆలోచనకు రావద్దు. వ్యవసాయం మీ జీవితాన్ని మార్చగల శక్తివంతమైనదనే యదార్థం ముందుముందు మీకు తెలుస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య వాగ్వివాదాలొచ్చే పరిస్థితి ఉంది కాబట్టి, విరోధం వచ్చే చర్చ వస్తుందనగానే ఆ ప్రదేశాన్ని విడిచిపొండి.
 
 జెమిని (మే 21-జూన్ 21)
అతిముఖ్యమైన పనుల్ని వాయిదా వేసుకుని ప్రయాణించడం సరికాదు. తెలియని ఖర్చు మీదపడే కారణంగానూ, ఆదాయం ఈవారంలో అంతంతమాత్రంగానే ఉండే కారణంగానూ వ్యయాన్ని అదుపుచేయడం కొంత కష్టంగా ఉండవచ్చు. కొత్త వస్తువుల కొనుగోళ్లు మిమ్మల్ని ఋణభారానికి నెట్టేయవచ్చు కాబట్టి ఈవారంలో కొనుగోళ్లు సరికాదేమో ఆలోచించుకోండి.
 
క్యాన్సర్(జూన్22-జూలై 23)
ఉద్యోగంలో మీకున్న ప్రతిభకి ఓ గుర్తింపు వస్తుంది. అందరూ మిమ్మల్ని, మీ కృషినీ ప్రశంసిస్తారు. దీనితో అదనపు బాధ్యతలు చేపట్టవలసి రావచ్చు. అయితే ఆ కొత్త బాధ్యతని స్వీకరించండి తప్ప, కాదని అనవద్దు. ఇది మీకు మంచి నిచ్చెనవంటిది కాబోతోంది. మీరు వృత్తిపరంగా ఎదిగే అవకాశముంది కాబట్టి, వృత్తిని విస్మరించకండి.
 
లియో (జూలై 24-ఆగస్టు 23)

అనుకోని కొన్ని కారణాలతో చేయవలసిన పనులు వాయిదా పడడం వల్ల కొత్త ఇబ్బందులు తాత్కాలికంగా రావచ్చు. మీకు పనిని సకాలంలో చేయలేని పక్షంలో మరొకరి సహాయాన్నైనా తీసుకుని పూర్తిచేయండి. ఆడంబరాలూ, అట్టహాసాలూ సరికావని గ్రహించండి. నెల చివర్లో శుభవార్తలకు అవకాశముంది. మీరు చేసే రాజీ ప్రయత్నాలు ఫలించే పరిస్థితి కన్పిస్తోంది.
 
వర్గో (ఆగస్టు24-సెప్టెంబర్ 23)
మీ కుటుంబ సభ్యుల సంపూర్ణ సహకారాల కారణంగా మీరు చేసినా చేయకున్నా మీ పనులన్నీ నెరవేరుతుంటాయి. అయితే ఖర్చు విషయంలో ఓ ప్రణాళిక ఉండడం ఎంతైనా అవసరం. ఎవరిదో అయిన సొమ్ము మీ వద్ద దాచి ఉంచితే దానినుండి వ్యయం చేయడం లేదా ఋణం చేసి ఖర్చు చేయడం వంటి అకార్యం చేసి మిత్రుల వల్ల నిందపడే అవకాశముంది. జాగ్రత్త!
 
లిబ్రా (సెప్టెంబర్ 24- అక్టోబర్ 23)
శుభవార్తని వినే అవకాశముంది. దూరప్రయాణాలు చేయవలసి వస్తుంది. ప్రయాణాల్లో వస్తు విషయంలో తగు జాగ్రత్త అవసరం. సంతానానికి అవకాశముంది. వ్యాపారంలో లాభం రావచ్చు. వృత్తిలో మీకు ఓ గుర్తింపు ఏర్పడవచ్చు. ఉద్యోగంలో మీదైన శైలికి అందరూ ఆకర్షితులు కావచ్చు. పిల్లల చదువు విషయంలో శ్రద్ధ వహించాల్సి ఉంటుంది.
 
స్కార్పియో (అక్టోబర్ 24-నవంబర్ 22)
మీ ఊహలు నిజమై, మీరనుకున్నంత ప్రయోజనం పొందగలుగుతారు. ఎంతో ధైర్యంతో వేసిన మీ ప్రణాళిక ఇలా విజయవంతం కావడం వల్ల మీలో మరింత ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇతరుల సలహాలను, సూచనలను వింటూ మీదైన ఆలోచనలను జోడించి, ఏది మంచో ఏది చెడో నిర్ణయించుకోగల నిర్ణయాత్మక శక్తి మీకు విజయాన్ని ప్రసాదిస్తుంది.
 
 శాజిటేరియస్ (నవంబర్23-డిసెంబర్ 21)
 కుటుంబంలోని కలతలు తొలగి, ఐకమత్యంతో ఉంటారు. ముఖ్యంగా మీ భార్య ఆరోగ్యం బాగా సహకరిస్తూ మీకు ధైర్యాన్నిస్తుంది. పెద్దలతో, అనుభవజ్ఞులతో సంప్రదించి పనిచేసే లక్షణం అబ్బుతుంది. ఆ కారణంగా పొరపాట్లు జరిగే అవకాశం కనబడదు. కొన్ని సున్నితమైన విషయాలు చెప్పవలసినపుడు ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం మంచిది. దానివల్ల అపార్ధాలు రావు.
 
 క్యాప్రికార్న్  (డిసెంబర్ 22-జనవరి 20)
 చేపట్టిన పనులు ఆలస్యంగా పూర్తయ్యే అవకాశం కన్పిస్తోంది. అవి కూడా శ్రమతో మాత్రమే కాక, అధిక ధనవ్యయంతో పూర్తవుతాయని తోస్తోంది. చేస్తున్న వృత్తిలో ఆధిక్యం, ఉద్యోగంలో గౌరవం లభించవచ్చు. ధనాదాయం ఉండగలదు. ఉద్యోగులు సెలవులు పెట్టడాన్ని తగ్గించు కోవాలి.
 
అక్వేరియస్  (జనవరి 21-ఫిబ్రవరి 19)
అధికారుల నుండి గట్టి ఒత్తిడి కలగడం, ఏం చేయాలో తోచకపోవడం, పనిభారం పెరగడం వంటివి ఉండవచ్చు. మౌనంగా, గంభీరంగా ఉండడం మంచిది కావచ్చేమో కానీ, కొన్ని సందర్భాల్లో చిక్కుల్ని తెచ్చిపెట్టవచ్చు. కాబట్టి, పనిభారం, అవగాహన లేని పని వంటి పరిస్థితులు వచ్చిన పక్షంలో ఆ విషయాన్ని పైవారికి సున్నితంగా చెప్పండి, మధ్యవర్తులు వద్దు.
 
 పైసిస్ (ఫిబ్రవరి 20-మార్చి 20)

 ఎండావానల మిశ్రమంలా, ఒకరోజు సన్మానం, మరోరోజు అవమానం అనేవిధంగా పరిస్థితి గోచరిస్తోంది. ధైర్యంగా ఉంటూ దేనికీ చలించని మీ గుండె నిబ్బరం మీకు మానసిక ప్రశాంతతను ఇవ్వవచ్చేమో కానీ, కుటుంబ సభ్యులకు మాత్రం తెలియని బాధగానే ఉంటుంది. మాటమాత్రంగా కూడా ఎవరికీ హామీలను ఇవ్వకండి.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement