ఎందుకు తప్పుకుంది? | why she left | Sakshi
Sakshi News home page

ఎందుకు తప్పుకుంది?

Published Mon, Jun 8 2015 12:08 AM | Last Updated on Sun, Sep 3 2017 3:23 AM

ఎందుకు తప్పుకుంది?

ఎందుకు తప్పుకుంది?

గాసిప్
సుజయ్ ఘోష్ డెరైక్షన్‌లో, సైఫ్ ఆలి ఖాన్ సరసన కంగనా రనౌత్ నటించనుంది అనే వార్తలు జోరుగా వినిపించాయి. ఒక జపాన్ నవల ఆధారంగా ఏక్తాకపూర్ నిర్మించనున్న ఈ రొమాంటిక్  థ్రిల్లర్ కెరీర్ పరంగా కంగనాను మరో మెట్టు పైకి తీసుకెళుతుందని ఆశించారు అభిమానులు. అయితే తాను ఆ సినిమాలో నటిస్తానని ఎప్పుడూ ప్రటించలేదని, కాంట్రాక్ట్ మీద సంతకమే చేయలేదని కంగనా చెబుతోంది. దర్శక,నిర్మాతలు కంగనాను సంప్రదించినప్పుడు సినిమాలో నటించడానికి ఆమె ఒప్పుకుందని, ఆ తరువాత ఏమైందో ఏమోగానీ ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుందని విశ్వసనీయ వర్గాల కథనం. పెద్ద బ్యానర్, పెద్ద హీరో... అయినప్పటికీ కంగనా ఈ ప్రాజెక్ట్ నుంచి ఎందుకు తప్పుకుంది? నేషనల్  అవార్డ్ రావడం, ‘తను వెడ్స్ మను’ సీక్వెల్ హిట్ కావడం.. మొదలైనవి తన ప్రాధాన్యతలను మార్చాయని, స్క్రిప్ట్‌కు సంబంధించిన విభేదాలు, పర్‌ఫెక్షనిజం ఆ ప్రాజెక్ట్  నుంచి తప్పుకోవడానికి కారణమయ్యాని అంటున్నారు కొందరు.
ఇంతకీ నిజమేమిటో!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement