జూన్ 2 నుంచి జనవరి 26 దాకా | From June 2 to January 26th | Sakshi
Sakshi News home page

జూన్ 2 నుంచి జనవరి 26 దాకా

Published Mon, Jan 26 2015 2:48 AM | Last Updated on Sat, Sep 2 2017 8:15 PM

జూన్ 2 నుంచి జనవరి 26 దాకా

జూన్ 2 నుంచి జనవరి 26 దాకా

 సందర్భం

 తెలంగాణ రాష్ట్రం అవతరించటం వల్లనే పాలన ప్రజల వాకిళ్ల దగ్గరకు వచ్చింది. పోరాట పుష్పాలు వికసించేది శాంతి పుప్పొడులను వెదజల్లడానికేనన్న తత్త్వశాస్త్ర దర్శినిగా తెలంగాణ నిలిచింది.
 
 2009 డిసెంబర్ 9న కేంద్రం ప్రకటన నుంచి, మాట మీద నిలబడ్డ మనుషుల నుంచి పార్లమెంటులో పెప్పర్ స్ప్రేల ను దాటు కుంటూ 2014 జూ న్ 2న తెలంగాణ రాష్ట్రం 29వ రాష్ట్రంగా దేశపటం మీద నిలి చింది. తెలంగాణ కలల స్వప్నం జూన్ 2వ తేదీ అ య్యింది.  ఇప్పుడు తెలంగాణ ప్రపంచ అస్తిత్వ ఉద్యమ శాస్త్రంగా నిలిచింది. గెలిచిన గెలుపులతో అజేయంగా ముందుకు సాగుతున్న తెలంగాణ అభివృద్ధి మంత్రంగా మారి ఈ నేల సస్యశ్యామలం కావాలి. పోరాట పుష్పా లు వికసించేది శాంతి పుప్పొడులను వెదజల్లడానికేనన్న తత్త్వశాస్త్ర దర్శినిగా తెలంగాణ నిలిచింది. ఆ పనికి తొలి తెలంగాణ రిపబ్లిక్‌లో టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రతిన బూననుంది. ఏడెనిమిది నెలల తెలంగాణ ప్రభుత్వం ఎన్నెన్నో సాహసాలకు శ్రీకారం చుట్టింది. ఎన్నెన్నో కొత్త ఆలోచనలకు ద్వారాలు తెరిచింది. తెలంగాణ అన్ని రంగాల్లో దూసుకుపోయేందుకు కావాల్సిన కసరత్తును కేసీఆర్ కొనసాగిస్తున్నాడు. తెలంగాణ ప్రభుత్వం పల్లె లు పచ్చగా ఉండేందుకు కావాల్సిన కార్యరంగాన్ని సన్నద్ధం చేసుకుంటోంది. హైదరాబాద్‌ను విశ్వనగ రంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికల రూపకల్పన జరుగు తోంది. భారత సర్వసత్తాక ప్రజాస్వామిక గణతంత్రం చూసినవాళ్లు పెద్దలు సైతం ఈ రిపబ్లిక్‌డే నుంచి తెలం గాణ ఏవైపుకు అడుగులు వేయబోతుందని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

 తెలంగాణ సమాజం పునర్నిర్మాణం కోసం తపన చెందుతోంది. రాజకీయ ప్రక్రియ ద్వారా గెలుచుకొచ్చి ఆ పీఠం మీద జయుడుగా నిలిచిన కేసీఆర్ పునర్నిర్మాణ రచనలు చేస్తూ ఆచరణాత్మక రూపం దాల్చేందుకు తపన చెందుతున్నారు. ఇప్పుడు అందరిముందు ఉన్న లక్ష్యం తెలంగాణ పునర్నిర్మాణమే.  ఈ రిపబ్లిక్‌డే నుంచి కొత్తగా తెలంగాణలో ఏం జరుగుతుందనే ప్రశ్నలు వేస్తున్న సందర్భం కూడా లేకపోలేదు. వరంగల్లులో ముఖ్యమంత్రి స్వయంగా నాలుగు రోజులుండి ఇరుకు సందుల వాడల్లో గడపగడప తిరిగి వారి సమస్యలను విని పరిష్కారాల కోసం అక్కడికక్కడే ఆకస్మిక ప్రణా ళికలు తయారు చేశారు. మహబూబ్‌నగర్‌లో చిన్నచిన్న గల్లీల్లో ప్రజల జీవన విధానం చూసిన ముఖ్యమంత్రి చలించిపోయి వారి స్థితి మెరుగుపడాలని ప్రయత్నాలు మొదలుపెట్టారు. కాకతీయుల కాలం నాటి చెరువులు, పునరుద్ధరణకు నోచుకోని చెరువులు జలాలతో, కాలు వలతో కళకళలాడబోతున్నాయి. వాటర్‌గ్రిడ్ పథకం ద్వా రా ప్రజల దోసిళ్లలోకి మంచినీళ్లు రాబోతున్నాయి. తెలం గాణ ప్రభుత్వం పేద పిల్లల కంచాలలోకి సన్నబియ్యం పెట్టి అమ్మ ప్రేమను పంచిపెడుతుంది. తెలంగాణ రాష్ట్రం అవతరించటం వల్లనే పాలన ప్రజల వాకిళ్ల దగ్గర కు వచ్చింది. కేసీఆర్ ఆలోచనలను కిందిస్థాయికి తీసుకు పోయేందుకు పాలనారంగం సర్వసన్నద్ధం కావాల్సి ఉంది.

 పునర్నిర్మాణానికి సైతం చెమటలు చిందించేం దుకు నవతరం సిద్ధంగా ఉంది. కానీ పాలనారంగంలో పేరుకుపోయిన అవినీతికి చరమగీతం పాడేందుకు కూడా కేసీఆర్ ప్రక్షాళనా చర్యలు మొదలు పెట్టారు.  భారత రాజ్యాంగాన్ని సృష్టించుకొని ‘దేశం’ సంపూర్ణ గణతంత్ర రాజ్యంగా నిలిచింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది. తెలంగాణ తన ఎదుగు దలకు అభివృద్ధి రచనను చేసుకొని శక్తివంతంగా ఎదగ వలసి ఉంది. తెలం గాణ రావడానికి ఇంతకాలం పట్టింది. అభివృద్ధి జరగడానికి మరికొంతకాలం పడుతుంది. అవినీతిని అంతం చేసేం దుకు పాలనారంగంలో ప్రక్షాళనా కార్యక్రమానికి కేసీఆర్ స్వీకారం చుట్టారు. అదే బంగారు తెలంగాణకు తొలిమెట్టవుతుంది.
 జూలూరు గౌరీశంకర్
 కవి, సీనియర్ జర్నలిస్టు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement