
లేడీ పేసర్స్
మామూలు పరుగు పోటీలకు ఎవరి సాయం అవసరం లేదు గానీ, మారథాన్ పరుగులో మాత్రం పేసర్ల సాయం తప్పనిసరి. మారథాన్‌లో పరుగులు తీసేవారికి మార్గదర్శకత్వం చేసేవారిని ‘పేసర్’ అంటారు.
మామూలు పరుగు పోటీలకు ఎవరి సాయం అవసరం లేదు గానీ, మారథాన్ పరుగులో మాత్రం పేసర్ల సాయం తప్పనిసరి.
మారథాన్‌లో పరుగులు తీసేవారికి మార్గదర్శకత్వం చేసేవారిని ‘పేసర్’ అంటారు. దేశంలోనే రెండో అతిపెద్ద మారథాన్‌గా గుర్తింపు పొందిన హైదరాబాద్ మారథాన్‌లోనూ పేసర్ల పాత్ర తక్కువేమీ కాదు. కొత్త రన్నర్లకు మార్గదర్శకత్వం వహించేందుకు పలువురు మహిళలు సైతం పేసర్లుగా సేవలందించేందుకు ముందుకొస్తున్నారు. రన్నర్ల స్థాయి నుంచి పేసర్లుగా ఎదిగిన కొందరు మహిళల
అనుభవాలు వారి మాటల్లోనే...
సేవలను వినియోగించుకోవాలి
పీహెచ్‌డీ చేస్తుండగా రన్నింగ్‌పై ఆసక్తి మొదలైంది.
బెంగళూరులో 2000 సంవత్సరంలో జరిగిన 22 కిలోమీటర్ల
పరుగులో పాల్గొన్నా. ఇప్పటి వరకు ఏడు ఫుల్
మారథాన్‌లలో పాల్గొన్నా. ఈ పరుగే నన్ను పేసర్‌గా
మీ ముందు నిలిపింది. మా సేవలను
అందరూ వినియోగించుకోవాలి.
- దేవయాని హల్దర్
కొత్త రన్నర్లకు బాసటగా..
మూడేళ్ల కిందట బెంగళూరు నుంచి ఇక్కడకు వచ్చి స్థిరపడ్డా. 2012 హైదరాబాద్ హాఫ్ మారథాన్‌లో పరుగెత్తా. 2013లో జరిగిన 10కే రన్‌లో పోడియం ఫినిషర్‌గా నిలిచా. ఒలింపిక్ ట్రైథ్లాన్‌లో పాల్గొన్నా. ఈ ఏడాది ఫిబ్రవరిలో హైదరాబాద్ రన్నర్స్ నిర్వహించిన హాఫ్ మారథాన్‌లో 2 గంటల 1 నిమిషంలో లక్ష్యాన్ని అధిగమించా. ఈసారి హైదరాబాద్ రన్నర్స్ నాకు పేసర్‌గా అవకాశం ఇచ్చారు. కొత్త రన్నర్లకు అన్ని విధాలా బాసటగా ఉంటా.
- ఠాకూర్ కస్తూరి
లైఫ్‌లాంగ్ రన్ చేస్తా
లండన్, ఇస్తాంబుల్ సహా ఇప్పటి
వరకు ఆరు ఫుల్ మారథాన్‌లలో
పాల్గొన్నా. మారథాన్‌కు ఒకరోజు
ముందే కొత్త రన్నర్స్‌కు రన్నింగ్ ఎలా ఉండాలి, ఎలా హైడ్రేట్ చేసుకోవాలి
వంటి అంశాలపై అవగాహన
కల్పిస్తాం. రన్నర్స్ పేసర్లను
ఫాలో కావాలి. ముందుగా
చేసుకున్న ప్లానింగ్
ప్రకారం రన్నింగ్
సాగించాలి.
- డా.శిల్పారెడ్డి
రన్నర్లను గమ్యానికి చేర్పిస్తా...
హైదరాబాద్ రన్నర్స్ జనవరి 4న ‘అలంకృత’లో
నిర్వహించిన లాంగ్న్‌ల్రో పాల్గొన్నా. తొలుత సరదాగా ఐదు
కిలోమీటర్లు పరుగెత్తాలనుకున్నా. అయితే, అందరూ లక్ష్యాన్ని
అధిగమించేందుకు ముందుకు వెళుతుంటే, నేనూ పోటీ పడ్డా.
మొత్తానికి 2 గంటల 35 నిమిషాల్లో లక్ష్యాన్ని చేరుకున్నా. తర్వాత
హెచ్‌సీయూలో జరిగిన హైదరాబాద్ రన్నర్స్ క్లబ్ నిర్వహించిన హాఫ్ మారథాన్‌లో పాల్గొని, 2 గంటల 14 నిమిషాల్లో 21 కిలోమీటర్ల లక్ష్యాన్ని చేరుకున్నా. కొత్త రన్నర్స్‌కు సోషల్ మీడియా ద్వారా సలహా, సూచనలు ఇస్తుంటా. హైదరాబాద్ రన్నర్స్ ఈసారి హాఫ్ మారథాన్ 21 కిలోమీటర్ల విభాగంలో పేసర్‌గా అవకాశం ఇచ్చారు.
దాదాపు ఆరువందల మంది రన్నర్లను సకాలంలో
గమ్యానికి చేర్పించే బాధ్యతను సక్రమంగా
నిర్వహిస్తా. - బబితా జేవియర్
పేసర్‌ను ఎంచుకోవడం ఇలా...
మారథాన్‌కు ఒక వారం ముందు పేసర్ తన
గ్రూపు వారితో ఆన్‌లైన్‌లో స్ట్రాటజీపై చర్చిస్తారు. దీనికి ఒకరోజు ముందు పేసర్లు అందరూ
పాల్గొనే ఎక్స్‌పోలో వారి స్ట్రాటజీని రన్నర్లు
నేరుగా తెలుసుకోవచ్చు.
దాని బట్టి తమకు నచ్చిన
వారిని ఎంచుకోవచ్చు.
బస్ అంటే ఇదీ...
కొత్త రన్నర్స్‌కు మార్గదర్శనం చేసేందుకు పేసర్లు
జర్నీ చేసే టైమ్‌ను ‘బస్’ అంటారు. హాఫ్, ఫుల్ మారథాన్‌లో పాల్గొనే రన్నర్లు వివిధ బస్‌లలో ఉన్న పేసర్లను సెలక్ట్ చేసుకోవచ్చు. హాఫ్ మారథాన్‌లో 2.45 గంటల బస్‌లో బబితా జేవియర్, 2.15 గంటల బస్‌లో ఠాకూర్ కస్తూరి, ఫుల్ మారథాన్‌లో 5.30 గంటల బస్‌లో డాక్టర్ శిల్పారెడ్డి పేసర్లుగా ఉన్నారు. ఫుల్ మారథాన్‌లో 4 గంటల మొదలుకొని 6 గంటల బస్ వరకు ఉంటాయి. ఆ సమయాల్లో ఆ బస్‌లలోని పేసర్లు
రన్నర్లను గమ్య స్థానానికి చేరుస్తారు. పేసర్లలోనూ ఒక్కొక్కరిదీ ఒక్కో శైలి. కొందరు పరుగు వేగంలో నిలకడ పాటిస్తారు. ఇంకొందరు వేగంగా దూసుకెళతారు. మరికొందరు తొలుత నెమ్మదిగా పరుగు ప్రారంభించి, క్రమంగా వేగాన్ని పెంచుతారు. పేసర్లను అనుసరిస్తూ రన్నర్లు గమ్యస్థానాన్ని చేరుకుంటారు.
- వాంకె శ్రీనివాస్