తాజ్‌కృష్ణలో మెడిటరేనియన్ రుచులు
ఆరోగ్యకరమైన మెడిటరేనియన్ ‘సౌక్’ వంటకాలు భాగ్యనగర భోజనప్రియులకు చమలూరిస్తున్నాయి. మొరాకన్, గ్రీక్, టర్కిష్, ఈజిప్షియన్, అరబిక్ స్పెషాలిటీ వంటకాలు.. హుమ్మమస్ సాంప్లర్, మెజెస్ సాంప్లర్, గ్రీక్ సలాడ్, షంకలీష్, కిబ్బె, ఫలాఫెల్, స్పినాచ్ ఫటాయెర్, హలౌమీ, షోర్బా అదాస్, షొర్బెత్ దిజాజ్, రుబియన్ సలాలహా, సమక్ మెష్వీ.. వంటి రుచులను బంజారాహిల్స్‌లోని హోటల్ తాజ్‌కృష్ణ నగర వాసులకు అందుబాటులోకి తెచ్చింది. ఈ నెల 26 వరకు సాగే ‘సౌక్’ ఫుడ్ ఫెస్టివల్‌లో ప్రతిరోజూ మధ్యాహ్నం 12.30 నుంచి 3.00 గంటల వరకు లంచ్, రాత్రి 7.30 నుంచి 11.30 గంటల వరకు డిన్నర్ అందుబాటులో ఉంటాయి.
- సిటీప్లస్