ఆదాబ్.. హైదరాబాద్ | more bollywood movie shootings to take from hyderabad City | Sakshi
Sakshi News home page

ఆదాబ్.. హైదరాబాద్

Published Wed, Aug 13 2014 12:23 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

ఆదాబ్.. హైదరాబాద్ - Sakshi

ఆదాబ్.. హైదరాబాద్

ఇక్బాల్, వెల్‌డన్ అబ్బా, బాబీ జాసూస్, దావత్-ఎ-ఇష్క్.. ఈ సినిమాలన్నీ బాలీవుడ్‌వే. అందులో వీసమెత్తయినా సందేహం లేదు. ఈ హిందీ సినిమాలకు మన భాగ్యనగరానికి ఓ లింకుంది. ఈ మూవీలన్నీ మన సిటీలో షూటింగ్ చేసుకున్నవే. బాలీవుడ్ కెమెరాలన్నీ భాగ్యనగరం చుట్టూ చక్కర్లు కొట్టే ట్రెండ్ ఇటీవల బాగా ఊపందుకుంది. మరోవైపు హైదరాబాదీలూ బాలీవుడ్ మూవీస్‌లో నటించడం కూడా పెరిగింది.
 - ఎస్.సత్యబాబు
 
 .ఈ మధ్యే విడుదలైన బాబీ జాసూస్ షూటింగ్ కోసం విద్యాబాలన్ సిటీలో కొన్ని నెలలు మకాం వేసింది. అంతేనా బేగంపేట సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజ్ గాళ్ అంకితారాయ్.. విద ్యతో కలసి తెర పంచుకుంది కూడా. నెలలో విడుదల కానున్న ‘దావత్ ఎ ఇష్క్’ కోసం పరిణీతి చోప్రా స్కూటర్ వేసుకుని సిటీ రోడ్లపై చక్కర్లు కొడితే.. ఆమెతో కలసి నటించే భాగ్యాన్ని మన తార్నాక యువకుడు ఆశిష్‌రాజ్ కొట్టేశాడు. యాక్షన్.. కట్‌లే కాదు, మన సిటీజనుల్ని నటుల్ని చేయడంలోనూ బాలీవుడ్ బిజీగానే ఉంది.
 
 సిటీ డిమాండ్ చేసింది
 నిజానికి బాబీ జాసూస్ సినిమాని ముందు ముంబైలోని మహ్మద్ అలీ రోడ్ పరిసరాల్లో షూట్ చేయడానికి అనువుగా స్క్రిప్ట్ రైటర్ సంయుక్త చావ్లా షేక్, డెరైక్టర్ సమర్ షేక్ ప్లాన్ చేశారట. అయితే హైదరాబాద్ పాతబస్తీని ఓసారి ట్రై చేయమని నిర్మాతలు సాహిల్, దియామిర్జా వారికి సూచించారు. దీంతో సంయుక్త, సమర్‌లు తొలిసారి నగరాన్ని సందర్శించారు. ‘మొఘల్‌పురా ఏరియా, అక్కడి ఆర్కిటె క్చర్ విశేషాలకు వీళ్లు ఫిదా అయిపోయారు. ఆ సినిమాని ఇక్కడే తీయాలని డిసైడ్ అయిపోయి.. మరో రెండు నెలలు వర్క్ చేసి లోకల్ ఫ్లేవర్ వచ్చేలా స్క్రిప్ట్‌లో మార్పులు చేర్పులు చేశారు. కట్ చేస్తే మొఘల్‌పురాలోనే కాదు సిటీలోని మరిన్ని ప్రాంతాల్లో ఈ టీం సందడి చేసింది.
 
 స్క్రిప్ట్ కమాండ్ చేసింది
 కొన్ని బాలీవుడ్ చిత్రాలను అనుకోకుండా సిటీ ఆకర్షిస్తుంటే.. మరికొన్ని చిత్రాల స్క్రిప్ట్‌లు హైదరాబాద్ బేస్డ్‌గా రూపొందుతున్నాయి. అదే కోవలోకి వస్తుంది త్వరలో విడుదలవుతున్న దావత్-ఎ-ఇష్క్. ఈ సినిమాలో హీరోయిన్ పరిణీతి చోప్రా కథాపరంగా హైదరాబాద్‌వాసి. ఈ సినిమా సిటీలో షూటింగ్ జరుపుకోవడానికి అదొక్కటే రీజన్ అనుకుంటే పొరపాటు. ‘హైదరాబాద్  కాస్మొపాలిటన్ సిటీ. ఆధునిక పొంగులు, సంప్రదాయ హంగులు.. రెండూ సమపాళ్లలో మేళవించి ఉన్న నగరం. మొహల్లాలు, మాల్స్ రెండూ పక్కపక్కనే సహవాసం చేస్తాయిక్కడ’ అని అంటున్నారు బాలీవుడ్ రూపకర్తలు. ముంబైని తలపించే పరిసరాలు, అంతకు మిన్నగా మురిపించే వాతావరణం, జీవనశైలి.. ఇవన్నీ బాలీవుడ్ స్టార్లను ఆకర్షిస్తుండటంతో హైదరాబాద్‌లో షూటింగ్‌కు వారు సై అంటున్నారట. మరిన్ని చిత్రాలకూ హైదరాబాద్ గల్లీలు సాక్ష్యం కానున్న నేపథ్యంలో భాగ్యనగరంలో బాలీవుడ్ సందడి మరింత పెరిగే చాన్స్ ఉందని చెప్పక తప్పదు.
 
 స్వీట్ పీపుల్
 ఈ సినిమా కోసం హైదరాబాద్‌పై చాలా పరిశోధన చేశా. ఇక్కడి ప్రజల భాష, యాస, లైఫ్ స్టైల్ అన్నీ దగ్గరగా చూశా. మొదట కొన్ని స్టూడియోలో.. కొన్ని రోడ్ల మీద అనుకున్నాం. కానీ షూటింగ్ మొదలయ్యాక.. స్టూడియోలో తీయాల్సిన అవసరమే రాలేదు. చార్మినార్, నెక్లెస్ రోడ్, హైటెక్ సిటీలతో పాటు మాల్స్‌లో షూటింగ్ చేశాం. షూటింగ్ చూసి షాక్ అవ్వడం.. జనాలు పోగవ్వడం.. ఇక్కడ కనిపించలేదు. అలా చూసి వెళ్లిపోతారంతే. పరిణీతి చోప్రాతో పాటు ఆదిత్యరాయ్ కపూర్, అనుపమ్‌ఖేర్, ఇంకా మరికొంత మంది బాలీవుడ్ నటులు సైతం హైదరాబాదీలుగానే మా సినిమాలో నటించారు. ఉర్దూలో ప్రావీణ్యం కోసం స్థానికుడైన ఇలాహె హెప్తుల్లాను డి క్షన్ ఎక్స్‌పర్ట్‌గా ఎంచుకున్నాం.  
 -హబీబ్ ఫైజల్, ‘దావత్-ఎ-ఇష్క్’ దర్శకుడు
 
 కల నిజమైంది
 ఎంబీఏ పూర్తి చేశా. దావత్-ఎ-ఇష్క్ సినిమాలో అనుకోకుండా పరిణీతి చోప్రాతో కలిసి నటించే అవకాశం రావడం, అది కూడా మన సిటీలోనే షూటింగ్ జరుపుకోవడం ఓ వండర్‌లా అనిపించింది.సినిమా అవకాశాల కోసం కొంతకాలం గట్టిగానే ప్రయత్నించి విఫలమయ్యాను. అనుకోకుండా ఈ సినిమాలో చాన్స్ రావడంతో నా కల నిజమైంది. పుట్టింటి పట్టుచీర సీరియల్‌లోనూ చేశాను. ఆడిషన్స్‌లో మూడు రౌండ్ల తర్వాత సెలక్టయ్యాను. యష్‌రాజ్ ట్రీట్‌మెంట్ చాలా అద్భుతం. ఒక కుటుంబసభ్యుడిలా చూసుకున్నారు.
 - ఆశిష్‌రాజ్
 
 స్థానిక యాసను పలికించాను
 దావత్ ఎ ఇష్క్ సినిమాకు అసిస్టెంట్ డెరైక్టర్‌గా, నటుడిగా పనిచేశాను. పరిణీతి చోప్రా డైలాగ్స్‌లో లోకల్ ఫ్లేవర్ వినిపించేలా ఆమెకు తాత్కాలిక టీచర్‌గా పనిచేశాను. దర్శకుడు చెప్పిన పదాన్ని.. దక్కనీ స్లాంగ్ వచ్చేలా ఉర్దూలోకి తర్జుమా చేసి పాత్రలతో పలికించేవాడిని. ఈ సినిమా సెట్స్ మీద అందరం కలసి హైదరాబాద్ బిర్యానీ రుచులు ఆస్వాదించే వాళ్లం. మన సిటీని బాలీవుడ్ వర్గాలు ఎంత గొప్పగా భావిస్తాయో ఈ సినిమాకు పనిచేసిన తర్వాత అర్థమైంది.
 - జీషన్ జాన్‌బాజ్, పాతబస్తీ
 
 ఆ అవకాశం ఓ అదృష్టం
 మా అక్క కోసమని తనతో కలసి ఆడిషన్స్‌కు వెళ్లాను. అక్కడ అనుకోకుండా నన్ను బాబీ జాసూస్ సినిమాలో పాత్ర కోసం అడిగారు. విద్యాబాలన్‌తో నటించానంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నా. నన్ను ఒక కొత్త అమ్మాయిగానో, హైదరాబాదీ అని వేరుగానో చూడలేదు. ఈ సినిమాలో నీలోఫర్ అనే 20 ఏళ్ల అమ్మాయి పాత్ర పోషించాను. కరణ్‌జోహర్, మణిరత్నం వంటి దర్శకులతో పనిచేయాలనుంది.
 - అంకితారాయ్, సెయింట్ ఫ్రాన్సిస్ కళాశాల విద్యార్థిని

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement