అలలపై విన్యాసం | Yacht Club of Hyderabad | Sakshi
Sakshi News home page

అలలపై విన్యాసం

Published Thu, Nov 20 2014 1:43 AM | Last Updated on Wed, Apr 3 2019 5:26 PM

అలలపై విన్యాసం - Sakshi

అలలపై విన్యాసం

జలకళ ఉట్టి పడే సరస్సును చూస్తే ఎవరికైనా ఎంతో ఉత్సాహం. అందులో బోటింగ్ చేస్తే మరెంతో ఉల్లాసం. పిల్లలైతే కేరింతలు కొట్టకుండా ఉండలేరు. అలాంటివారి కోసమే హైదరాబాద్‌లో ఓ సెయిలింగ్ క్లబ్ ఉంది. హుస్సేన్‌సాగర్ సెయిలింగ్‌కు అనువైన సరస్సు. మూడు బోట్స్‌తో గవర్నమెంట్ స్కూల్ పిల్లలకు శిక్షణ ఇవ్వటం మొదలుపెట్టింది యాచ్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్. నగరం నడిబొడ్డులో సెయిలింగ్, కయాకింగ్ లాంటిచక్కటి క్రీడలు నేర్చుకునే అవకాశముంది.

ఆసక్తి ఉన్న పిల్లలను ప్రోత్సహించడమే లక్ష్యంగా 2009లో సుహీం షేక్ ఆధ్వర్యంలో ప్రారంభమైన ఈ క్లబ్‌లో ఇప్పటికే 300 మందికిపైగా పిల్లలు సెయిలింగ్‌లో శిక్షణ పొందారు. అందులో 20 మంది క్లబ్ సెలెక్ట్ జాబితాలో ఉన్నారు. జాతీయస్థాయి టాప్‌టెన్‌లో ఈ క్లబ్‌వారు ఇద్దరున్నారు. హైదరాబాద్ యాచ్ క్లబ్ దేశంలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ యాచ్ క్లబ్
.

- ఓ మధు
 
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు, పేద పిల్లలతో పాటు ఢిల్లీ పబ్లిక్ స్కూల్, సిల్వర్ ఓక్స్, శ్రీనిధిలాంటి ప్రముఖ పాఠశాలల పిల్లలు కూడా ఇక్కడ శిక్షణ పొందుతున్నారు. కొన్ని కార్పొరేట్ సంస్థల భాగస్వామ్యంతో ఈ క్లబ్ ఎన్నో చారిటీ పనులు చేస్తోంది. ఎల్‌ఎస్‌ఎన్, నాందీ ఫౌండేషన్ల పిల్లలు శిక్షణ తీసుకుంటున్నారు. పేద విద్యార్థుల చదువు, అవసరాలకు కూడా సహాయం అందిస్తుంటారు. పోషకాహారం పంపిణీ చేస్తుంటారు. స్కూలుకు వెళ్లడానికి సైకిళ్లను సమకూరుస్తుంటారు.  రేసింగ్, రేసింగ్ టెక్నిక్స్ కూడా శిక్షణలో భాగమే.
 
ఈవెంట్స్...
* కయాకింగ్, మాన్‌సూన్ రిగెటా నిర్వహిస్తుంటాం.ముంబైలో వింటర్ రిగెటా చేస్తున్నాం.
* జాతీయ పోటీల్లో ఇక్కడ శిక్షణ తీసుకున్న పిల్లలు పాల్గొన్నారు.
* పతి ఏడాది మాన్‌సూన్ రెగెటా నిర్వహిస్తారు. దేశ వ్యాప్తంగా 50 మందికిపైగా క్రీడాకారులు ఈ ఈవెంట్‌లో పాల్గొంటారు.
* తెలంగాణ టూరిజంతో కలసి  కయాకింగ్ ఈవెంట్ నిర్వహించారు. ఇది ప్రతి ఏడాది నిర్వహించనున్నారు.

సిటీ కోసం ఏదైనా చేయాలని..
‘జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొన్నాను. 35 ఏళ్లుగా సెయిలింగ్ చేస్తున్నాను. రజత పతకం పొందాను. నేను సాఫ్టేవేర్ రంగంలో వున్నాను. నా సిటీ కోసం ఏదైనా చేయాలని అనుకున్నాను. గవర్నమెంటు స్కూల్ పిల్లలకు సెయిలింగ్‌లో ట్రెయినింగ్ మొదలు పెడదామనుకున్నాను. నగరంలో కొన్నిచోట్ల సెయిలింగ్ చేయటానికి అవకాశమున్నా, అందరికీ అనుమతి లేదు. అందుకే ఈ క్లబ్‌ని మూడు బోట్స్‌తో మొదలుపెట్టాం. ఈ రోజు 35 బోట్స్ ఉన్నాయి.

హుస్సేన్‌సాగర్ క్లీన్ లేక్‌గా మారితేసెయిలింగ్‌కి బెస్ట్ ప్లేస్ అవుతుందనటంలో డౌట్ లేదు. దుర్గం చెరువులో కూడా సెయిలింగ్ శిక్షణకు ఏర్పాట్లు చేయాలనుకున్నా ప్రస్తుతం ఆ చెరువు అనుకూలంగా లేదు. క్లబ్‌లో 100 మంది పిల్లలు సెయిలింగ్ చేస్తుంటే చూడాలన్నది నా కోరిక’ అంటారు సుహీం షేక్. క్లబ్ వివరాలకు -Yacht Club of Hyderabadఫేస్ బుక్ పేజ్‌ని చూడండి.
 
మా అబ్బాయి సిల్వర్ మెడలిస్ట్
మా బాబు రిషభ్ చెన్నై వెళ్లినప్పుడు ఈ సెయిలింగ్ గేమ్ చూశాడు. హైదరాబాద్ వచ్చాక ఇంటర్‌నెట్‌లో చూసి ఈ క్లబ్ గురించి తెలుసుకున్నాడు. నేల మీద ఆడే స్పోర్ట్స్‌కి, నీళ్ల మీద ఆడే ఆటలకి చాలా తేడా ఉంటుంది. అందరూ వీటిని చేయలేరు. ఈ విషయం ఇక్కడి సీనియర్ ట్రెయినర్ మనకు అర్థం అయ్యేలా చెప్తారు.  మా అబ్బాయి ట్రెయినింగ్ తీసుకొని చాలా జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొన్నాడు. ఈ మధ్య జరిగిన మాన్‌సూన్ జాతీయ పోటీల్లో సిల్వర్ మెడల్ గెలుచుకున్నాడు.
- షిరాణి నాయర్
 
సెయిలింగ్‌తో ఉల్లాసం

మా పిల్లలు జూహీ, తనిష్క్ అన్ని రకాల క్రీడలు నేర్చుకోవడానికి ప్రయత్నించారు. కానీ వాళ్లకు అన్నిటికంటే ఎక్కువ ఉల్లాసాన్ని, ఆసక్తిని కలిగించిన క్రీడ సెయిలింగ్. ట్రైనింగ్‌లో ప్రమాదాలకు తావు లేకుండా యాచ్ క్లబ్ హైదరాబాద్ వారు చాలా జాగ్రత్తలు తీసుకుని శిక్షణ ఇస్తున్నారు. అందుకే పిల్లలను ధైర్యంగా పంపగలుగుతున్నాం. ఇక ఇక్కడ అండర్ ప్రివిలేజ్‌డ్ పిల్లల కోసం ఈ క్లబ్ చేసే చారిటీ ఈవెంట్స్ మా లైఫ్‌లో కూడా భాగమయ్యాయి.
- జీనా దేశాయ్, పేరెంట్

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement