ఫేస్‌బుక్ యువత.. కేర్‌ఫుల్ | Youth has to be awarness on Facebook | Sakshi
Sakshi News home page

ఫేస్‌బుక్ యువత.. కేర్‌ఫుల్

Published Wed, Aug 6 2014 12:27 AM | Last Updated on Thu, Jul 26 2018 5:21 PM

ఫేస్‌బుక్ యువత.. కేర్‌ఫుల్ - Sakshi

ఫేస్‌బుక్ యువత.. కేర్‌ఫుల్

ఫేస్‌బుక్... యువ భావజాల సమ్మిళితానికి ఇదో వేదిక. ఆపదలో ఆత్మీయత పంచినా... అభిప్రాయాల వెల్లువలో అవధులు దాటినా అదో సామాజిక విప్లవమే. కాకపోతే మంచి పక్కనే నయవంచన ఉంటోంది. ఈ చెడు దారులే కట్టడికి కారణాలవుతున్నాయనేది హబ్సిగూడ విజ్ఞాన్ కాలేజీ విద్యార్థుల మనోభావం. ఫేస్‌బుక్‌పై సరదాగా సాగిన ఆ యువత మనోభావాలే ఈ వారం ‘క్యాంపస్ కబుర్లు’...
 
 పుష్ప: ఏయ్ ప్రవల్లిక... ఇందాకేంటి మీ సెక్షన్‌లో లెక్చరర్‌గారు ఏంటో క్లాస్ తీసుకుంటున్నారు?
 ప్రవల్లిక: ఎఫ్‌బీ తల్లీ! ఎవరిదో ఫొటో ఎవడో మార్ఫింగ్ చేశాడట. దాంతో సోమెనీ ప్రాబ్లమ్స్ వచ్చాయట. అమ్మాయిలంతా అలర్ట్‌గా ఉండమని చెబుతున్నారు.
 అఖిల: ఈ మగాళ్లంతా ఇంతే.
 ఫ్రెండ్‌షిప్‌గా చాట్ చేస్తే అడ్వాంటేజ్ తీసుకుంటారు. ఫేక్ ఐడీలు క్రియేట్ చెయ్యడం.. ఏడిపించడం మామూలైంది.
 వెంకటేష్: ఆగాగు... మగాళ్లంతా విలన్సేనా ఏంటి? మీ జాగ్రత్తలో మీరు ఉంటున్నారా?
ప్రవల్లిక: కాకపోతే ఏంటి? పిక్చర్స్‌ను మార్ఫింగ్ చేయడం లేదా? అబ్బా రోజూ చీటింగ్ వార్తలు ఎన్ని వస్తున్నాయి.
వెంకటేష్: ఛా... గర్ల్స్ చేయడం లేదా ఏంటి?  
ప్రవల్లిక: గర్ల్స్‌కేం అవసరం? ఎవరో ఒకళ్లు అలా చేస్తే..?
వెంకటేష్: ఇక్కడా అంతే.. ఎవడో ఒకడు మిస్‌యూజ్ చేస్తే టోటల్‌గా మగాళ్లదే తప్పంటే ఎలా? అలాంటప్పుడు ఎఫ్‌బీలోకి రాకండి. పిక్చర్స్ పెట్టకండి.
అఖిల: ఏదేమైనా... ఇలాంటి పనుల వల్ల పేరెంట్స్ కూడా రిస్ట్రిక్ట్ చేస్తున్నారు. ఎందుకమ్మా ఫేస్‌బుక్‌కే అతుక్కుంటావ్ అంటారు.
మధు: కరెక్ట్... ఫేస్‌బుక్ ప్రయోజనాలపై అవగాహన అవసరం. దానివల్ల ఎన్నో అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఎక్కడో నా ఎల్‌కేజీ ఫ్రెండ్ ఈ మధ్య ఎఫ్‌బీ వల్లే కలిశాడు.
సిమ్రాన్: మా పక్కన ఓ ఆంటీ... ఇంట్లో చేసే వంటకాలు ఎఫ్‌బీలోనే ప్రమోట్ చేసుకుంది. ఇప్పుడు ఫుల్ బిజీ. బిజినెస్ యాంగిల్‌లో మోర్ యూజ్‌ఫుల్.
ప్రవల్లిక: ఎస్... ఎస్... అమెరికాలో ఉన్న రిలెటివ్స్‌ను రోజూ విష్ చేస్తున్నాం. ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నాం. మా పేరెంట్స్ కూడా హ్యాపీగా ఫీలవుతున్నారు.
హబీబ్ సిమ్రాన్: కొన్ని సమస్యలున్న మాట నిజమే కానీ... ఉపయోగాలూ ఎక్కువే. కాకపోతే ప్రాబ్లమ్స్ వల్ల పేరెంట్స్ కొంత అబ్జెక్ట్ చేస్తున్నారు.
మధు: ఆ ప్రాబ్లమ్స్ ధైర్యంగా బయటకు ఎందుకు చెప్పరు? ప్రతిదానికి నిందలేసి ఊరుకోవడం కాదు. వెంకటేష్: అందుకే జాగ్రత్తలు తీసుకోవాలంటున్నా. అన్‌నోన్ ఐడీని ఎందుకు యాక్సెప్ట్ చేయాలి?
అఖిల: అలా నెగెటివ్‌గా ఆలోచించి వెళ్లాలంటే ఎలా వీలవుతుంది! నువ్వు అన్నది నిజమే కావచ్చు.
రిక్వెస్ట్ పంపే వ్యక్తి మంచోడని అనుకుంటాం. మధు: పరిమితులు దాటినప్పుడే సమస్యలొస్తున్నాయి. పేపర్లలో వచ్చే వార్తలు క్లియర్‌గా చదవండి. ఎక్కడో అమ్మాయిలూ రాంగ్‌రూట్‌లో వెళ్తున్నారు. బహుశా అవగాహన లోపం కావచ్చు.
సృజన: ఈ మధ్య ఓ వార్త చదివా. ప్రమాద సమయాల్లో రక్తం కావాల్సి వస్తే మెయిన్‌గా సోషల్ మీడియాపైనే డిపెండ్ అవుతున్నారట. వుంచి రెస్పాన్స్ కూడా వస్తోందట.
పుష్ప: ఫేస్‌బుక్‌లో మెజారిటీ యూత్ ఉంటున్నారు. వాళ్లతో పాటు డిఫరెంట్ ఫీల్డ్స్‌లో ఉన్న ఎక్స్‌పర్ట్స్‌తోనూ లింక్ అవ్వాలి. దీనివల్ల మనకు నాలెడ్జ్ పెరుగుతుంది.
వెంకటేష్: యుూ ఆర్ రైట్. మిస్‌యూజ్ చేసేవాళ్లపై నిఘా కూడా అవసరం.  
అఖిల: అవును. తల్లిదండ్రులకు దీనిపై అవగాహన కల్పించాలి. కాలేజీ యాజమాన్యాలు కూడా ‘మీ అమ్మాయిని ఫేస్‌బుక్‌కు దూరంగా ఉంచండి’ అని చెబుతున్నారే తప్ప... ఎందుకో వివరించడం లేదు.
ప్రవల్లిక: ఎనీ హౌ... లెక్చరర్స్ ఏం చెప్పినా... అమ్మానాన్నా ఎంత కట్టడి చేసినా... ఫేస్‌బుక్ యూజ్‌ఫుల్. కాకపోతే కొన్ని ఇబ్బందుల నుంచి అంతా అప్రమత్తంగా ఉండాల్సిందే.
-  వనం దుర్గాప్రసాద్  

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement