Social Revolution
-
సామాజిక విప్లవానికి నాంది కులగణన
గెలిచే అవకాశాలున్న పార్టీలో ఎన్నికల ముందు ఎక్కువ సీట్లు అడగడానికీ, గెలిచిన పార్టీలో ఎన్నికల తరువాత ఎక్కువ పదవులు కోరడానికీ రాజకీయ నాయకులు కులం కార్డును వాడడం సహజం. ఇలాంటి సందర్భాల్లో ప్రతీ కులం తన జనాభా సంఖ్యనూ, శాతాన్ని పెంచి చెపుతుంటుంది. ఈ శాతాల న్నింటినీ కూడితే సులువుగా 300 దాటు తుంది! ఎన్నికల సంవత్సరంలో కులగణన చర్చ మరింత వేడెక్కుతోంది. సమాజంలో విభిన్న సమూహాల మధ్య సంబంధాలను నిర్ణయించడంలో వేల సంవత్సరాలుగా కులం ప్రధాన పాత్ర పోషిస్తున్న దేశం మనది. ప్రతి కులానికి ప్రత్యేకమైన చరిత్ర, సంస్కృతి ఉంటుంది. మన దేశంలో 5 వేలకు మించి కులాలున్నాయని అంచనా. కులాలతోనే మన దేశంలో సామాజిక అంతస్తుల దొంతర ఏర్పడుతోంది. వీటిని అర్థం చేసుకోవడానికి కులగణన ఒక చారిత్రక అవసరంగా మారింది. సామా జిక విప్లవానికి కులగణన నాంది పలుకుతుంది. ఎస్సీ, ఎస్టీలకు రాజ్యాంగంలోనే విద్యా, ఉపాధి రిజర్వేషన్లు కల్పించారు. సామాజిక వివక్షకు గురవుతూ, విద్యారంగంలో అవకాశాలు కోల్పోతున్న సమూహాల కోసం ఉద్దీపన చర్యలు చేపట్టడంలో చాలా తాత్సారం జరిగింది. 1979 జనవరి 1న ప్రధాని మొరార్జీ దేశాయి ప్రభుత్వ ఉద్యోగాల్లో ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించడానికి ‘సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్ వర్డ్ క్లాసెస్ కమిషన్’ను నియమించారు. స్వల్ప కాలం బిహార్ ముఖ్యమంత్రిగా పనిచేసిన బిందేశ్వరీ ప్రసాద్ మండల్‌ను చైర్మన్‌గా నియమించడంతో దానికి ‘మండల్ కమిషన్’ అనే పేరు వచ్చింది. రెండేళ్ళ పరిశీలన తరువాత 1980 డిసెంబరు 31న అప్పటి ప్రధాని ఇందిరాగాంధీకి బీపీ మండల్ తన నివేదికను సమ ర్పిస్తూ ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్లు కల్పించాలని సిఫార్సు చేశారు. ఇక్కడ ఒక విచిత్రం వుంది. మండల్ కమిషన్ ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్ ఇమ్మందిగానీ, కులగణన నిర్వహించమనలేదు. బ్రిటిష్ కాలపు రికార్డుల ప్రకారం దేశంలో బీసీల జనాభా 54 శాతం ఉంటుందని అంచనా వేసి అందులో 50 శాతం అనగా 27 శాతం రిజర్వేషన్లు కల్పించాలని సిఫార్సు చేసింది. ఓబీసీ రిజర్వేషన్ల కేసు మీద అంతిమ తీర్పు రాకముందే 1990 ఆగస్టు 7న అప్పటి ప్రధాని వీపీ సింగ్ మండల్ కమిషన్ సిఫార్సుల్లో కొన్నింటిని అమలుపరచ బోతున్నట్టు ప్రకటించారు. అప్పటి రాజకీయ పరిస్థితుల్లో ఇది చాలా సాహసోపేతమైన నిర్ణయం. జనతాదళ్ నాయ కుడైన వీపీ సింగ్‌కు లోక్ సభలో మెజారిటీ లేదు. ఎన్టీ రామారావు నాయకత్వంలోని నేషనల్ ఫ్రంట్ అభ్యర్థిగా రంగంలో దిగి, బయటి నుండి బీజేపీ ఇచ్చిన మద్దతుతో ఆయన ‘మైనారిటీ ప్రభుత్వానికి’ ప్రధాని అయ్యారు. అప్పట్లో బీజేపీకి లోక్ సభలో 85 సీట్లున్నాయి. ఓబీసీలకు రిజర్వే షన్లు కల్పిస్తే తన ఓటు బ్యాంకు అయిన ఓసీలు పార్టీకి దూరం అయి పోతారని ఆ పార్టీ భయపడింది. అప్పటి బీజేపీ అధ్యక్షులు ఎల్కే అడ్వాణి 1990 సెప్టెంబరు 25న సోమనాథ్ నుండి అయోధ్య వరకు 35 రోజుల ‘రామ్ రథయాత్ర’ మొదలెట్టారు. దీనికి రెండు లక్ష్యాలు న్నాయి. మొదటిది; మండల్ కమిషన్ సిఫార్సుల అమలును అడ్డుకోవ డానికి ఏకంగా వీపీ సింగ్ ప్రభుత్వాన్ని పడగొట్టడం. రెండోది, ముస్లింల మీద ద్వేషాన్ని రెచ్చగొట్టి హిందూ ఓటు బ్యాంకును సమీకరించడం. ఈ రెండు లక్ష్యాల రథయాత్రను రాజకీయ విశ్లేషకులు ‘మండల్–కమండల్’ అని పిలిచేవారు. బీజేపీ తన మద్దతును ఉపసంహరించుకోవడంతో 1990 నవంబరు 7న వీపీ సింగ్ ప్రభుత్వం పడిపోయింది. రెండేళ్ల తరువాత 1992 నవంబరు 16న ‘ఇంద్ర సహానీ కేసు’లో సుప్రీం కోర్టు ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్లను ఆమోదిస్తూ తుది తీర్పు ఇచ్చింది. అయితే, మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించ రాదనీ, క్రీమీలేయర్ కుటుంబాలను రిజర్వేషన్ పరిధి నుండి తప్పించా లనీ కొత్తగా రెండు నిబంధనలు పెట్టింది. సుప్రీం కోర్టు తీర్పు వచ్చిన పక్షం రోజుల్లోనే కరసేవకులు బాబ్రీ మసీదును కూల్చి వేశారు. బ్రిటిష్ పాలకులు భారత దేశాన్ని పరిపాలించాలంటే ఇక్కడి సమాజ స్వభావాన్ని, ముఖ్యంగా కుల, మత స్వభావాలను క్షుణ్ణంగా అర్థం చేసుకోవాల్సిన అవసరముందని గుర్తించారు. 1881లో తొలి సారిగా జనగణన నిర్వహించారు. ఆ మరు సంవత్సరం అంటే 1882లో విలియం విల్సన్ హంటర్ నాయకత్వాన ఏర్పడిన కమిషన్ దేశంలో కులగణన నిర్వహించింది. అప్పటి నుండి ప్రతి పదేళ్ళకు ఒకసారి జనగణన కార్యక్రమం క్రమం తప్పకుండ సాగుతోంది. కానీ, కులగణన జరగలేదు. స్వతంత్ర భారత దేశంలో తొలిసారిగా కులగణన చేపట్టిన ఘనత బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌కు దక్కుతుంది. దేశంలో అంతటి చొరవను చూపిన మరో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమే. బిహార్‌లో 214 కులాలున్నట్టు తేలింది. అయితే, ఆంధ్రప్రదేశ్‌లో 7 వందలకు పైగా కులాలున్నట్టు అంచనా. ఆ లెక్కన ఏపీ కులగణన ప్రాజెక్టు బిహార్ కన్నా మూడు నాలుగు రెట్లు పెద్దది. రెండేళ్ళ క్రితం బిహార్ రాష్ట్ర అఖిలపక్షం ఢిల్లీ వెళ్ళి కులగణన చేపట్టాలని ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్‌షాలను కోరింది. దానికి వాళ్ళు అంగీకరించలేదు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ ఎస్సీ, ఎస్టీ మినహా మరెవ్వరికీ కులగణన నిర్వహించడం తమ విధానం కాదని 2021 జులై 20న పార్లమెంటులో ఒక విస్పష్ట ప్రకటన చేశారు. బీజేపీది ఒక విచిత్రమైన వ్యవహారం. ఒకవైపు, ఉచితాలు దేశఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తాయి అంటుంది; ఎన్నికల ప్రచారంలో తామర తంపరగా ఉచితాలను ప్రకటిస్తుంది. ఒకవైపు, కులం వంటి సంకుచిత భావాలకు తాము దూరం అంటుంది. ఎన్నికలకు ముందు కుల సమ్మేళ నాలు నిర్వహిస్తుంది. ఈ ఏడాది మొదట్లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీజేపీ నిర్వహించిన కుల సమ్మేళనాలను చూశాం. ఇప్పుడు ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో మళ్ళీ అలాంటివే చూస్తున్నాం. ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ లో ‘బీసీ సమ్మేళనం’లో పాల్గొన్నారు; నాలుగు రోజుల్లో మళ్ళీ వచ్చి ‘మాదిగ సమ్మేళనం’లో పాల్గొన్నారు. కానీ, విధాన పరంగా వారు కులగణనకు వ్యతిరేకం. నిజానికి సామాజిక న్యాయానికి కులగణన ఒక ప్రాతిపదిక అవుతుంది. సంక్షేమ పథకాలను అడగడానికి ప్రజలకూ, వాటిని రూపొందించడానికి ప్రభుత్వాలకూ అది ఆధారంగా మారుతుంది. ఇప్పుడు కుల గణన ‘ఇండియా కూటమి’కి కొత్త అస్త్రంగా మారింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధి ప్రతి సభలోనూ ‘జిత్నీ ఆబాదీ; ఉత్నా హక్’, ‘జిస్కి జిత్ని భాగేదారీ; ఉస్కీ ఉత్నీ హిస్సేదారీ’ (ఎంత జనాభో అంత హక్కు) అంటున్నారు. ఏపీలో తలపెట్టనున్న కులగణన విజయవంతం కావడం రాజకీయంగా వైసీపీ కన్నా సమాజానికి మరింత మేలు చేస్తుంది. - డానీ వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు -
సామాజిక మహా విప్లవం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సరికొత్త సామాజిక మహా విప్లవం ఆవిష్కృతమయ్యింది. తొలిసారిగా 2019 నాటి కేబినెట్ కూర్పులో మొత్తం 25కు గాను బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకే 14 మంత్రి పదవులిచ్చి వారిని మెజారిటీ వర్గంగా కూర్చోబెట్టిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి... ఇప్పుడు మరో అడుగు ముందుకేశారు. సామాజిక న్యాయాన్ని స్వయంగా ఆచరించి చూపిస్తూ... తాజా పునర్వ్యవస్థీకరణలో ఏకంగా ఆ సంఖ్యను 17కు పెంచారు. దీంతో సోమవారంనాడు కొలువు దీరనున్న కొత్త కేబినెట్లో బలహీనవర్గాలకు చెందిన మంత్రుల సంఖ్య 70 శాతానికి చేరుతోంది. ఇక ఆది నుంచి బీసీలంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదు... సొసైటీకి బ్యాక్ బోన్ (వెన్నెముక) క్లాస్ అని చెబుతున్న సీఎం... వారికి దీనిలో 10 బెర్తులు కేటాయించి కొత్త చరిత్రను ఆరంభించారు. అనుభవం, సామాజిక కూర్పు, జిల్లాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఇదివరకటి కేబినెట్లో ఉన్న 11 మందిని కొనసాగించాలని జగన్ నిర్ణయించారు. కాకపోతే అందులోనూ ఇద్దరు ఓసీలు కాగా, మిగిలిన వారంతా బీసీ, ఎస్సీ, ఎస్టీ, బలహీనవర్గాలకు చెందిన వారు కావటం గమనార్హం. మహిళలకు సైతం సముచిత ప్రాధాన్యం కల్పిస్తూ... ఇప్పటిదాకా ముగ్గురే ఉండగా ఇపుడా సంఖ్యను నాలుగుకు పెంచారు. అగ్రకులాల నుంచి నలుగురు కాపు, నలుగురు రెడ్డి కులస్తులకు మాత్రం కేబినెట్లో స్థానం కల్పించి... కొడాలి నానికి (కమ్మ) రాష్ట్ర అభివృద్ధి మండలి ఛైర్మన్‌గా, విజయనగరానికి చెందిన కోలగట్ల వీరభద్రస్వామికి (వైశ్య) డెప్యూటీ స్పీకర్‌గా, ముదునూరి ప్రసాదరాజుకు (క్షత్రియ) చీఫ్ విప్‌గా, మల్లాది విష్ణుకు (బ్రాహ్మణ) రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడుగా అవకాశం కల్పించాలని నిర్ణయించారు. తెలుగుదేశానికి పూర్తి భిన్నంగా... టీడీపీకి బీసీలే వెన్నుముక.. బీసీలు లేనిదే టీడీపీ లేదంటూ ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ఎప్పుడూ చెబుతారు తప్ప నిజంగా బీసీలకు చేసిందేమీ లేదని తాజా పునర్వ్యవస్థీకరణ సందర్భంగా పలువురు సామాజికవేత్తలు పేర్కొంటున్నారు. గతంలో బాబు హయాంలో ఎప్పుడూ మెజారిటీ మంత్రివర్గ స్థానాలు అగ్రకులాలకే కేటాయించేవారని, సగానికన్నా ఎక్కువ స్థానాలను బలహీనవర్గాలకు కేటాయించిన పరిస్థితి టీడీపీ చరిత్రలో ఎప్పుడూ లేదని వారు గుర్తుచేస్తున్నారు. గతంలో 2017లో తన కుమారుడు లోకేష్ కోసం మంత్రివర్గాన్ని విస్తరించిన చంద్రబాబునాయుడు... 25 మంది మంత్రుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల సంఖ్యను 10కే పరిమితం చేశారని,, ఎస్టీ, మైనారిటీ వర్గాల నుంచి ఒక్కరంటే ఒక్కరికి కూడా అవకాశం ఇవ్వలేదని... ఎన్నికలకు కేవలం నాలుగు నెలల ముందు ఆయా వర్గాల నుంచి ఓట్ల కోసం ఒక్కొక్కరికి హడావుడిగా స్థానమిచ్చి నాటకమాడారని వారు గుర్తు చేస్తున్నారు. సామాజిక న్యాయానికి అటు చంద్రబాబు ... ఇటు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఇస్తున్న ప్రాధాన్యం చూస్తుంటే నక్కకు, నాకలోకానికి ఉన్నంత తేడా కనిపిస్తోందని చెబుతున్నారు. ఇదీ... వైఎస్సార్ సీపీ సామాజిక న్యాయం ► రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల ఆదరణ, ఆశీస్సులు, మద్దతుతో 2019 ఎన్నికల్లో 50 శాతానికిపైగా ఓట్లు.. 151 శాసనసభ స్థానాలు, 22 లోక్‌సభ స్థానాలతో వైఎస్సార్సీపీ ఆఖండ విజయం సాధించింది. 2019 మే 30న ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేశారు. ► 2019 జూన్ 8న 25 మందితో మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారు. 14 మంది (56 శాతం) ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు మంత్రివర్గంలో స్థానం కల్పించడం ద్వారా సామాజిక, రాజకీయ విప్లవానికి సీఎం వైఎస్ జగన్ శ్రీకారం చుట్టారు. ఓసీ వర్గాల నుంచి 11 మందికి (44 శాతం) మంత్రి పదవులు ఇచ్చారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ ఇంత భారీ ఎత్తున ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు మంత్రి పదవులు ఇచ్చిన దాఖలాలు లేవు. ► ఐదుగురికి ఉప ముఖ్యమంత్రులు ఇస్తే.. అందులో నాలుగు పదవులను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకే కట్టబెట్టారు. తద్వారా సామాజిక న్యాయమంటే ఇదీ అని దేశానికి సీఎం వైఎస్ జగన్ చాటి చెప్పారని రాజకీయ పరిశీలకులు అప్పట్లో ప్రశంసించారు. ► శాసనసభ స్పీకర్‌గా బీసీ వర్గానికి చెందిన తమ్మినేని సీతారాంను నియమించారు. రాష్ట్ర శాసన మండలి చరిత్రలో తొలి సారిగా చైర్మన్‌గా ఎస్సీ వర్గానికి చెందిన మోషేన్ రాజు, డిప్యూటీ చైర్‌పర్సన్‌గా మైనార్టీ వర్గానికి చెందిన మహిళ జకియా ఖానంను నియమించారు. ► శాసన మండలిలో వైఎస్సార్సీపీకి 32 మంది సభ్యులు ఉంటే.. అందులో 18 మంది (56.25) ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారికే అవకాశం కల్పించారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక రాజ్యసభలో వైఎస్సార్సీపీకి నాలుగు స్థానాలు దక్కితే.. అందులో రెండింటిని బీసీ సామాజిక వర్గానికి చెందిన వారికే కేటాయించారు. కార్పొరేషన్, పరిషత్ ఎన్నికల్లోనూ.. ► జిల్లా పరిషత్ ఎన్నికల్లో 13 జిల్లా పరిషత్‌లను వెఎస్సార్సీపీ చేజిక్కించుకుంది. అందులో తొమ్మిది పదవులను (70 శాతం) ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే కేటాయించారు. మండల పరిషత్ ఎన్నికల్లో.. 648 మండలాలకు గాను వైఎస్సార్సీపీ 635 మండల పరిషత్ అధ్యక్ష పదవులను దక్కించుకుంటే.. అందులో ఈ వర్గాలకు 67 శాతం పదవులు కేటాయించారు. ► 13 కార్పొరేషన్లలో వైఎస్సార్సీపీ క్లీన్ స్వీప్ చేసింది. ఏడు చోట్ల మేయర్ పదవులు బీసీలకు ఇచ్చారు. మొత్తంగా మేయర్ పదవుల్లో 92 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారికే ఇచ్చారు. 87 మున్సిపాల్టీల్లో 84 మున్సిపాల్టీలను వైఎస్సార్సీపీ చేజిక్కించుకుంటే.. వాటి చైర్పర్సన్ పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 73 శాతం ఇచ్చారు. ► నామినేటెడ్ పదవుల్లో.. నామినేటెడ్ పనుల్లో 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే రిజర్వేషన్ కల్పిస్తూ చట్టం చేసి, అమలు చేసిన తొలి ప్రభుత్వం వైఎస్సార్సీపీ సర్కారే. అందులోనూ 50 శాతం మహిళలకు రిజర్వేషన్ కల్పించిన మొదటి ప్రభుత్వం వైఎస్ జగన్ సర్కారే. ► రాష్ట్రంలో 196 వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ(ఏఎంసీ) చైర్మన్ పదవుల్లో 76 అంటే 39 శాతం బీసీలకు ఇచ్చారు. మొత్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 60 శాతం పదవులు ఇచ్చారు. ► వివిధ ప్రభుత్వ కార్పొరేషన్లలో 137 చైర్మన్ పదవుల్లో 53 (39 శాతం) బీసీలకు ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు మొత్తం 58 శాతం పదవులు ఇచ్చారు. బీసీలకు ప్రత్యేకంగా 56 కార్పొరేషన్లు, ఎస్సీలకు మూడు కార్పొరేషన్లు, ఎస్టీలకు ఒక కార్పొరేషన్ ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ► 137 కార్పొరేషన్లకు సంబంధించి మొత్తం 484 డైరెక్టర్ పదవుల్లో 201 బీసీలకు (42 శాతం) ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు మొత్తం 58 శాతం డైరెక్టర్ పదవులు ఇచ్చారు. 56 ప్రత్యేక బీసీ కార్పొరేషన్లు, మూడు ఎస్సీ కార్పొరేషన్లు, ఒక ఎస్టీ కార్పొరేషన్లలో 684 డైరెక్టర్ పదవులన్నీ ఆ వర్గాల వారికే ఇచ్చారు. విప్లవాత్మక నిర్ణయాల అమల్లో మరింత ముందుకు.. ► సామాజిక న్యాయ సాధనలో దేశంలో ఎక్కడా లేని రీతిలో రాష్ట్రంలో సీఎం వైఎస్ తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలను మరింత ముందుకు తీసుకెళ్లేలా మంత్రివర్గాన్ని పునర్ వ్యవస్థీకరించారు. ► 25 మందితో కూడిన మంత్రివర్గంలో ఓసీ వర్గాలకు చెందిన ఎనిమిది మందికి.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన 17 మందికి చోటు కల్పించారు. ఇందులో పది మంది బీసీలు, ఐదుగురు ఎస్సీలు.. ఎస్టీ, మైనార్టీ వర్గాల నుంచి ఒక్కొక్కరు ఉన్నారు. అంటే మంత్రివర్గంలో ఏకంగా 70 శాతం పదవులను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకే ఇచ్చారు. సామాజిక న్యాయంలో ఇది మహా విప్లవంగా రాజకీయ పరిశీలకులు, సామాజికవేత్తలు అభివర్ణిస్తున్నారు. ► 2019 జూన్ 8న ఏర్పాటు చేసిన మంత్రివర్గంలో మహిళలకు మూడు మంత్రి పదవులు ఇస్తే.. పునర్ వ్యవస్థీకరణలో నలుగురికి మంత్రి పదవులను ఇవ్వడం ద్వారా మహిళా సాధికారతకు తాను ఇస్తున్న ప్రాధాన్యతను చాటి చెప్పారు. చంద్రబాబు సామాజిక మోసం ► విభజన నేపథ్యంలో బీజేపీ, జనసేనతో జట్టుకట్టిన టీడీపీ.. కేవలం ఐదు లక్షల ఓట్ల తేడాతో అధికారాన్ని దక్కించుకుంది. 2014 జూన్ 8న 19 మందితో ఏర్పాటు చేసిన మంత్రివర్గంలో ఓసీలకు 11 మంది (58 శాతం)కి.. ఆరుగురు బీసీలకు, ఇద్దరు ఎస్సీలకు.. వెరసి బీసీ, ఎస్సీలకు 42 శాతం మందికి చోటు కల్పించిన చంద్రబాబు సామాజిక న్యాయాన్ని తుంగలో తొక్కారు. ► కొడుకు నారా లోకేష్‌ను మంత్రివర్గంలోకి తీసుకోవడానికి ఎమ్మెల్యేల కోటాలో శాసనమండలి సభ్యున్ని చేసిన చంద్రబాబు.. 2017 ఏప్రిల్ 2న తొలిసారి మంత్రివర్గాన్ని విస్తరించారు. 25 మందితో ఏర్పాటు చేసిన ఆ మంత్రివర్గంలో ఏకంగా 15 మంది ఓసీల(60 శాతం)కు పదవులు ఇచ్చారు. కేవలం ఎనిమిది పదవులు బీసీలకు, రెండు పదవులు ఎస్సీలకు ఇచ్చారు. అంటే బీసీ, ఎస్సీలకు మంత్రివర్గంలో కేవలం 40 శాతం పదవులే ఇచ్చారు. ► బీజేపీ మంత్రులు కామినేని శ్రీనివాస్, పైడికొండల మాణిక్యాలరావు రాజీనామా చేయడంతో ఎన్నికలకు కేవలం నాలుగు నెలల ముందు 2018 నవంబర్ 11న రెండోసారి మంత్రివర్గాన్ని విస్తరించారు. కనీసం ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీ కాని వ్యక్తికి.. ఆ పదవికి ఎన్నికయ్యేందుకు తగిన సమయం లేకున్నా ఓట్ల కోసం గిరిజన వర్గానికి చెందిన కిడారి శ్రావణ్‌కుమార్‌కు మంత్రివర్గంలో చోటు కల్పించడం చంద్రబాబు సామాజిక మోసానికి నిలువెత్తు నిదర్శనం. ► మైనార్టీ వర్గానికి చెందిన మహ్మద్ ఫరూక్‌కు అదే సమయంలో మంత్రివర్గంలో చోటు కల్పించారు. చివరి సారిగా మంత్రివర్గ విస్తరణను కలుపుకున్నా.. 13 మంది ఓసీలకు.. 12 మంది ఇతర వర్గాలకు పదవులు కేటాయించి సామాజిక న్యాయాన్ని అపహాస్యం చేశారు. -
ఏపీ: సరికొత్త రాజకీయ చరిత్ర
సాక్షి, అమరావతి: పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం అసెంబ్లీ నియోజకవర్గం సీతారామపురం సౌత్ గ్రామంలోకి వెళ్లి పెండ్ర వీరన్న ఉండేది ఎక్కడా? అని ఎవరైనా అడితే శివారున పూరిల్లు (తాటాకు గుడిసె) చూపిస్తారు. ఇందేంటి కార్పొరేషన్ చైర్మన్ తాటాకు ఇంట్లో అని ఆశ్చర్యపోవడం మనవంతు అవుతుంది. అదే విషయాన్ని ఆయన్ను ప్రశ్నిస్తే.. ఇది వైఎస్ జగనన్న తీసుకొచ్చిన సామాజికవ విప్లవం అని గర్వంగా చెబుతున్నాడు. అత్యంత వెనుకబడిన వర్గాలైన సంచార జాతులకు చెందిన మందుల (బీసీ–ఎ) కులంలో పుట్టిన తాను పూరి పాకలో నివాసం ఉంటూ కుటుంబాన్ని పోషించుకోవడమే కష్టమైన జీవనం గడిపేవాడు వీరన్న. పదో తరగతి మాత్రమే చదవినప్పటికీ సామాజిక చైతన్యం అలవర్చుకుని తమ జాతి మెరుగైన జీవనం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టాడు. దుర్భరమైన జీవనం గడిపే మందుల కులస్తులను ఎస్టీ జాబితాలో చేర్చాలనే పోరాటానికి నాయకత్వం వహించేలా 2011 డిసెంబర్ 12న మందుల కులస్తుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. తమ లాంటి వారి బతుకుల్లో వెలుగు నింపుతారనే ఆశయంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన పాదయాత్రలో కలిసి తమ జాతి సమస్యలను వివరించానని ఆయన గుర్తు చేశారు. ఇచ్చిన మాట ప్రకారం వైఎస్ జగన్ తనను అత్యంత వెనుకబడిన వర్గాల (సంచార జాతులు)కు కార్పొరేషన్ చైర్మన్ చేశారని గర్వంగా చెప్పారు. పూరి గడిసెలో జీవనం సాగిస్తూ అట్టడుగు వర్గాల కష్టాలను స్వయంగా చూసిన తాను అయితేనే అత్యంత వెనుకబడిన వర్గాలకు అండదండగా ఉంటాననే నమ్మకంతో వైఎస్ జగన్ ఈ పదవి ఇచ్చారని, తనకే కాదు.. ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా వెనుకబడిన అనేక మందిని గుర్తించి ముఖ్యమంత్రి జగన్ అవకాశం కల్పించి సామాజిక విప్లవానికి నాంది పలికారని పెండ్ర వీరన్న గర్వంగా చెబుతున్నారు. సామాజిక చైతన్య వీచికలుగా బీసీ కార్పొరేషన్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కొత్త చరిత్రను సృష్టిస్తూ రాష్ట్రంలో 139 బీసీ కులాలకు గతేడాది అక్టోబర్‌లో 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. వాటిలో చాలా కులాల పేర్లు చాలా మందికి తెలియదు. చాలా కులాలకు ఇంతకు ముందెన్నడూ ఇలాంటి గుర్తింపే లేదు. అటువంటిది వాటికి ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వాటికి ఒక చైర్మన్, 12 మంది డైరెక్టర్లను నియమించి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు ప్రాధాన్యత ఇవ్వడం ఒక రికార్డు. దాదాపు 56 కార్పొరేషన్ ఛైర్మన్లు, 672 డైరెక్టర్ పదవుల్లో 50 శాతం మహిళలకే కట్టబెట్టి మరో రికార్డును నెలకొల్పడం విశేషం. చదవండి: ట్విట్టర్ ట్రెండింగ్‌లో సీఎం జగన్ రెండేళ్ల పాలన సేవలన్నీ అక్కడే... ఊరికో ఆలయం -
ఏపీలో నవ చరిత్రకు శ్రీకారం
రాష్ట్రంలో అతి పెద్ద సామాజిక మార్పునకు ఊతమిచ్చే చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇదివరకెన్నడూ లేని రీతిలో స్థానికులకు ఉపాధి కల్పించే కీలక నిర్ణయాలకు నాంది పలికింది. చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో పరిశ్రమల్లో స్థానికులకు 75 శాతం రిజర్వేషన్ కల్పించడానికి అడుగు ముందుకు వేసింది. అసాధ్యం అనుకున్న పనులను సుసాధ్యం చేస్తూ కొత్త చరిత్ర సృష్టించింది. నిరుద్యోగ యువతకు భవిష్యత్‌పై భరోసా కల్పిస్తూ, మహిళల చిరకాల కోరిక నెరవేరుస్తూ నవ సమాజ నిర్మాణానికి అంకురార్పణ గావించింది. రాష్ట్రంలో పరిశ్రమలు, కర్మాగారాలలో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇచ్చేలా, దశల వారీగా మద్య నిషేధం దిశగా మద్య నియంత్రణ చట్టాన్ని సవరించేలా ప్రవేశ పెట్టిన కీలక బిల్లులను బుధవారం సభ్యుల హర్షధ్వానాల నడుమ శాసనసభ ఆమోదించింది. దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు రూపొందిన ఈ బిల్లులు నిరుద్యోగులు, మహిళల పాలిట వరం అని ఈ సందర్భంగా పలువురు శాసనసభ్యులు కొనియాడారు. పేదలు, మహిళల జీవితాల్లో కొత్త వెలుగులు నింపిన సంఘ సంస్కర్తగా చరిత్రలో నిలిచిపోతారని ప్రశంసించారు. సాక్షి, అమరావతి : రాష్ట్రంలో పరిశ్రమలు, కర్మాగారాలలో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇచ్చేందుకు ఉద్దేశించిన చరిత్రాత్మక బిల్లును బుధవారం రాష్ట్ర శాసనసభ ఆమోదించింది. దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశం మేరకు రూపొందించిన ఈ బిల్లు నిరుద్యోగుల పాలిట వరం అని పలువురు శాసనసభ్యులు అభివర్ణించారు. ఏపీ పరిశ్రమలు, కర్మాగారాలలో స్థానిక అభ్యర్థులకు ఉపాధి బిల్లు–2019ను శాసనసభ సుదీర్ఘంగా చర్చించి ఆమోదం తెలిపింది. దీంతో స్థానికులు పొట్ట చేత పట్టుకుని వలసలు పోవాల్సిన అవసరం ఉండదని శాసనసభ్యులు అభిప్రాయపడ్డారు. ఈ బిల్లుపై చర్చకు ప్రతిపాదిస్తూ రాష్ట్ర కార్మిక, ఉపాధి, కర్మాగారాల శాఖ మంత్రి జి.జయరాం మాట్లాడారు. ‘అందరి తల రాతను బ్రహ్మదేవుడు రాస్తాడని విశ్వసిస్తుంటారు. అందరి సంగతేమో గానీ మా తలరాత రాసింది మాత్రం వైఎస్ జగన్మోహనుడు’ అని అన్నారు. ఎస్సీలకు అంబేడ్కర్‌లా, వాల్మీకులకు వాల్మీకి మహర్షిలా, క్రైస్తవులకు ఏసుక్రీస్తులా, ముస్లింలకు అల్లా లాగా, అందరి దేవుడు షిర్డీ సాయిలాగా సమాజంలోని అన్ని వర్గాలకు వైఎస్ జగన్మోహన్రెడ్డి దేవుడని అభివర్ణించారు. ఈ సందర్భంగా జగన్ వినమ్రంగా నమస్కరిస్తూ బిల్లుపై మాట్లాడాల్సిందిగా సంజ్ఞలు చేశారు. బాబు వంచిస్తే.. జగన్ ఆదుకున్నారు గత ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్యోగం అని చెప్పి అందర్నీ వంచించారని మంత్రి జయరాం అన్నారు. చంద్రబాబుకు, జగన్‌కు.. నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందన్నారు. ప్రస్తుత బిల్లు ప్రకారం స్థానిక పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని, ఇదో చారిత్రక నిర్ణయమని వివరించారు. నైపుణ్యం, అర్హత లేదన్న సాకుతో పరిశ్రమల యజమానులు స్థానికులను తిరస్కరించే వీలు లేదని, నైపుణ్యం లేకపోతే శిక్షణ ఇచ్చి ఉద్యోగాల్లోకి తీసుకోవాలన్నారు. మిగతా 25 శాతం ఉద్యోగాలలో యాజమాన్యాలు ఇష్టం వచ్చిన వారిని నియమించుకునే స్వేచ్ఛ ఉంటుందని చెప్పారు. పి.రవీంద్రనాథ్‌రెడ్డి మాట్లాడుతూ ప్రపంచంలో ఎక్కడా ఇటువంటి బిల్లును తీసుకువచ్చిన చరిత్ర లేదన్నారు. ఈ బిల్లు చట్టమైతే అనేక ప్రాంతాలలో పరిశ్రమలు వస్తాయన్న ఆశాభావం వ్యక్తం చేశారు. నైపుణ్యం లేని వారికి మూడేళ్ల కాలంలో శిక్షణ ఇవ్వొచ్చన్నారు. స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వడం వల్ల పరిశ్రమల యాజమాన్యాలకు చాలా ఖర్చులు తగ్గుతాయన్నారు. మధ్యప్రదేశ్‌లోని పరిశ్రమల్లో స్థానికులకు 70 శాతం ఉద్యోగాలు ఇచ్చే వెసులుబాటు ఉందని, దాన్ని మించి ఆంధ్రప్రదేశ్‌లో అవకాశం కల్పిస్తున్నారని వివరించారు. గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ 40 ఏళ్ల అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు చేయలేని పనులు నవ యువకుడైన వైఎస్ జగన్ తన 45 రోజుల పాలనలో చేసి చూపారన్నారు. పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన ప్రత్యేక హోదా మొదలు రాష్ట్ర విభజన నాటి హామీలను అమలు చేయనప్పుడు నోరెత్తని ఆంగ్ల ఛానళ్లు ఇప్పుడు ఈ బిల్లును వివాదాస్పదం చేయాలని చూడడం విడ్డూరంగా ఉందన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకువచ్చిన మేనిఫెస్టో మూడు తరాల భవిష్యత్ అన్నారు. మహాత్మా గాంధీ కలలు సాకారం మంగళవారం ఆమోదించిన ఐదు బిల్లులు సామాజికమైనవైతే బుధవారం ప్రతిపాదించిన బిల్లులు చరిత్రాత్మకమైనవని కిలారు రోశయ్య అన్నారు. మహాత్మాగాంధీ కన్న కలలను సాకారం చేసే దిశగా వైఎస్ జగన్ నిర్ణయాలు తీసుకుంటున్నారన్నారు. చంద్రబాబు ఎంతో గొప్పగా చెప్పుకునే అమరావతి ప్రాంత అభివృద్ధి పనుల్లోనూ సుమారు 80 శాతం మంది కార్మికులు ఇతర రాష్ట్రాల వారని, స్థానికులకు ఎటువంటి అవకాశం కల్పించలేదన్నారు. 2016 నుంచి నాలుగేళ్లలో రూ.19,58,000 కోట్ల పెట్టుబడులు, 43 లక్షల ఉద్యోగాలు అని చెప్పి చంద్రబాబు మోసం చేశారన్నారు. వి.వరప్రసాద్ మాట్లాడుతూ ఈ బిల్లుతో ప్రతి నియోజకవర్గంలో ఒక నైపుణ్య అభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేసే వెసులుబాటు ఉంటుందన్నారు. వలసల్ని నిరోధించవచ్చన్నారు. ఈ బిల్లులోని అంశాలను అమలు చేయని పరిశ్రమల యాజమాన్యాలకు, అధికారులకు కూడా జరిమానాలు విధించేలా ప్రతిపాదనలు ఉండాలని సూచించారు. చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదాను తాకట్టుపెట్టి ఉండకపోతే పరిశ్రమలు వచ్చి ఉండేవని పలాస ఎమ్మెల్యే అప్పలరాజు దుయ్యబట్టారు. నైపుణ్యం లేదనే సాకుతో ఉద్యోగాలు తిరస్కరించే అవకాశం ఇకపై ఉండదన్నారు. గ్రామీణ యువతకు ఇదో వరమన్నారు. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బి.మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ దేశంలో విప్లవాత్మక మార్పునకు ఈ బిల్లు శ్రీకారం చుడుతోందన్నారు. పరిశ్రమలకు స్థానికులు భూములు ఇస్తున్నప్పుడు ఉద్యోగాలు వేరే వాళ్లకు ఇస్తామనడంలో అర్థం లేదని, ఇకపై ఈ సమస్య ఉండదన్నారు. జగన్ పట్టుదలతోనే... సామాజిక న్యాయం, బడుగు వర్గాలకు సాధికారతకు ఉద్దేశించిన 5 బిల్లులు సభ ఆమోదం పొందేంత వరకు మా అన్న, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నం ముట్టలేదని సంతనూతలపాడు ఎమ్మెల్యే సుధాకర్ చెప్పారు. జగన్ పట్టుదలకు, బీసీల పట్ల ఆయనకున్న ప్రేమాభిమానాలకు ఇదే నిదర్శనమన్నారు. మహాత్మాగాంధీ, జ్యోతిరావ్ పూలే, అంబేడ్కర్ ఎలాగో ఇక వైఎస్ జగన్ కూడా తమకు అంతేనని అభివర్ణించారు. ప్రస్తుతం జగనిజం నడుస్తోందన్నారు. ఏపీ రాజకీయ చరిత్ర చెప్పాల్సి వస్తే జగన్‌కు ముందు జగన్‌కు తర్వాత అని చెప్పాల్సి వస్తుందన్నారు. ఏ నాయకునికీ తట్టని ఆలోచనలెన్నో వైఎస్ జగన్‌కు తట్టాయని, అందుకే ఆయన మహనీయుడని అన్నారు. పారిశ్రామిక విప్లవం సామాజిక బాధ్యతతో పారిశ్రామిక విప్లవానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీకారం చుట్టారు. పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే కల్పిస్తూ చేస్తున్న చట్టం రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి దోహదపడుతుంది. ఎందుకంటే పరిశ్రమలకు అవసరమైన రీతిలో యువతకు శిక్షణ ఇచ్చి నిపుణులైన ఉద్యోగులను ప్రభుత్వమే అందిస్తుంది. ఇక పారిశ్రామికీకరణతో కాలుష్యం, ఇతర సమస్యలు ఎదుర్కొంటున్న స్థానికులకు పరిశ్రమల ఏర్పాటు పట్ల సానుకూల ధోరణి పెరుగుతుంది. స్థానికులకే ఉద్యోగాల్లో సింహభాగం దక్కాలన్న నినాదం ప్రపంచ వ్యాప్తంగా బలోపేతమవుతోంది. అదే నినాదంతో అమెరికన్ల మనసు గెలుచుకుని ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయ్యారు. అదే రీతిలో బ్రిటన్ కూడా బ్రెగ్జిట్ పేరిట ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించి యూరోపియన్ యూనియన్ నుంచి బయటకు వచ్చింది. – మేకపాటి గౌతంరెడ్డి, రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి యువత భవిష్యత్‌కు ఇక భరోసా పరిశ్రమల్లోని ఉద్యోగాల్లో స్థానికులకు 75 శాతం రిజర్వేషన్ కల్పించే చట్టాన్ని తీసుకురావాలంటే ఎంతో ధైర్యం ఉండాలి. ఇంటికో ఉద్యోగం ఇస్తామంటే నమ్మి టీడీపీకి అధికారం అప్పగిస్తే చంద్రబాబు యువతను మోసం చేశారు. దాంతో యువతలో నిరాశ నిస్పృహలు పెరిగిపోయాయి. ఈ పరిస్థితుల్లో పరిశ్రమల్లో స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు కల్పించే చట్టాన్ని తీసుకురావాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయం యువతలో కొత్త ఆశలు రేకెత్తించింది. తమ భవిష్యత్ బాగుంటుందన్న భరోసా వారికి కలుగుతోంది. ప్రజలు ఆయన నాయకత్వం కలకాలం ఉండాలని కోరుకుంటున్నారు. – రాపాక వరప్రసాద్, ఎమ్మెల్యే, రాజోలు -
ఏపీలో సువర్ణాధ్యాయం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నిజమైన సామాజిక విప్లవానికి నాంది పలుకుతూ రాష్ట్ర శాసనసభ నూతన అధ్యాయాన్ని లిఖించింది. బడుగు, బలహీన వర్గాలు, మహిళల సామాజిక, ఆర్థిక, రాజకీయ అభ్యున్నతికి మార్గం సుగమం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కీలక బిల్లులను మంగళవారం ఆమోదించింది. సామాజిక న్యాయ స్ఫూర్తిని ప్రతిఫలింపజేస్తూ రాజ్యాంగ లక్ష్యాల సాధన దిశగా గొప్ప ముందడుగు వేసింది. రాష్ట్రంలో శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్ ఏర్పాటు చేసే బిల్లుతో పాటు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు అన్ని నామినేటెడ్ పోస్టుల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లు, నామినేషన్లపై ఇచ్చే అన్ని పనులు, సర్వీస్ కాంట్రాక్టుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లు, మహిళలకు నామినేటెడ్ పోస్టుల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లు, నామినేషన్లపై ఇచ్చే పనులు, సర్వీస్ కాంట్రాక్టుల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించే బిల్లులను శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ బిల్లుల లక్ష్యాలు, ఉద్దేశాలను రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి శంకర్ నారాయణ మంగళవారం శాసనసభకు వివరించారు. అనంతరం ఈ బిల్లులపై మంత్రులు, సభ్యులు కూలంకుషంగా చర్చించారు. ఈ బిల్లులతో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలు, మహిళల సర్వతోముఖాభివృద్ధి సాధ్యమని ఏకాభిప్రాయం వ్యక్తం చేస్తూ ప్రశంసించారు. రాష్ట్రంలో నూతన సామాజిక విప్లవానికి తెరతీస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దేశానికే ఆదర్శంగా నిలిచారని సభ్యులు కొనియాడారు. అనంతరం సభ ఈ బిల్లులను ఏకగ్రీవంగా ఆమోదించింది. ఇది సుదినం.. కొత్త చరిత్రకు తెరతీస్తూ కీలకమైన బిల్లులను ఆమోదించడం ద్వారా శాసనసభ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలు, మహిళల జీవితాల్లో కొత్త వెలుగులు తీసుకువచ్చింది. ఎన్నో ఏళ్ల వివక్షకు ముగింపు పలుకుతూ ఆ వర్గాలకు సామాజిక, ఆర్థిక, రాజకీయంగా న్యాయమైన అవకాశాలను కల్పించేందుకు రాచబాట పరిచింది. బడుగు, బలహీన వర్గాల కష్టాలను పాదయాత్రలో చూసి చలించిన ముఖ్యమంత్రి వైఎస్జగన్మోహన్రెడ్డి ఆ వర్గాల సర్వతోముఖాభివృద్ధికి విప్లవాత్మకమైన ముందడుగు వేశారు. బీసీల హక్కుల పరిరక్షణకు చట్టబద్ధత కల్పిస్తూ శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్ ఏర్పాటు బిల్లును శాసనసభ ఆమోదించింది. దాంతో బీసీలు తమ హక్కులకు భంగం వాటిల్లినా, వివక్షకు గురైనా ఆశ్రయించడానికి వారికి ఓ చట్టబద్ధ వేదిక లభించింది. బీసీ జాబితాలో కొత్త కులాల చేర్పు, తొలగింపులను పరిశీలించేందుకు ఓ వ్యవస్థ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. న్యాయాధికారాలు కలిగి ఉండే బీసీ కమిషన్ ఆ వర్గాల హక్కుల పరిరక్షణకు పెద్ద దిక్కుగా నిలుస్తుందనడంలో సందేహం లేదు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు రాజకీయ, ఆర్థిక అభ్యున్నతికి చట్టబద్దత కల్పించింది. అన్ని నామినేటెడ్ పదవుల్లోనూ 50 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు రిజర్వేషన్ కల్పించే బిల్లును శాసనసభ ఆమోదించింది. దాంతో కార్పొరేషన్ చైర్మన్లు, మార్కెట్ కమిటీలు, ఇతర నామినేటెడ్ పోస్టుల్లో సగం బడుగు, బలహీన వర్గాలకు దక్కనున్నాయి. అదే విధంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు నామినేషన్లపై ఇచ్చే అన్ని పనుల్లో 50 శాతం రిజర్వేషన్ కల్పించే బిల్లును కూడా శాసనసభ ఆమోదించింది. దాంతో ఆ వర్గాలు ఆర్థికంగా స్వావలంబన సాధనకు మార్గం సుగమమైంది. ఆకాశంలో సగం.. అవనిలో సగం ఉన్న మహిళలకు అవకాశాల్లోనూ సగం కల్పించాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆశయానికి ఆమోద ముద్ర వేసింది. అన్ని నామినేటెడ్ పోస్టుల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ బిల్లును శాసనసభ ఆమోదించింది. దాంతో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు నామినేటెడ్ పదవుల్లో మహిళలకు సగభాగం హక్కు దక్కింది. నామినేషన్లపై ఇచ్చే అన్ని పనుల్లోనూ మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించే బిల్లును ఆమోదించింది. ఈ నేపథ్యంలో బడుగు, బలహీన వర్గాలు, మహిళల అభ్యున్నతికి దోహదం చేసేకీలక బిల్లులపై చర్చను ప్రతిపక్ష పార్టీ టీడీపీ బహిష్కరించడం విస్మయపరిచింది. ఆద్యంతం అడ్డుకునేందుకే యత్నం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలతో పాటు మహిళలకు ఆర్థిక, సామాజిక, రాజకీయ అధికారం కల్పించే కీలక బిల్లులపై అసెంబ్లీలో చర్చను అడ్డుకోడానికి ప్రతిపక్ష టీడీపీ శతథా యత్నించింది. శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్ ఏర్పాటు బిల్లు ఉద్దేశాలను మంత్రి శంకర నారాయణ అసెంబ్లీలో వివరిస్తుండగా టీడీపీ సభ్యులు తీవ్ర స్థాయిలో అంతరాయం సృష్టించారు. స్పీకర్ పోడియం చుట్టుముట్టారు. కొందరు ఏకంగా స్పీకర్ పోడియం మీదకు చేరి నినాదాలు చేశారు. బడుగు, బలహీన వర్గాలు, మహిళల సంక్షేమం, సాధికారికత కోసం కీలక బిల్లులపై చర్చకు సహకరించాలని ప్రభుత్వం తరఫున మంత్రి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ టీడీపీ సభ్యులు ఏమాత్రం వినిపించుకోలేదు. మంత్రి శంకర నారాయణ ప్రసంగిస్తున్నంతసేపు నినాదాలు చేస్తునే ఉన్నారు. టీడీపీ సభ్యుల అరుపులు, కేకల మధ్యే డిప్యూటీ స్పీకర్ కొన రఘుపతి బిల్లులపై చర్చను కొనసాగించాల్సి వచ్చింది. తమ స్థానాల్లో కూర్చొని చర్చకు సహకరించాల్సిందిగా డిప్యూటీ స్పీకర్ చేసిన విజ్ఞప్తిని కూడా టీడీపీ ఎమ్మెల్యేలు పట్టించుకోలేదు. బిల్లుపై చర్చలో పాల్గొంటూ ఎమ్మెల్యేలు వేణుగోపాల్, కరణం ధర్మశ్రీ మాట్లాడుతున్నంతసేపూ టీడీపీ సభ్యులు వారి ప్రసంగానికి అడ్డుతగిలేందుకు ప్రయత్నిస్తునే ఉన్నారు. అయినప్పటికీ డిప్యూటీ స్పీకర్ నిబద్ధతతో చర్చను కొనసాగించారు. చివరికి ఎమ్మెల్యే పార్థసారథి ప్రసంగిస్తుండగా చంద్రబాబు, టీడీపీ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేసి వెళ్లిపోయారు. బడుగు, బలహీన వర్గాలు, మహిళలకు అన్ని విధాలా మేలు చేకూర్చే విషయంలో టీడీపీ సభ్యులు వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. అంబేడ్కర్ స్ఫూర్తిని పుణికిపుచ్చుకున్న సీఎం చట్టసభల్లో బడుగు, బలహీన వర్గాలకు రిజర్వేషన్లు కల్పిస్తూ అంబేడ్కర్ రాజ్యాంగంలో ఆర్టికల్ 366ను పొందుపరిచారు. ఆయన స్ఫూర్తితో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నామినేటెడ్ పదవులు, నామినేషన్లపై ఇచ్చే పనుల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించారు. – పీడిక రాజన్న దొర, ఎమ్మెల్యే, సాలూరు బీసీల సాధికారికతను అడ్డుకునేందుకు టీడీపీ కుట్ర బీసీలకు సాధికారికత చేకూర్చే చరిత్రాత్మక బిల్లులను అడ్డుకోవడానికి చంద్రబాబు, ఆయన బృందం సభకు అంతరాయం కలిగించేందుకు ప్రయత్నిస్తోండటం సబబు కాదు. వైఎస్ జగన్‌కు ఎక్కడ మంచి పేరు వస్తుందోనన్న అక్కసుతో సభా వ్యవహారాలను అడ్డుకుంటున్నారు. బీసీలకు శాశ్వత కమిషన్ ఏర్పాటైతే తమ సమస్యలను నోరు విప్పి చెప్పుకోలేని స్థితిలో ఉన్న బీసీల విషయాలను సుమోటో కేసులుగా స్వీకరించే వెసులుబాటు లభిస్తుంది. – చెల్లుబోయిన వేణుగోపాల్, ఎమ్మెల్యే, రామచంద్రాపురం ఇలాంటి సీఎం కావాలని అందరూ కోరుకుంటున్నారు గత ప్రభుత్వం మైనార్టీలను ఓటు బ్యాంకుగానే చూసింది. కానీ మైనార్టీల సంక్షేమానికి చిత్తశుద్ధితో పని చేయడం ఎలాగో సీఎం వైఎస్ జగన్ చేసి చూపించారు. వారి పురోభివృద్ధికి ఏకంగా చట్టం తీసుకువస్తున్నారు. అలాంటి సీఎం కావాలని అన్ని రాష్ట్రాల ప్రజలూ కోరుకుంటున్నారు. – ముస్తఫా, ఎమ్మెల్యే, గుంటూరు ఈస్ట్ టీడీపీ ఓర్వలేకపోతోంది.. దేశ చరిత్రలోనే తొలిసారిగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు నామినేటెడ్ పదవులు, నామినేషన్లపై ఇచ్చే పనుల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించారు. దీన్ని చూసి ప్రతిపక్ష టీడీపీ ఓర్వలేకపోతోంది. ఇంతటి చరిత్రాత్మక సమయంలో సభలో ఉండకుండా వెళ్లిపోవడం చంద్రబాబు అహంకారానికి నిదర్శనం. 40 ఏళ్ల అనుభవం ఉందని చెప్పుకునే ఆయన తన పాలనలో బీసీలను అన్ని విధాలుగా మోసం చేశారు. ప్రస్తుత సీఎం వైఎస్ జగన్ బీసీలకు న్యాయం చేస్తుంటే కూడా చూడలేకపోతుండటం టీడీపీ నైజాన్ని బయటపెడుతోంది. – అనిల్ కుమార్ యాదవ్, నీటి పారుదల శాఖ మంత్రి ఈ ఘనత సీఎం జగన్‌దే ఆకాశంలో సగం.. అవనిలో సగం.. అని మహిళల గురించి అందరూ అంటుంటారు. మహిళలకు నిజంగా అవకాశల్లో సగం ఇచ్చి సీఎం వైఎస్ జగన్ చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. ఉప ముఖ్యమంత్రిగా గిరిజన మహిళ, హోం మంత్రిగా ఎస్సీ మహిళకు అవకాశం ఇచ్చారు. ఇప్పుడు అన్ని నామినేటెడ్ పదవుల్లోనూ, నామినేషన్లపై ఇచ్చే అన్ని పనుల్లోనూ మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించారు. టీడీపీ ప్రభుత్వంలో మహిళలు అవమానాలకు గురయ్యారు. కానీ రాష్ట్రంలో మహిళలను చెల్లిగా, తల్లిగా గౌరవించే మహోన్నత స్వభావం ఉన్న వైఎస్ జగన్ సీఎం కావడం మన అదృష్టం. – ఆర్కే రోజా, ఎమ్మెల్యే, నగరి ఇది పండుగ దినం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఇది నిజమైన పండుగ రోజు. రాజకీయ అధికారం, ఆర్థిక స్వావలంబన కల్పిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గొప్ప నిర్ణయం తీసుకున్నారు. అణగారిన వర్గాలకు సామాజిక గౌరవం కల్పించారు. – కొరుముట్ల శ్రీనివాసులు, ఎమ్మెల్యే, రైల్వేకోడూరు బీసీల గుండెల్లో సీఎం జగన్ నిలిచిపోతారు బీసీలు అంటే బ్యాక్ వర్డ్ కాదు బ్యాక్ బోన్ కులాలు అని చాటి చెప్పేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రయత్నిస్తుంటే చంద్రబాబు సహకరించకపోగా ఆటంకాలు సృష్టిస్తున్నారు. శాశ్వత బీసీ కమిషన్ ఏర్పాటు చేయడం దేశంలోనే తొలిసారి. బీసీ హృదయాలలో జగన్ చిరస్మరణీయునిగా ఉంటారు. – కరణం ధర్మశ్రీ, ఎమ్మెల్యే, చోడవరం బీసీల హక్కుల పరిరక్షణకు నాంది చంద్రబాబు బీసీలకు తీవ్ర ద్రోహం చేశారు. టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన జీవో 550తో రాష్ట్రంలో దాదాపు 500 మంది బీసీ విద్యార్థులు మెడికల్ సీట్లు కోల్పోయారు. చంద్రబాబు పాలనలో రాజధానితో సహా రాష్ట్రమంతటా కుల, మతాల తారతమ్యాలు, కుల వివక్ష విపరీతంగా పెరిగిపోయింది. ఇలాంటి సామాజిక రుగ్మతలను రూపు మాపడానికి సీఎం వైఎస్ జగన్ శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్ నియమించాలని నిర్ణయించారు. ఈ కమిషన్‌తో బీసీల హక్కుల పరిరక్షణ సాధ్యపడుతుంది. – కొలుసు పార్థసారథి, ఎమ్మెల్యే, పెనమలూరు మరో అంబేడ్కర్, అల్లూరి అన్ని స్థాయిల్లోని పదవుల్లో బడుగు, బలహీన వర్గాలకు అంబేడ్కర్ చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించారు. ప్రస్తుతం మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరో అడుగు ముందుకు వేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు నామినేటెడ్ పదవుల్లో, నామినేషన్లపై పనుల్లోనూ 50 శాతం రిజర్వేషన్ కల్పించారు. ఇంతే కాకుండా ఏజెన్సీలో బాక్సైట్ మైనింగ్ చేయబోమని ప్రకటించడం గిరిజనుల్లో సంతోషం కలిగించింది. అందుకే గిరిజనులు వైఎస్ జగన్‌ను మరో అంబేడ్కర్‌గా, మరో అల్లూరిగా కీర్తిస్తున్నారు. – భాగ్యలక్ష్మి, ఎమ్మెల్యే, పాడేరు మహిళా సాధికారికత సాకారం పార్లమెంటులో మహిళా బిల్లు మూడు దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉంది. కానీ సీఎం వైఎస్ జగన్ తాను అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే అన్ని నామినేటెడ్ పదవులు, పనుల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. తద్వారా మహిళా సాధికారికత కలను సాకారం చేశారు. – జొన్నలగడ్డ పద్మావతి, ఎమ్మెల్యే, శింగనమల దేశ చరిత్రలో ఇదే తొలిసారి అసమానతలకు గురవుతున్న అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం సీఎం వైఎస్ జగన్ విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు. నామినేషన్లపై ఇచ్చే పదవుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించం దేశ చరిత్రలో ఇదే తొలిసారి. వైఎస్ జగన్ నామినేషన్లపై ఇచ్చే పనుల్లో బడుగు, బలహీన వర్గాలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించడం ద్వారా నిజమైన సామాజిక న్యాయానికి పెద్దపీట వేశారు. – మేరుగ నాగార్జున, ఎమ్మెల్యే, వేమూరు సామాజిక న్యాయానికి శ్రీకారం బడుగు, బలహీన వర్గాలు, మహిళల అభ్యున్నతి, నిజమైన సామాజిక న్యాయం, సమాన హక్కుల కల్పన పట్ల సీఎం వైఎస్ జగన్ చిత్తశుద్ధి, నిబద్ధత దేశానికి ఆదర్శప్రాయం. శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్ ఏర్పాటుతో బలహీన వర్గాల హక్కులకు చట్టబద్ధమైన రక్షణ లభిస్తుంది. పాత కమిషన్ బిల్లులున్నా అవి సరిగా పని చేయకపోవడంతో నూతన బిల్లును తీసుకువచ్చాం. ఈ కొత్త శాసనం బీసీలలో విశ్వాసం కలిగిస్తుందని విశ్వసిస్తున్నాం. అన్ని స్థాయిల్లోనూ రాజకీయ అధికారంలో భాగస్వామ్యం కల్పించడం ద్వారానే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు సామాజిక గౌరవం దక్కుతుందనేది ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విధానం. అందుకే ఆ వర్గాలకు అన్ని నామినేటెడ్ పదవుల్లో, అన్ని నామినేటెడ్ పనులు, సర్వీస్ కాంట్రాక్టుల్లో 50 శాతం రిజర్వేషన్ కల్పించే బిల్లులను ప్రవేశపెట్టి ఆ వర్గాల ఆర్థిక స్వావలంబన సాధనకు ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఇక పురుషులతో సమానంగా అన్ని రంగాల్లోనూ మహిళలు పురోగతి సాధించడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విప్లవాత్మకమైన విధాన నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా మహిళలకు నామినేటెడ్ పదవుల్లో, పనుల్లో 50 శాతం రిజర్వేషన్ కల్పించడం ద్వారా మహిళా సాధికారికత సాధనకు మార్గం సుగమమవుతుంది. – ఎం.శంకర నారాయణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి మహిళల అభ్యున్నతికి విప్లవాత్మక నిర్ణయం టీడీపీ ప్రభుత్వంలో మహిళలు పూర్తిగా మోసానికి గురయ్యారు. డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తామన్న హామీని చంద్రబాబు నెరవేర్చలేదు. సున్నా వడ్డీకి రుణాలను ఇవ్వలేదు. బెల్టు షాపులు రద్దు చేస్తామని చెప్పిన చంద్రబాబు ముఖ్యమంత్రిగా పదవి దిగేనాటికి రాష్ట్రంలో వాటి సంఖ్యను 40 వేలకు పెంచారు. తహశీల్దార్ వనజాక్షి మీద దాడి చేసిన టీడీపీ ఎమ్మెల్యేను అప్పటి సీఎం చంద్రబాబు వెనకేసుకొచ్చారు. అందుకే ఎన్నికల్లో మహిళలు టీడీపీని ఓడించారు. ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా మహిళలు బలోపేతం అయ్యేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు. – పుష్ప శ్రీవాణి, డిప్యూటీ సీఎం మనసున్న పాలకుడి గొప్ప నిర్ణయం పదేళ్ల పాటు ప్రజల్లో ఉంటూ వారి కష్టాలు, కన్నీళ్లను దగ్గరి నుంచి చూసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీసుకున్న విప్లవాత్మక నిర్ణయం ఇది. మనసున్న పాలకుడి పాలన ఎలా ఉంటుందో ఆయన చూపిస్తున్నారు. ముఖ్యమంత్రి అంటే ఇలా ఉండాలని దేశానికి ఆదర్శంగా నిలిచారు. – బాలరాజు, ఎమ్మెల్యే, పోలవరం వైఎస్ జగన్‌కు సెల్యూట్.. ఐదు నెలల క్రితం ఏలూరులో నిర్వహించిన బీసీ గర్జనలో ప్రకటించిన బీసీ డిక్లరేషన్‌ను అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే చేసి చూపిన నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. విలువలు, విశ్వసనీయత అంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాష్ట్ర ప్రజల మనసులో నిలిచిపోతారు. అందుకే బీసీ వర్గాల తరఫున ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు సెల్యూట్ చేస్తున్నా. – జోగి రమేష్, ఎమ్మెల్యే, పెడన మహిళల ఆత్మవిశ్వాసం పెంచే మహా విప్లవం తరతరాలుగా మహిళల పట్ల జరుగుతున్న అన్యాయాలను సరిదిద్దే దిశగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పెద్ద ముందడుగు వేశారు. మహిళల ఆత్మవిశ్వాసం, ఆత్మ గౌరవం పెంచే మహా విప్లవం ఇది. ఈ నిర్ణయం దేశ రాజకీయాల్లో పెను మార్పులకు నాంది పలుకుతోంది. ఇందుకు మహిళా లోకం తరఫున ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. – విడదల రజని, ఎమ్మెల్యే, చిలకలూరిపేట -
మారోజు వీరన్న అమరత్వం
పీడిత జన సామాజిక విప్లవకారుడు, మలిదశ తెలంగాణా పోరాట ఆద్యుడు, కుల వర్గ జమిలి పోరాటాల నిర్మాత మారోజు వీరన్న భౌతికంగా దూరమై 19 సంవత్సరాలు అవుతున్నది. 1999, మే 16న∙కరీంనగర్ జిల్లా నర్సింగాపూర్‌లోని మామిడితోటలో అర్థరాత్రి రాజకీయ హత్య గావించిన పోలీసులు ఎన్‌కౌంటర్‌గా చిత్రీకరిం చారు. దళిత బహుజన ఆవేశాన్ని చల్లారుస్తూ.. అప్రకటిత ఎమర్జెన్సీ పాలనా సాగిస్తూ చంద్రబాబు ప్రభుత్వం పల్లె పల్లెన శ్మశాన శాంతిని నెలకొల్పింది. ఎర్ర పోరాటానికి నీలి మెరుపులు అద్దిన వీరన్న అస్తిత్వ పోరాటాలకు దిక్సూచిగా నిలిచాడు. 19 ఏళ్లుగా వీరన్న భౌతికంగా లేకున్నా ప్రతి అస్తిత్వ పోరాటంలో సజీవంగా ఉన్నాడు. భారత విప్లవ పోరాట పంథాను కుల నిర్మూలన ఫలకంపై నిర్మించడంలో విఫలం అయ్యి ప్రజ లకు దూరమవుతున్నారనే వీరన్న ఆయన అనుయాయుల విమర్శతోనే నేటి కమ్యూనిస్టులు అంబేడ్కర్‌ను ఎత్తిపడుతున్నారా అనేది చర్చనీ యాంశం. వీరన్న కుల వర్గ జమిలి పోరాట సూత్రాన్ని అన్వయించుకొని నేడు లాల్–నీల్ ఐక్యత పోరాటంగా ముందుకు సాగుతున్న పార్టీలు సైతం ఎన్నికలను ఎదుర్కోవడం కోసం ఎత్తుగడనా? లేక సైద్ధాంతికంగానే పంథాను మార్చుకున్నాయా అనేది నేడు ఆత్మ విమర్శ చేసుకోవాల్సిన అంశం. శ్రామిక వర్గ దృక్పథం లేని కుల పోరాటాలు, కుల నిర్మూలన లక్ష్యం లేని వర్గ పోరాటాలు విముక్తి సాధించలేవు. కనుక వీరన్న చూపిన రాజకీయ సైద్ధాంతిక వెలుగులో పురోగమించడమే ఆయన స్మృతిలో నిజమైన నివాళి. సమానత్వ సమాజ మార్గానికి పునాది రవళి. (మే 16న మారోజు వీరన్న 19వ వర్థంతి) దుబ్బ రంజిత్, యం. ఏ. పీ.హెచ్.డి, అర్థశాస్త్ర పరిశోధక విద్యార్థి, పీ.డీ.ఎస్.యు. అధ్యక్షులు, ఉస్మానియా యూనివర్సిటీ మొబైల్ : 99120 67322 -
లైక్ షేర్ షేక్ ఇట్
సోషల్ రివల్యూషన్! ట్విట్టర్లో ఒక మంచి ట్వీట్ కనబడింది. మనకిష్టమైనది అది. లైక్ ఇట్! ఫేస్బుక్లో ఎవరో ఓ మంచి పనికి అండగా నిలబడ్డారు. షేర్ ఇట్!!ఎక్కడో ఎవరో ప్రభుత్వాన్ని పశ్నించాలనుకున్నారు. ఇంకెక్కడో ఎవరో మార్పు కోసం ఉద్యమం మొదలుపెట్టారు.మరెక్కడో ఇంకెవరో మంచిని బతికిద్దాం. పోరాడదాం రండి అన్నారు.షేర్ ఇట్.. షేర్ ఇట్.. షేర్ ఇట్.. మంచి కోసం వేసే అడుగులవి. చెడుపై చేసే పోరాటమది. గెలుపు వైపుకు తీసుకెళ్ళే కుదుపు అది. యూ షేక్ ఇట్. అదే సోషల్ రివల్యూషన్. ‘అమ్మకు ఉత్తరం రాసి రెండు వారాలైంది. అది అందిందో లేదో? నేనిక్కడ బాగానే ఉన్నానని తనకింకా తెలిసిందో లేదో?’ టెక్నాలజీ అభివృద్ధి చెందాక ఇలాంటి మాటలేం కనిపించట్లేదు. అలా అని ఆ మాటల్లో ఉన్న ప్రేమ కనిపించకుండాపోలేదు. ఆ ప్రేమ తరానికి తరానికి మధ్య ఒక్కో దారిని ఎంచుకుంటూ, ఒక్కోవిధంగా సాగిపోతూనే ఉంది. ఆగిపోయే ప్రేమలే ఉంటే, మనిషనే వాడే ఉండడు. ఆ ప్రేమలలా సాగాలని కోరుకుంటున్నాం కాబట్టే మనకు కావాల్సిన ఇష్టమైన దారులు వెతుక్కుంటున్నాం.ఈ డిజిటల్ యుగంలో మనం వెతుక్కున్న అలాంటి ఒక దారి.. సోషల్ మీడియా.ఒక విప్లవంలా మన జీవితాల్లోకి చొచ్చుకొచ్చిన ఈ సోషల్ మీడియా.. ఒక వ్యక్తి సమాజానికి నేర్పే, ఒక సమాజం వ్యక్తికిచ్చే, ఒక సమాజం ఇంకో సమాజం నుంచి తీసుకునే విలువలు, లక్షణాలు, అవసరాలకు దారినిచ్చింది, ఇస్తూనే ఉంది. మనం ఎలా దాన్ని అర్థం చేసుకున్నా, మనకు ఈ సోషల్ మీడియా కొన్ని కొత్త విషయాలను పరిచయం చేసింది. కొన్ని అవసరమైన విషయాలను నేర్పింది. అలాంటివి కొన్ని..! విప్లవాన్ని నేర్పింది... ప్రశ్నించడాన్ని అలవాటు చేసింది..!విప్లవం మొదలయ్యేది ఒక్కడితోనే! అయితే ఆ ఒక్కడి చుట్టూ ఓ పదిమంది ఉండాలి. ఆ పదిమందికీ ఓ వందమంది తోడవ్వాలి. ఆ వందమందికి ఓ వెయ్యి మంది సపోర్ట్ ఇస్తూ ఉండాలి. అప్పుడే విప్లవం విజయం వైపు దారితీస్తుంది. సోషల్ మీడియా ఇలాంటి ఎన్నో విప్లవాలకు ఊతమిచ్చింది. ఈజిప్టు రివల్యూషన్ గుర్తుంది కదా? ప్రభుత్వంపై ప్రజల తిరుగుబాటు ఒక ఉద్యమంలా మారి అధ్యక్షుడిని పదవి నుంచి దించిన విప్లవం అది. హోస్నీ ముబారక్ ప్రభుత్వం ఆగడాలు పెరిగిపోయాయి. ప్రభుత్వాన్ని ఎదిరించే ప్రయత్నం చేసిన వారిపై దాడులు మొదలయ్యాయి. హింస తారస్థాయికి చేరిపోయింది. ఇది చూసి చలించిపోయాడు వేల్ గోనిమ్ అనే ఓ యువకుడు. ఇప్పటి సమాజమంతా కనెక్ట్ అయి ఉన్న సోషల్ నెట్‌వర్క్స్‌లో భాగమైన ఫేస్‌బుక్‌ను వేదికగా చేసుకొని తిరుగుబాటు మొదలుపెట్టాడు. ఆ తిరుగుబాటుకు నెటిజన్ల నుంచి ఊహించని స్థాయి స్పందన వచ్చింది. ఒక్కడితో మొదలైన తిరుగుబాటు రోజురోజుకీ లక్షలాదిమంది సపోర్ట్ సంపాదించుకుంటూ వచ్చింది. జనం రోడ్లపైకి వచ్చి ప్రభుత్వం దిగిపోవాలని నినాదాలు చేశారు. 2011 జనవరి 25 నుంచి ఫిబ్రవరి 11 వరకు రెండు వారాలు జన నినాదం హోరెత్తింది. ఆ దెబ్బకు హోస్నీ ముబారక్ తన పదవికి రాజీనామా చేసి తప్పుకున్నాడు. సోషల్ మీడియాను వేదికగా చేసుకొని ఒక సమాజం చేసిన విజయవంతమైన విప్లవం అది. ప్రశ్నించడాన్ని అలవాటు చేసిన విప్లవం అది. కొద్దినెలల క్రితమే ఫేస్బుక్లో ఇండియన్ జవాన్ తేజ్ బహుదూర్ వేసిన ఓ పోస్ట్ ప్రభుత్వాన్ని పరుగులుపెట్టించిన విషయం గుర్తుందా? రాత్రనకా, పగలనకా సరిహద్దుల్లో దేశం కోసం పోరాడుతున్న సైనికులకు అందించే భోజనం విషయంలో అధికారులు ఎంత అజాగ్రత్త కనబరుస్తున్నారో తెలియపరచిన పోస్ట్ అది. అలాంటి భోజనం చేయలేక, ఖాళీ కడుపుతో పడుకొని, వణికించే మంచులో, దేశం కోసం ఓ జవాన్ ఎలా పోరాడతాడనుకున్నారంటూ సోషల్ మీడియా విరుచుకుపడింది. ఢిల్లీ పెద్దలందరికీ వినిపించింది సోషల్ మీడియా అరుపు. మార్పొచ్చిందిప్పుడు. అదేవిధంగా సోషల్ మీడియాను వేదికగా చేసుకొని భారతదేశంలో అవినీతిపై ఉద్యమం జరిగింది. నిర్భయ ఘటనపై తమ గొంతుకను వినిపించి, నిర్భయ చట్టం తెచ్చేవరకూ ఓ సామాన్యుడు చేసిన పోరాటానికి సోషల్ మీడియానే ఉపయోగపడింది. అమెరికాలో ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపడం దగ్గర్నుంచి, మధ్యప్రదేశ్‌లో రైతు సమస్యల గురించి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే వరకూ సామాన్యుడికి సోషల్ మీడియానే మొదటి వేదికగా కనిపిస్తోంది. ఇప్పుడు మీరిది చదువుతున్న సమయానికి కూడా ఎక్కడోక్కడ సోషల్ మీడియా వేదికగా ఏదో ఒక ఉద్యమం నడుస్తూనే ఉంటుంది.ప్రశ్నించడం మానేసి అన్నింటికీ సర్దుకుపోవడం అలవాటైన సగటు మనిషికి ఇప్పుడు సోషల్ మీడియా మళ్ళీ ప్రశ్నించడాన్ని అలవాటు చేసింది. మనుషుల్ని ఒక్కటి చేసింది..! అలన్ కుర్ది. 2015 సెప్టెంబర్ నెలలో ప్రపంచవ్యాప్తంగా ఈ పేరు తలుచుకుని బాధపడని వారుండరు. సిరియాలో జరుగుతున్న సివిల్ వార్తో అక్కడి ప్రజలు బతుకు భారంగా గడపాల్సిన పరిస్థితుల మధ్య వినిపించిన పేరది. సిరియాలో ఇక బతికే పరిస్థితి లేదనుకున్న అలన్ కుర్ది తండ్రి అబ్దుల్లా కుర్ది కుటుంబంతో కలసి దేశాన్ని వదిలేందుకు సిద్ధమయ్యాడు. కెనడాలో తన సోదరి వద్దకు అబ్దుల్లా వెళ్ళాలని ప్రయత్నించినా, ఆ దేశం అందుకు అనుమతించలేదు. దీంతో ఒక పెద్ద పడవపై తన పిల్లలతో కలసి అబ్దుల్లా యూరప్‌కు వలస వెళ్ళేందుకు బయలుదేరాడు. టర్కీలోని బోర్డమ్ ప్రాంతంలో వారు ప్రయాణిస్తున్న పడవ మునగడంతో అబ్దుల్లా మూడేళ్ళ కుమారుడు అలన్‌తో సహా మరికొందరు మృత్యువాత పడ్డారు. సరిగ్గా అదే సమయంలో టర్కీ ఫొటోగ్రాఫర్ నీలోఫర్ డెమిర్ బీచ్‌లో ప్రాణాలు కోల్పోయి ‘ప్రశాంతంగా’ పడి ఉన్న అలన్‌ను ఫొటో తీశాడు. ఆ ఫోటోను తర్వాత సోషల్ మీడియాలో షేర్ చేయగా ప్రపంచమంతా దాని గురించి మాట్లాడింది. సిరియా సంక్షోభాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన ఫోటో అది. ఆ ఫొటో చూసి చలించిన వారంతా సోషల్ మీడియాలో ఒక ఉద్యమమే తీసుకొచ్చారు. మనిషి ఎక్కడైనా ఒక్కటే అని చెబుతూ ప్రపంచదేశాల రాజకీయ ఆటలను జనం దుమ్మెత్తిపోశారు.ఆసియా, యూరప్ దేశాలన్నీ సిరియా సంక్షోభం గురించి మాట్లాడేలా, సిరియా వలసవాదులకు ఓ దారి చూపించేలా సోషల్ మీడియా ఉద్యమం పనిచేసింది.ప్రపంచంలో ఒక మనిషి ఎక్కడికెళ్ళినా కనిపించేది ఇంకో మనిషేనని, బాధ – సంతోషం ఒక మనిషిదంటే అది అందరిదీ అని అలన్ కుర్ది ఘటన చెప్పకనే చెప్పింది. ఇలాంటి సంఘటనలెన్నో మనుషుల్ని ఒక్కటి చేసింది, మనిషి కోసం బతకమని. ప్యాషన్‌కు దారిచూపింది..! ప్రతి మనిషికీ ఏదో ఒక ప్యాషన్ ఉంటుంది. తిక్క అన్నా, మరింకేమన్నా తమ ప్యాషన్ వైపుకు ఎలా అడుగులు వేయాలా అని తపిస్తూంటారంతా. వారందరికీ సోషల్ మీడియా ఒక దారి చూపిస్తోంది. తన్మయ్ భట్‌కి నవ్వించడమంటే ఇష్టం. తనే రాసుకొని తనదైన కామెడీ టైమింగ్‌తో కామెడీ పండించగలడతడు. సోషల్ మీడియాని వేదికగా చేసుకొని తన ప్రతిభను ప్రపంచానికి చాటాలనుకున్నాడు. ఏఐబీ పేరుతో ఓ యూట్యూబ్ చానల్ మొదలుపెట్టి వీడియోలు చేశాడు. ఇప్పుడు ఇండియాలో అతనొక పెద్ద స్టార్. ఫోర్బ్స్ జాబితాలో చోటు సంపాదించుకున్నాడు కూడా. చెఫ్ సంజయ్ తుమ్మ కూడా తన కొత్త కొత్త వంటలను ప్రపంచానికి పరిచయం చేసేందుకు సోషల్ మీడియానే ఎంచుకున్నాడు. ఆయనా ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద స్టార్. ఇండియాలోనే ఇలా ఉంటే ఇక పాశ్చాత్య దేశాల్లో సోషల్ మీడియాతోనే స్టార్స్ అయిన వారికి లెక్కే లేదు. ‘ఓపెన్ గాంగ్నమ్ స్టైల్’ అంటూ సందడి చేసిన మ్యూజిషియన్ సై (్క ్గ) సోషల్ మీడియా ద్వారానే పాపులర్ అయిన సూపర్‌స్టార్. చైనాలో సోషల్ మీడియా స్టార్స్‌ను ‘వాంగ్ హాంగ్స్’ అని పిలుస్తారు. సోషల్ మీడియాను వేదికగా చేసుకొని కోట్లు సంపాదిస్తోన్న వారు వాంగ్ హాంగ్స్. బంధాలను బలపరిచింది..! మన ఊరికి 75 కి.మీ. దూరంలో ఉన్న పెద్దమ్మను ఊరెళ్ళి పలకరించి ఎంత కాలమైంది? చిన్నప్పుడు మనతో స్కూల్లో చదువుకున్న ఫ్రెండొకడు ఇప్పుడు అరబ్ దేశంలో ఉన్నాడు. ఎలా ఉన్నాడో? మనదనే చిన్న ప్రపంచం కాస్త బిజీ అయిపోయాక, మన నుంచి కొంత బయటకొచ్చి చూస్తే, మిగతా ప్రపంచాలన్నీ ఎలా ఉన్నాయో అని అప్పుడప్పుడూ ఆలోచిస్తూంటాం కదూ!? ఇప్పుడైతే సోషల్ మీడియా ఉంది కాబట్టి అనుకున్న క్షణమే వాళ్ళెలా ఉన్నారో తెల్సుకుంటాం. మాట్లాడుకోకపోయినా వాళ్ళ లైఫ్ ఎలా ఉందో తెలుస్తూం టుంది. మనమెలా ఉన్నామో మన ఫొటోలు వాళ్ళకు చేర వేస్తాయి. వాళ్ళిలా ఉన్నారని వాళ్ళ ఫొటోలు మనకి కనిపిస్తూం టాయి. సోషల్ మీడియా.. బంధాలను చెడగొట్టిందని చెప్పుకుం టాం కానీ, నిజానికి అది బంధాలను ఇంత బిజీ లైఫ్‌లోనూ బలోపేతం చేసింది. తాజాగా అమెరికాలో నిర్వహించిన ఓ సర్వేలో 74.3%మంది పెళ్ళైన జంటలు, సోషల్ మీడియా తమ బంధాన్ని మరింత బలపరిచాయని చెప్పుకొచ్చారు. మానవత్వాన్ని బతికించింది..! 2014లో ఒహాయోలో నాదల్ స్టీఫెన్ అనే వ్యక్తి రెడ్డిట్ డాట్ కామ్ అనే సోషల్ నెట్‌వర్క్‌లో ఓ కోరిక కోరాడు. తనకు ఒక పాప పుట్టి, 20రోజుల పాటు చావు బతుకులతో పోరాడి చనిపోయిందని, పుట్టిననాటి నుంచి ఆ పాపను ఆక్సిజన్ పైపులతోనే చూశానని, ఎవరైనా తన పాప ఫోటోను ఎడిట్ చేసి, ఆక్సిజన్ పైపులు లేకుండా తనెలా ఉంటుందో చూపించమని అడిగాడు. ఈ పోస్ట్ చూసి వేలాది మంది చలించిపోయారు. ఫోటోషాప్ చేసిన ఫోటోలు వేలకొలది వచ్చి పడ్డాయి. దాదాపు నెలరోజుల పాటు ఆ పోస్ట్‌కు స్పందనలు వస్తూనే ఉన్నాయి. అదిచూసిన స్టీఫెన్ ఒక మాటన్నాడు..‘నా పాప చనిపోయినా, మీ అందరూ చూపిన ప్రేమకు తను ఇంకా బతికి ఉన్నట్టే అనిపిస్తోంది. అవును.. మానవత్వం బతికే ఉంది.’ ∙∙ విజయవాడలో ఉండే దుర్గా భవాని, బాలరాజు దంపతుల కుమారుడు పవన్‌కు ఆరేళ్ళ వయసులో జబ్బు చేసింది. దగ్గర్లోని హాస్పిటల్లో చేర్పిస్తే లివర్ దెబ్బతిందని, ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయాలని, దానికి రూ. 25 లక్షల దాకా ఖర్చవుతుంది చెప్పారు. పవన్ తండ్రి దగ్గర అంత డబ్బు లేదు. తన లివర్ సెగ్మెంట్‌ని అయితే ఇవ్వగలడు కానీ, డబ్బు ఎక్కడి నుంచి తేవాలో తెలియలేదు. అదే సమయంలో ‘ప్రయత్న ఫర్ ఏ ఛేంజ్’∙పేరుతో అప్పటికే ఫండ్ రైజింగ్ కోసం సోషల్ మీడియా క్యాంపెయిన్స్ నడిపిస్తోన్న జె. రాఘవేంద్ర ఈ విషయాన్ని తెలుసుకొని ‘సేవ్ మాస్టర్ పవన్’ పేరుతో ఒక క్యాంపెయిన్ మొదలు పెట్టాడు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి, ప్రధానమంత్రి ఫండ్స్ నుంచి వచ్చిన డబ్బులు కాక మరో 10 లక్షల రూపాయల దాకా అవసరమయ్యాయి. అవన్నీ సోషల్ మీడియాలోనే వేలాదిమంది షేర్ చేయగా, వందలమంది విరాళాలు ఇవ్వగా సమకూరాయి. గ్లోబల్ హాస్పిటల్ డాక్టర్ల సహకారం కూడా దీనికి తోడవ్వడంతో గత ఏడాది నవంబర్‌లో పవన్ ఆపరేషన్ విజయవంతం అయింది. ఇప్పుడు పవన్ ఆరోగ్యంగా ఉన్నాడు. రోజూ స్కూల్‌కి కూడా వెళుతున్నాడు. ‘‘మా పరిస్థితి తెలుసుకొని ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు కానీ రఘు బాబు ఎంతో కష్టపడి బాబుకు నయమయ్యేలా చేశాడు. నెట్లో అన్నిచోట్ల పెట్టి మాకు అవసరమైన డబ్బులు తెప్పించాడు.’’ అంటోన్న దుర్గా భవాని మాటలు ఎంత అందంగా ఉన్నాయి! ఒకరికి సాయం చేయాలన్న ఆలోచనతో రాఘవేంద్ర ఎంచుకున్న మార్గం ఎంతమందిని కదిలించిందీ!! ఇలాంటి ఎందరో పవన్‌ల నవ్వు చూసి çపడే సంబరమే కదా.. సోషల్ రివల్యూషన్!!! జనం ఇచ్చింది... జనం కోసమే పంచాడు..! మార్క్ జూకర్బర్గ్ పేరు తెలియని వారుండరు. ఫేస్‌బుక్‌ను స్థాపించి మన జీవితాల్లో సంచలనమైన మార్పు తీసుకొచ్చిన జూకర్బర్గ్, ఆ ఫేస్‌బుక్‌తోనే బిలియనీర్‌గా అవతరించారు. 2015లో తనకు కూతురు పుట్టిన సందర్భంగా జూకర్బర్గ్ చేసిన ఓ ప్రకటన అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ ప్రకటనలో ఫేస్బుక్లో తన వాటాలోని మొత్తంలో 99% షేర్స్‌ను చారిటీకి ఉపయోగించనున్నట్లు స్పష్టం చేశారాయన. ఇందుకోసం భార్య చాన్‌తో కలిసి జూకర్బర్గ్, ‘చాన్ జూకర్బర్గ్ ఇనిషియేటివ్’ పేరుతో ఓ సంస్థను స్థాపించారు. ఫేస్బుక్ ద్వారా వచ్చిన సంపదను, జనం కోసమే పంచాలని జూకర్బర్గ్ తీసుకున్న ఈ నిర్ణయం వ్యక్తిగా ఆయన స్థాయిని మరింత పెంచింది. తెలుగు రాష్ట్రాల్లో సోషల్ రివల్యూషన్! టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో తెలుగు వారు ఎప్పుడూ ముందే ఉంటూ వస్తున్నారు. ఇప్పుడు సోషల్ మీడియాను వాడుకోవడంలోనూ అదే ఉత్సాహం కనబరుస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమకాలం నుంచే సోషల్ మీడియా బాగా ప్రాచుర్యంలోకి రాగా, ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలయ్యాక సోషల్ మీడియా ప్రభావం బాగా పెరిగింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో భూఆక్రమణ, రైతు సమస్యలకు సంబంధించిన పోస్ట్‌లు గత రెండు సంవత్సరాలుగా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అధికార పార్టీ టీడీపీ వైఫల్యాలను ప్రశ్నించడానికి సామాన్యుడు సోషల్ మీడియానే ప్రధానంగా వాడుకుంటున్నాడు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం సోషల్ మీడియాలో వచ్చే కొన్ని ఈ తరహా పోస్ట్‌లపై ఆంక్షలు విధించింది. ఇది ఫ్రీడం ఆఫ్ స్పీచ్‌కు వ్యతిరేకమని ప్రతిపక్ష పార్టీ వైఎస్సార్సీపీ పలు ఆందోళనలు కూడా చేపట్టింది. ట్రంప్‌పై ట్రోల్స్ అన్నీ ఇన్నీ కావు..! అమెరికా ప్రెసిడెంట్ ఎలక్షన్ వచ్చిందంటే సోషల్ మీడియాకు ఓ కొత్త కళ వచ్చిపడుతుంది. అధ్యక్ష పదవికి పోటీకి నిలబడ్డ వారి ప్రతీ విషయం నెటిజన్‌కు ఒక ట్రోలింగ్ ఆప్షనే! గతేడాది అమెరికా ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్, హిల్లరీ క్లింటన్ల మధ్య పోటీ కూడా సోషల్ మీడియాలో రోజూ హాట్ టాపిక్‌గా నడిచింది. ముఖ్యంగా ట్రంప్‌పై అమెరికా ప్రజలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న నెటిజన్ల నుంచి పెద్ద ఎత్తున ట్రోల్స్ వచ్చాయి. ఆయన అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక కూడా ఈ ట్రోల్స్ ఇప్పటికీ అలాగే సాగుతున్నాయి. రిపబ్లికన్ పార్టీ ట్రంప్‌ను అధ్యక్ష ఎన్నికలో అభ్యర్థిగా ప్రకటించిన నాటి నుండి ఇప్పటివరకూ ప్రతిరోజూ ఆయనపై ఏదో ఒక ట్రోల్ వస్తూనే ఉంది. – వి. మల్లికార్జున్ -
మినీ సామాజిక విప్లవం
గ్రంథం చెక్క అనువాదాలతోను, అనుకరణలతోను ప్రారంభమైన నాటకసాహిత్యం తొలిరోజుల్లో కేవలం పాఠ్యంగా మాత్రమే ఉండేది. సమాజంలో ఆనాడు ఉన్న కట్టుబాట్లకు విరుద్ధంగా కొందరు సాహసికులు ఆ నాటకాలను రంగస్థలం మీద ప్రదర్శించడానికి పూనుకోవడం ఒక మినీ సామాజిక విప్లవం అని చెప్పవచ్చు. 1860-70 ప్రాంతాల్లో ఈ ఉద్యమం ప్రారంభమై అచిరకాలంలోనే అటు నటులను, ఇటు సామాజికులను కూడా ఆకట్టుకుంది. ఆంగ్ల, సంస్కృత అనువాదాలతో పాటు పౌరాణిక, చారిత్రక నాటకాలు రాయడం ప్రారంభమైంది. ప్రాంతీయ జానపద నాటకాల నుంచి కొంత, ఇంగ్లీష్ సంపర్కంతో 19వ శతాబ్దం చివరి దశకంలో భారతదేశానికి వచ్చిన ఆంగ్లనాటక బృందాల నుంచి కొంత అప్పు తెచ్చుకొని ప్రతి ప్రాంతీయ నాటకరంగం ఒక విధమైన సంగీత నాటకాన్ని పెంచుకుంది. పార్శీ నాటకరంగం, దాని ప్రభావంతో పెరిగిన పలు ప్రాంతీయ నాటకరంగాలు ఇటువంటివే! ఏదైనా వస్తువు జనాన్ని ఆకట్టుకుంటే దానిని ప్రజలకు అందించడానికి సిద్ధపడే వర్తకమ్మన్యులు తయారుగా ఉంటారు. అట్లా ఏర్పడ్డదే వ్యాపార నాటకరంగం. ఎక్కడెక్కడ ఏ మంచి నటులున్నా ఒక చోట చేర్చి, వాళ్లకి నెలజీతాలు ఇచ్చి, ఎక్కడెక్కడ ఏ మంచి ‘ట్రిక్’ దొరికినా దానిని తమ నాటకంలో చొప్పించి మంచి ‘మసాలా’ నాటకాలను ప్రజలకు అందించిన ఘనత వీళ్లదే! ఒకవైపు వ్యాపార నాటకరంగం, మరొకవైపు దానిలోని వ్యాపారతత్వాన్ని నిరాకరించి, విజయవంతంగా నాటకం ప్రదర్శించాలనే ధ్యేయంతో బయలుదేరిన వృత్తినాటకరంగం...రెండూ ప్రేక్షకుల మన్ననల్ని పొందాయి. - గిరీశ్ కర్నాడ్ ‘నాగమండలం’ (తెలుగు అనువాదం) నాటకానికి మొదలి నాగభూషణ శర్మ రాసిన ముందుమాట నుంచి. -
ఫేస్బుక్ యువత.. కేర్‌ఫుల్
ఫేస్బుక్... యువ భావజాల సమ్మిళితానికి ఇదో వేదిక. ఆపదలో ఆత్మీయత పంచినా... అభిప్రాయాల వెల్లువలో అవధులు దాటినా అదో సామాజిక విప్లవమే. కాకపోతే మంచి పక్కనే నయవంచన ఉంటోంది. ఈ చెడు దారులే కట్టడికి కారణాలవుతున్నాయనేది హబ్సిగూడ విజ్ఞాన్ కాలేజీ విద్యార్థుల మనోభావం. ఫేస్‌బుక్‌పై సరదాగా సాగిన ఆ యువత మనోభావాలే ఈ వారం ‘క్యాంపస్ కబుర్లు’... పుష్ప: ఏయ్ ప్రవల్లిక... ఇందాకేంటి మీ సెక్షన్లో లెక్చరర్‌గారు ఏంటో క్లాస్ తీసుకుంటున్నారు? ప్రవల్లిక: ఎఫ్బీ తల్లీ! ఎవరిదో ఫొటో ఎవడో మార్ఫింగ్ చేశాడట. దాంతో సోమెనీ ప్రాబ్లమ్స్ వచ్చాయట. అమ్మాయిలంతా అలర్ట్‌గా ఉండమని చెబుతున్నారు. అఖిల: ఈ మగాళ్లంతా ఇంతే. ఫ్రెండ్షిప్గా చాట్ చేస్తే అడ్వాంటేజ్ తీసుకుంటారు. ఫేక్ ఐడీలు క్రియేట్ చెయ్యడం.. ఏడిపించడం మామూలైంది. వెంకటేష్: ఆగాగు... మగాళ్లంతా విలన్సేనా ఏంటి? మీ జాగ్రత్తలో మీరు ఉంటున్నారా? ప్రవల్లిక: కాకపోతే ఏంటి? పిక్చర్స్‌ను మార్ఫింగ్ చేయడం లేదా? అబ్బా రోజూ చీటింగ్ వార్తలు ఎన్ని వస్తున్నాయి. వెంకటేష్: ఛా... గర్ల్స్ చేయడం లేదా ఏంటి? ప్రవల్లిక: గర్ల్స్కేం అవసరం? ఎవరో ఒకళ్లు అలా చేస్తే..? వెంకటేష్: ఇక్కడా అంతే.. ఎవడో ఒకడు మిస్యూజ్ చేస్తే టోటల్‌గా మగాళ్లదే తప్పంటే ఎలా? అలాంటప్పుడు ఎఫ్‌బీలోకి రాకండి. పిక్చర్స్ పెట్టకండి. అఖిల: ఏదేమైనా... ఇలాంటి పనుల వల్ల పేరెంట్స్ కూడా రిస్ట్రిక్ట్ చేస్తున్నారు. ఎందుకమ్మా ఫేస్బుక్కే అతుక్కుంటావ్ అంటారు. మధు: కరెక్ట్... ఫేస్బుక్ ప్రయోజనాలపై అవగాహన అవసరం. దానివల్ల ఎన్నో అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఎక్కడో నా ఎల్కేజీ ఫ్రెండ్ ఈ మధ్య ఎఫ్బీ వల్లే కలిశాడు. సిమ్రాన్: మా పక్కన ఓ ఆంటీ... ఇంట్లో చేసే వంటకాలు ఎఫ్బీలోనే ప్రమోట్ చేసుకుంది. ఇప్పుడు ఫుల్ బిజీ. బిజినెస్ యాంగిల్లో మోర్ యూజ్‌ఫుల్. ప్రవల్లిక: ఎస్... ఎస్... అమెరికాలో ఉన్న రిలెటివ్స్ను రోజూ విష్ చేస్తున్నాం. ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నాం. మా పేరెంట్స్ కూడా హ్యాపీగా ఫీలవుతున్నారు. హబీబ్ సిమ్రాన్: కొన్ని సమస్యలున్న మాట నిజమే కానీ... ఉపయోగాలూ ఎక్కువే. కాకపోతే ప్రాబ్లమ్స్ వల్ల పేరెంట్స్ కొంత అబ్జెక్ట్ చేస్తున్నారు. మధు: ఆ ప్రాబ్లమ్స్ ధైర్యంగా బయటకు ఎందుకు చెప్పరు? ప్రతిదానికి నిందలేసి ఊరుకోవడం కాదు. వెంకటేష్: అందుకే జాగ్రత్తలు తీసుకోవాలంటున్నా. అన్నోన్ ఐడీని ఎందుకు యాక్సెప్ట్ చేయాలి? అఖిల: అలా నెగెటివ్‌గా ఆలోచించి వెళ్లాలంటే ఎలా వీలవుతుంది! నువ్వు అన్నది నిజమే కావచ్చు. రిక్వెస్ట్ పంపే వ్యక్తి మంచోడని అనుకుంటాం. మధు: పరిమితులు దాటినప్పుడే సమస్యలొస్తున్నాయి. పేపర్లలో వచ్చే వార్తలు క్లియర్‌గా చదవండి. ఎక్కడో అమ్మాయిలూ రాంగ్రూట్లో వెళ్తున్నారు. బహుశా అవగాహన లోపం కావచ్చు. సృజన: ఈ మధ్య ఓ వార్త చదివా. ప్రమాద సమయాల్లో రక్తం కావాల్సి వస్తే మెయిన్‌గా సోషల్ మీడియాపైనే డిపెండ్ అవుతున్నారట. వుంచి రెస్పాన్స్ కూడా వస్తోందట. పుష్ప: ఫేస్బుక్లో మెజారిటీ యూత్ ఉంటున్నారు. వాళ్లతో పాటు డిఫరెంట్ ఫీల్డ్స్‌లో ఉన్న ఎక్స్‌పర్ట్స్‌తోనూ లింక్ అవ్వాలి. దీనివల్ల మనకు నాలెడ్జ్ పెరుగుతుంది. వెంకటేష్: యుూ ఆర్ రైట్. మిస్యూజ్ చేసేవాళ్లపై నిఘా కూడా అవసరం. అఖిల: అవును. తల్లిదండ్రులకు దీనిపై అవగాహన కల్పించాలి. కాలేజీ యాజమాన్యాలు కూడా ‘మీ అమ్మాయిని ఫేస్‌బుక్‌కు దూరంగా ఉంచండి’ అని చెబుతున్నారే తప్ప... ఎందుకో వివరించడం లేదు. ప్రవల్లిక: ఎనీ హౌ... లెక్చరర్స్ ఏం చెప్పినా... అమ్మానాన్నా ఎంత కట్టడి చేసినా... ఫేస్బుక్ యూజ్‌ఫుల్. కాకపోతే కొన్ని ఇబ్బందుల నుంచి అంతా అప్రమత్తంగా ఉండాల్సిందే. - వనం దుర్గాప్రసాద్