కొత్త పుస్తకాలు: కృష్ణాతీరం
రచన: కంచల జయరాజ్
పేజీలు: 196; వెల: 130
ప్రతులకు: మైత్రేయీ పబ్లికేషన్స్, 11-112-41ఎ, ఓల్డ్ ఇండియన్ గ్యాస్ స్ట్రీట్, గుడివాడ, కృష్ణాజిల్లా.
ఫోన్: 9848992299
నేను బానిసనా? (పోలీసు దుఃఖం-నవల)
రచన: వరకుమార్ గుండెపంగు
పేజీలు: 254; వెల: 150
ప్రతులకు: రచయిత, సన్నాఫ్ భిక్షం, 5-94, అంబేద్కర్ విగ్రహం దగ్గర, బేతవోలు గ్రామం, చిలుకూర్ మండలం, నల్గొండ. ఫోన్: 9948541711
శివారెడ్డి కవిత్వం: పరిణామ వికాసాలు
రచన: పెన్నా శివరామకృష్ణ
పేజీలు: 222; వెల: 100
ప్రతులకు: ప్రధాన పుస్తకకేంద్రాలతోపాటు, రచయిత, ఫ్లాట్ నం. 203, సాయి నిలయం అపార్ట్‌మెంట్స్, రోడ్ నం. 9, వెంకటేశ్వర కాలనీ, సరూర్‌నగర్, హైదరాబాద్-35. ఫోన్: 9440437200
వీవర్స్ అండ్ లూమ్స్ (డా.రాధేయ దీర్ఘకావ్యం ‘మగ్గంబతుకు’ ఆంగ్లానువాదం)
అనువాదం: డా.పి.రమేష్ నారాయణ
పేజీలు: 132; వెల: 100
ప్రతులకు: డా.రాధేయ, కవితానిలయం, 13-1-606-1, షిరిడి నగర్, రెవిన్యూ కాలనీ, అనంతపురం-515001.
ఫోన్: 9985171411
మశాల్ -తెలంగాణ మహోద్యమ కావ్యం (దీర్ఘ కవిత)
రచన: వనపట్ల సుబ్బయ్య
పేజీలు: 192; వెల: 100
ప్రతులకు: ఎం.సుబ్బయ్య, భార్గవి హెయిర్ స్టైల్స్, నల్లవెల్లి రోడ్, బస్టాండ్ దగ్గర, నాగర్‌కర్నూల్-509209, మహబూబ్‌నగర్. ఫోన్: 9492765358
నెత్తుటి భాష (కవిత్వం)
రచన: షహెబాజ్ అహ్మద్ ఖాన్
పేజీలు: 88; వెల: 60
ప్రతులకు: పెద్ద పుస్తకాల షాపులతోపాటు, ఘటన ముద్రణ, జె.సిహెచ్.బసవయ్య, 4-114/2/2, రూరల్ పోలీస్‌స్టేషన్ ఎదురుగా, భవానినగర్, కోదాడ పోస్ట్, నల్గొండ-508206
ఏటిలో పడవలు
‘నా కథల్లో సామాజిక స్పృహ అనేది లేదని నాకు అర్థమైంది’ అని మొదలయ్యే తొలివాక్యంతోనే జానకీరాణి సంకలనంలో ఏదో దొరకగలదన్న సంకేతం అందుతుంది. ‘శ్రామిక జనం కథలు రాయడం నాకు చేతకాదు. వారి జీవితాలను గురించి ఒక అలజడి పొందడం తప్ప, జీవన చిత్రణ నాకు సాధ్యం కాదు,’ అన్న నిజాయితీ కట్టిపడేస్తుంది. భర్తృహరి నీతి శతకంలోని పద్యపాదాలు ‘తెలివియొకించుక లేని యెడ’, ‘ఇంచుక బోధశాలినై’తోపాటు ‘వాస్తవగాథలు’ అనే మూడు విభాగాలుగా ఉన్న 76 కథల సమగ్ర సంపుటి ఇది. 1950లనుంచి ఇటీవలిదాకా రాసినవి!
‘చిగురు తొడిగింది’ కథలో శనివారాలు ఉపవాసం ఉండే అత్తగారు ఏమి తింటున్నారో ఇన్నాళ్లూ తనకు తెలియనేలేదని కోడలు కుసుమ ఒక చిన్న సంభాషణ ద్వారా రియలైజ్ అయినట్టు చాలా సున్నితంగా చెబుతారు రచయిత్రి. ఇందులో సామాజిక స్పృహ లేదనలేము. కానీ ఆ స్పృహ మీద కమ్ముకునివున్న భావనలు ఆమెతో అలా అనిపించివుంటాయి. ‘జీవిత సత్యాలు’ కథ యౌవనపు ఆకర్షణను సుతిమెత్తగా చెబుతుంది. అలా ఎందుకు జరిగిందో మథనపడుతున్న ఇల్లాలితో భర్త అంటాడు: ‘పిచ్చిపిల్లా, అతను మొగవాడు. నువ్వు ఆడదానివి... మిగిలినవిషయాలు నిమిత్తమాత్రాలు!’ ఇక, ‘కాకి పిల్ల కాకికి’, ‘చిరిగిపోయిన కథ’లాంటివి రచయితల జీవితాల్లోంచే పుట్టుకురాగలిగేవి.
పోరంకి దక్షిణామూర్తి అన్నట్టు, ‘ఆమె భాషాశైలి హాయిగా, సరళంగా ఏట్లో పడవలా’ సాగిపోతుంది.
- ఆర్.ఆర్.
తురగా జానకీరాణి కథలు
పేజీలు: 432; వెల: 250 (హార్డ్‌బౌండ్)
ప్రతులకు: తురగా ఫౌండేషన్, 29, జర్నలిస్ట్స్ కాలనీ, రోడ్ నం.3,
బంజారాహిల్స్, హైదరాబాద్-34.
ఫోన్: 9848429169