ఆ జీవుల పాలు... అద్భుతమైన యాంటీబయాటిక్... | tasmanian devil milk Antibiotic | Sakshi
Sakshi News home page

ఆ జీవుల పాలు... అద్భుతమైన యాంటీబయాటిక్...

Published Sun, Oct 30 2016 12:03 AM | Last Updated on Mon, Sep 4 2017 6:41 PM

ఆ జీవుల పాలు... అద్భుతమైన యాంటీబయాటిక్...

ఆ జీవుల పాలు... అద్భుతమైన యాంటీబయాటిక్...

టాస్మేనియన్ డెవిల్స్ అనే జీవులు పేరుకు మాత్రమే భయంకరంగా ఉంటాయి. కానీ చాలా అమాయకమైన జీవులవి. అయితే పేరులోని ఆ డెవిల్స్ అనే మాట ఎంతకూ లొంగని బ్యాక్టీరియా పాలిట నిజంగా డెవిలే. అలా మానవులకు ఒక వరప్రదాయనులు ఆ డెవిల్స్. మెథిసిలిన్ రెసిస్టెంట్ స్టెఫాలోకాకస్ ఆరియస్ (ఎమ్‌ఆర్‌ఎస్‌ఏ) అనేది ఒక రకమైన బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. ఇది సాధారణంగా ఏ యాంటీబయాటిక్స్‌కూ లొంగదు.
 
  దీన్ని కూడా లొంగదీయగల సామర్థ్యం టాస్మేనియన్ డెవిల్స్ పాలలో ఉంటుందంటున్నారు సిడ్నీ యూనివర్సిటీ పరిశోధకులు. ఈ క్షీరదాలలో ఉండే పాలలోని ‘క్యాథెలిసిడిన్స్’ అనే పదార్థాల్లో ఎంతకీ లొంగని బ్యాక్టీరియాను సైతం ఎదుర్కొనే  శక్తి ఉంటుందంటున్నాడు కనుగొన్నారు ఎమ్మా పీల్ అనే పరిశోధకురాలు. ఆస్ట్రేలియాలో జరిగిన ఈ అధ్యయనం వివరాలను  ఆమె వెల్లడించారు. ఈ పాల మహత్యం నేచర్ జర్నల్ అనే సైంటిఫిక్ మ్యాగజైన్‌లో ప్రచురితమైంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
Advertisement