వారఫలాలు: 7ఆగస్టు నుంచి 13ఆగస్టు, 2016 వరకు | vaara phalalu | Sakshi
Sakshi News home page

వారఫలాలు: 7ఆగస్టు నుంచి 13ఆగస్టు, 2016 వరకు

Published Sun, Aug 7 2016 12:43 PM | Last Updated on Mon, Sep 4 2017 8:17 AM

vaara phalalu

7ఆగస్టు నుంచి 13ఆగస్టు, 2016 వరకు
 

 మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
 పలుకుబడి మరింత పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. సన్నిహితుల నుంచి మాట సాయం అందుతుంది. నిరుద్యోగులకు నూతనోత్సాహం. అనుకోని సంఘటనలు ఆశ్చర్యపరుస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార లావాదేవీలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు. గులాబి, తెలుపు రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. అన్నపూర్ణాష్టకం పఠించండి.
 
 వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోిహ ణి, మృగశిర 1,2 పా.)
 ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో వివాదాలు తీరతాయి. ఆస్తుల వివాదాల నుంచి బయటపడతారు. దూరపు బంధువుల నుంచి శుభవార్తలు. ఇంటి నిర్మాణయత్నాలు కలిసి వస్తాయి. ప్రముఖులతో పరిచయాలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులు సమర్థంగా విధులు నిర్వహించి ప్రశంసలు పొందుతారు. కళారంగాల వారికి విదేశీ పర్యటనలు. లేత పసుపు, చాక్లెట్ రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్ చాలీసా పఠించండి.
 
 మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
 ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది. ధనవ్యయం. కుటుంబసభ్యులతో వివాదాలు. ఇంటాబయటా బాధ్యతలు పెరుగుతాయి. విద్యార్థుల యత్నాలు ముందుకు సాగవు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఆరోగ్యభంగం. శ్రమ పడ్డా ఫలితం కనిపించదు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు ఆకస్మిక బదిలీలు ఉండవచ్చు. రాజకీయవర్గాలకు నిరుత్సాహం. ఆకుపచ్చ, లేత ఎరుపు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.
 
 కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
 ఆదాయం కంటే ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగావకాశాలు కొన్ని దూరం కాగలవు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబబాధ్యతలు పెరుగుతాయి. ఆరోగ్యపరంగా చికాకులు తప్పవు. మిత్రులతో అకారణంగా విభేదాలు ఏర్పడవచ్చు. ప్రతి నిర్ణయంలోనూ తొందరపాటు వద్దు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగులకు పనిభారం. పారిశ్రామికవర్గాలకు గందరగోళంగా ఉంటుంది. ఎరుపు, నేరేడు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి.
 
 సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
 బంధువులతో కొత్త సమస్యలు ఏర్పడవచ్చు. ఆలోచనలు కలసిరావు. రాబడి తగ్గి అప్పులు చేయాల్సివస్తుంది. నిరుద్యోగుల యత్నాలలో అవాంతరాలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ప్రారంభించిన కొన్ని పనులను మధ్యలోనే వాయిదా వేస్తారు. వ్యాపార లావాదేవీలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు. రాజకీయవర్గాలకు చికాకులు. గులాబి, మెరూన్ రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి.
 
 కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
 కొత్త కార్యక్రమాలు ప్రారంభిస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. రావలసిన బాకీలు వసూలవుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి. నిరుద్యోగులకు ముఖ్యసమాచారం అందుతుంది. వ్యాపారాలు పురోగతిలో కొనసాగుతాయి. ఉద్యోగులకు ఉన్నతహోదాలు తథ్యం. పారిశ్రామికవర్గాలకు సన్మానాలు. ఆకుపచ్చ, తెలుపు రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. హయగ్రీవస్తోత్రాలు పఠించండి.
 
 తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
 కష్టించినా ఫలితం కనిపించదు. అనుకున్న పనులు ముందుకు సాగవు. బంధువులు, మిత్రులతో అకారణ వైరం. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. విద్యార్థులు, నిరుద్యోగులు మరింత శ్రమ పడాలి. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగులు కొంత నిరాశ చెందుతారు. రాజకీయవర్గాలకు కొన్ని ఇబ్బందులు ఎదురుకావచ్చు. నీలం, నేరేడురంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి.
 
 వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
 ఆసక్తికరమైన విషయాలు తెలుస్తాయి. నిరుద్యోగుల యత్నాలు సఫలం. శుభకార్యాలు నిర్వహిస్తారు. వాహనాలు, భూములు కొంటారు. అదనపు ఆదాయం సమకూరుతుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుతాయి. ఉద్యోగులకు ఉన్నతహోదాలు. కళాకారులకు ఆహ్వానాలు అందుతాయి. ఎరుపు, లేత పసుపురంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుధ్యానం చేయండి.
 
 ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
 పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. కొత్త కార్యాలు చేపడతారు. కుటుంబంలో శుభకార్యాలపై చర్చలు. బంధువులు, మిత్రుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. ఇంతకాలం పడిన శ్రమ  ఫలిస్తుంది. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపార లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు దక్కవచ్చు. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. లేత ఆకుపచ్చ, తెలుపు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. రాఘవేంద్రస్వామి స్తోత్రాలు పఠించండి.
 
 మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
 ఆర్థిక వ్యవహారాలలో పురోగతి. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవమర్యాదలు పొందుతారు. నిరుద్యోగులకు ఒక సమాచారం సంతోషం కలిగిస్తుంది. ప్రముఖులతో ఉత్తర ప్రత్యుత్తరాలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. భూవివాదాలు తీరతాయి. సన్నిహితుల ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు లాభాల దిశగా సాగుతాయి. ఉద్యోగులకు  పదోన్నతులు. పారిశ్రామికవర్గాలకు నూతనోత్సాహం. నలుపు, నేరేడు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠిచండి.
 
 కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
 వ్యవహారాలలో ఆటంకాలు. మిత్రులతో అకారణంగా విభేదాలు. ఆరోగ్యసమస్యలు వేధిస్తాయి. కొన్ని నిర్ణయాలు వాయిదా వేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. దైవదర్శనాలు చేసుకుంటారు. దూరపు బంధువులను కలుసుకుంటారు. విద్యార్థుల యత్నాలు ముందుకు సాగవు. వ్యాపారాలలో కొద్దిపాటి చికాకులు. ఉద్యోగులకు ఒత్తిడులు. కళాకారులకు నిరుత్సాహం. నీలం, లేత ఆకుపచ్చ రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. నవగ్రహస్తోత్రాలు పఠించండి.
 
 మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
 రాబడికి మించిన ఖర్చులు ఎదురవుతాయి. అనుకున్న పనుల్లో ఆటంకాలు. ఇంటాబయటా సమస్యలు చికాకు పరుస్తాయి. అనుకున్నదొక్కటి జరిగేది వేరొకటిగా ఉంటుంది. ఆరోగ్యంపై కొంత శ్రద్ధ చూపండి. శ్రమ తప్ప ఫలితం ఉండదు. స్థిరాస్తి వివాదాలు నెలకొంటాయి. వ్యాపారాలలో లాభాలు స్వల్పంగా ఉంటాయి. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు. రాజకీయవర్గాలకు పర్యటనల్లో మార్పులు. ఎరుపు, ఆకుపచ్చరంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. దత్తాత్రేయస్తోత్రాలు పఠించండి.

సింహంభట్ల సుబ్బారావు
జ్యోతిష్య పండితులు

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement