వారఫలాలు : 18 సెప్టెంబర్ నుంచి 24 సెప్టెంబర్ 2016 వరకు | vaara phalalu | Sakshi
Sakshi News home page

వారఫలాలు : 18 సెప్టెంబర్ నుంచి 24 సెప్టెంబర్ 2016 వరకు

Published Sun, Sep 18 2016 2:08 AM | Last Updated on Mon, Sep 4 2017 1:53 PM

వారఫలాలు : 18 సెప్టెంబర్ నుంచి 24 సెప్టెంబర్ 2016 వరకు

వారఫలాలు : 18 సెప్టెంబర్ నుంచి 24 సెప్టెంబర్ 2016 వరకు

మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
కొత్త కార్యక్రమాలు చేపడతారు.  విద్యాయత్నాలు సానుకూలం. విచిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. సేవాభావంతో ముందుకు సాగుతారు. శుభవర్తమానాలు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. కాంట్రాక్టులు దక్కించుకుంటారు. వ్యాపారాలు లాభిస్తాయి ఉద్యోగులకు హోదాలు. కళాకారులు కొత్త అవకాశాలు దక్కించుకుంటారు. గులాబీ, లేత ఎరుపురంగులు,  పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. నృసింహస్తోత్రాలు పఠించండి.
 
వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోిహ ణి, మృగశిర 1,2 పా.)
కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. చేపట్టిన కార్యక్రమాలు సాఫీగా పూర్తి కాగలవు. సోదరులు, స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.  బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు విస్తరిస్తారు.  ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం. రాజకీయవర్గాలకు పదవులు దక్కుతాయి. నీలం, పసుపు రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.
 
మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
ఆదాయం పెరిగి అవసరాలు తీరతాయి. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. దేవాలయాలు సందర్శిస్తారు. బంధువులు, స్నేహితులతో విభేదాలు తొలగుతాయి. కొత్త కాంట్రాక్టులు పొందుతారు. నిరుద్యోగులకు కీలక సమాచారం. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో అనుకూలత. ఉద్యోగాలలో ఆటంకాలు తొలగుతాయి.  కళాకారులకు సన్మానాలు. నేరేడు, ఆకుపచ్చ రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి.
 
కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
నూతన కార్యక్రమాలు చేపడతారు. రాబడి మరింత పెరుగుతుంది. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. పని ఒత్తిడి పెరుగుతుంది. స్వల్ప అనారోగ్యం.  విద్యార్థులు, నిరుద్యోగులు అనుకున్న లక్ష్యాల వైపు సాగుతారు. ఇంతకాలం పడిన కష్టం ఫలిస్తుంది. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు. తెలుపు, లేత గులాబీరంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.
 
సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
అదనపు రాబడి ఉంటుంది. సన్నిహితులు,స్నేహితులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. ఆస్తి వివాదాలు సానుకూలంగా పరిష్కారమవుతాయి. వివాహ, ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. కార్యజయం. శుభకార్యాలు నిర్వహిస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది.  వృత్తి వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి. కళాకారులకు ఊహించని అవకాశాలు అందివస్తాయి. ఎరుపు, గులాబీ రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశ్ స్తోత్రాలు పఠించండి.
 
కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. తలపెట్టిన కార్యక్రమాలలో విజయం. శుభకార్యాలకు డబ్బు వెచ్చిస్తారు. విలువైన సామగ్రి కొనుగోలు చేస్తారు. ఆత్మీయులతో ఆనందంగా విందు వినోదాలతో గడుపుతారు. మీ సేవలకు గుర్తింపు లభిస్తుంది. స్వల్ప అనారోగ్యం. వ్యాపార విస్తరణయత్నాలు. అనుకూలిస్తాయి. ఉద్యోగస్తులకు ఇంక్రిమెంట్లు. కళాకారులకు సన్మానాలు. ఆకుపచ్చ, నలుపు రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్ చాలీసా పఠించండి.
 
తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
రావలసిన సొమ్ము అంది అవసరాలు తీరతాయి. సంఘంలో పరపతి పెరుగుతుంది. స్నేహితుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. కార్యక్రమాలు అనుకున్నట్టే సాగుతాయి. ఆరోగ్య సమస్యలు తీరతాయి. భాగస్వామ్య వ్యాపారాలలో అభివృద్ధి. ఉద్యోగస్తులకు హోదాలు దక్కుతాయి. రాజకీయవర్గాలకు పదవీయోగం. పసుపు, నేరేడు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. శివపంచాక్షరి పఠించండి.
 
వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
కొత్త వ్యక్తులు పరిచయం. శుభకార్యాలకు హాజరవుతారు. స్నేహితులు, బంధువులతో తగాదాలు తీరతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఒక ప్రకటన నిరుద్యోగులను ఆకట్టుకుంటుంది. స్వల్ప అనారోగ్యం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి. కళాకారులకు అవార్డులు దక్కవచ్చు. ఎరుపు, లేత ఆకుపచ్చ రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి.
 
ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
రహస్య విషయాలు తెలుసుకుంటారు. విద్యార్థుల ప్రతిభ వెలుగుచూస్తుంది. తలపెట్టిన కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. ఆలోచనలు అమలు చేస్తారు. అనుకున్న ఆదాయం సమకూరుతుంది. కుటుంబసభ్యుల నుంచి ప్రోత్సాహం.  దేవాలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు రాగలవు. రాజకీయవేత్తలకు విదేశీయానం. గులాబీ, పసుపు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుధ్యానం చేయండి.
 
మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
కొత్త కార్యక్రమాలు ప్రారంభిస్తారు. స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. అందరిలోనూ గుర్తింపు లభిస్తుంది. నిరుద్యోగులకు భవిష్యత్‌పై ఆశలు చిగురిస్తాయి. కొత్త కాంట్రాక్టులు పొందుతారు. వాహనసౌఖ్యం. దూరపు బంధువుల కలయిక. విందువినోదాలు. ఇంటి నిర్మాణ యత్నాలు కలసివస్తాయి. వ్యాపారాలలో అనుకున్న లాభాలు దక్కుతాయి. ఉద్యోగాలలో కొత్త హోదాలు. కళాకారులకు అవకాశాలు దగ్గరకు వస్తాయి. ఆకుపచ్చ, లేత పసుపు రంగులు.  దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. అన్నపూర్ణాష్టకం పఠించండి.
 
కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
ఆదాయం కంటే ఖర్చులు పెరుగుతాయి. తలపెట్టిన కార్యక్రమాలలో అవరోధాలు ఎదురవుతాయి. కుటుంబంలో చికాకులు. మనశ్శాంతి లోపిస్తుంది. దేవాలయాలు సందర్శిస్తారు. ఆరోగ్యభంగం. విద్యార్థులకు ఒత్తిడులు. వృథాశ్రమ తప్ప ఫలితం కనిపించదు.  వ్యాపారాలలో  సమస్యలు తీరతాయి.  ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి.  కళాకారులకు ఒడిదుడుకులు. లేత నీలం, నలుపు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. హయగ్రీవస్తోత్రాలు పఠించండి.
 
మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
శుభకార్యాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి.  విద్యార్థుల్లో నైపుణ్యం వెలుగులోకి వస్తుంది. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. స్థిరాస్తి వివాదాలు తీరతాయి.  వాహన, గృహయోగాలు.  వ్యాపారాలు విస్తరిస్తారు, కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగస్తులకు ఉన్నతహోదాలు తథ్యం. పారిశ్రామికవేత్తలకు అనుకోని అవకాశాలు. గులాబీ, లేత ఎరుపు రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి.
- సింహంభట్ల సుబ్బారావు, జ్యోతిష్య పండితులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement