రక్తం అంటే ఎర్రగానే ఉంటుందా? | What Is the Blood Red or Yellow? | Sakshi
Sakshi News home page

రక్తం అంటే ఎర్రగానే ఉంటుందా?

Published Sat, Sep 3 2016 11:26 PM | Last Updated on Wed, Apr 3 2019 4:24 PM

రక్తం అంటే ఎర్రగానే ఉంటుందా? - Sakshi

రక్తం అంటే ఎర్రగానే ఉంటుందా?

అపోహ - వాస్తవం
రక్తం అనగానే ఎర్రటి రంగే గుర్తుకు వస్తుంది. మానవ రక్తంతో పాటు చాలా జీవుల్లో ఉండే రక్తం ఎర్రగా ఉండటానికి కారణం అందులో ఉండే హీమోగ్లోబిన్ అనే ఎరుపు రంగును ఇచ్చే పిగ్మెంట్. మన రక్తంలో ఆక్సిజన్‌ను తీసుకెళ్లే హీమోగ్లోబిన్ అనే  ఇనుము ఆధారిత పదార్థం వల్ల రక్తానికి ఈ ఎరుపు రంగు వస్తుంది. ఇక వెన్నెముక కలిగిజ జీవుల్లోనేఏ గ్రీన్ బ్లడెడ్ స్కింక్స్ అనే ఒక రకం బల్లుల రక్తం ఆకుపచ్చరంగులో ఉంటుంది. మనకు ఇనుము ప్రధానంగా ఉన్నట్లే... కొన్ని రకాల పీతల్లోని రక్తం కాపర్‌ను కలిగి ఉంటుంది. కాపర్ ప్రధానంగా ఉండే ఈ రకాలకు చెందిన పీతల  (క్రాబ్స్) రక్తం నీలం రంగులో ఉంటుంది.

ఇలా నీలం రంగులో రక్తం కనిపించడానికి  హీమోసయనిన్ అనే నీలిరంగును ఇచ్చే పదార్థమే కారణం. ఇక బొద్దింక (కాక్రోచ్) రక్తంలో ఎర్ర రంగు లోపించడం వల్ల వాటి రక్తం తెల్లరంగులో ఉంటుంది. అన్నట్లు కొన్ని కీటకాల రక్తం పసుపుపచ్చ రంగులోనూ ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement