రూపాయిని శాసిస్తున్న ‘ట్రంప్‌’! | Article On Donald Trump Role In Fuel Prices Hike In India | Sakshi
Sakshi News home page

Published Tue, Oct 16 2018 12:58 AM | Last Updated on Tue, Oct 16 2018 10:50 AM

Article On Donald Trump Role In Fuel Prices Hike In India - Sakshi

రెండు విధాలా మన ఆర్థిక వ్యవస్థకు ‘క్షవరం’ చేసే దుర్మార్గపు వ్యూహానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ దిగారని మరచిపోరాదు. అమెరికా పాలకులతో సైనిక విన్యాసాలు యథేచ్ఛగా కొనసాగిస్తున్నా భారత కరెన్సీ విలువను మాత్రం కోతపెట్టే చర్యలను ట్రంప్‌ మానుకోవడం లేదు. ఇండియాలో నోట్ల రద్దు ఫలితంగా ఆటోరిక్షా ప్రయాణ చార్జీల కన్నా విమాన ప్రయాణ చార్జీలు తక్కువ అని కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి జయంత్‌ సిన్హా చమత్కరించారంటే–ఈ కుట్ర ఏ దశకు చేరిందో ఊహించవచ్చు. ఈ పరిస్థితుల మధ్యనే మన ఆర్థిక వ్యవస్థపై ట్రంప్‌ ప్రారంభించిన దాడిని మోదీ ఎదుర్కొనలేకపోతున్నారు.

నిరంతరం పెరుగుతున్న చమురు (పెట్రోల్, డీజిల్‌) ధరల మధ్య రూపాయి కోలు కునే పరిస్థితి లేదు. – డాక్టర్‌ సునీల్‌ కుమార్, ఆర్థికవేత్త, డైరెక్టర్‌ పబ్లిక్‌ ఫైనాన్స్‌

అవసరమైతే మరోసారి నోట్ల రద్దుకు (డీమానిటైజేషన్‌) సిద్ధపడతా మని నీతి ఆయోగ్‌ ఉపాధ్యక్షుడు రాజీవ్‌కుమార్‌ గొప్పగా ప్రకటించుకు న్నారు. దేశ ఆర్థిక వినాశనం గురించి అంత అహంకారంతో మాట్లాడడం ఇంతకు ముందు ఎరగం. నీతి ఆయోగ్‌ అధ్యక్షునిగా ప్రధాని మోదీ ఈ అభిప్రాయాన్ని బలపరుస్తున్నట్టా, లేదా? ఆయనదీ అదే మాటా?– రమేష్‌కుమార్‌ హిందీ పాఠానికి చిత్రా పద్మనాభన్‌ అనువాదం,ద వైర్, వెబ్‌సైట్, 8–10–18

ఈ పరిస్థితుల్లో రూపాయి పతనాన్ని కేంద్రప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల నిలువరించలేకపోతున్నామని ప్రసిద్ధ ఆర్థికవేత్త అభిక్‌ బారువా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మొత్తం విష పరిణామానికి ప్రధాన కారణం అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఇటీవల ఆసియా దేశాల ఆర్థిక వ్యవ స్థల ఉనికిని దెబ్బతీసేందుకు ప్రారంభించిన వాణిజ్య యుద్ధ బెదిరిం పులు. ప్రపంచదేశాలపైన అమెరికా పెత్తనం క్రమంగా తగ్గుతోంది. వలస పాలన నుంచి విముక్తి పొంది సొంత ఆర్థికవ్యవస్థలను ఏర్పాటు చేసుకుని నిలదొక్కుకుంటున్న వర్థమాన దేశాలను తుంచి వేయడానికి అమెరికా సిద్ధమైంది. ఈ కుట్రలో భాగంగా ఈ ఆర్థికవ్యవస్థలకు అవసర మైన చమురు వనరులు లభ్యంకాకుండా ఉండేందుకు ఇరాన్‌ తదితర అరబ్‌ దేశాలపైన, చైనా, ఇండియాపైన ఆంక్షలు విధిస్తోంది అమెరికా. చాలా కాలంగా ఇరాన్‌ నుంచి మనం తెచ్చుకుంటున్న ఆయిల్‌ దిగుమ తులపై  ఆంక్షలు పెడుతోంది. మరోవైపు ఇండియా, చైనా తమ అభి వృద్ధిలో భాగంగా పొందుతున్న సబ్సిడీలను నిలిపివేయాలని నిర్ణయిం చిన అమెరికా తగు చర్యలు తీసుకుంటోంది. ఇప్పటిదాకా ఇండియా గత పాతికేళ్లుగా అంతర్జాతీయ వాణిజ్యం ద్వారా సమకూర్చుకున్న విదేశీ మారకం నిల్వలతో తన కరెన్సీ విలువను కాపాడుకుంటూ వస్తోంది. కాని, బీజేపీ అధికారంలోకి వచ్చిన కొద్ది కాలానికే ఆ నిల్వలు  కాస్తా కరిగిపోతున్నాయి.

విదేశీ పెట్టుబడులపై ఆధారం
అటు కాంగ్రెస్‌–యూపీఏ పాలనలో, ఇటు బీజేపీ–ఎన్డీఏ హయాం లోనూ ప్రపంచబ్యాంక్, అంతర్జాతీయ ద్రవ్యనిధి(ఐఎంఎఫ్‌) సలహాలు, అదుపాజ్ఞల్లో దేశ ఆర్థిక వ్యవస్థను నడపడానికి  ప్రయత్నం జరిగింది. ఫలితంగా దేశప్రజల మౌలికప్రయోజనాలు దెబ్బతింటూ వచ్చాయి. మొత్తం ఆర్థిక వ్యవస్థ స్వతంత్ర పంథాలో కాకుండా అత్యధిక భాగం విదేశీ పెట్టుబడులపై ఆధారపడే పరిస్థితి వచ్చింది. దీంతో మన రాజ కీయ ఆర్థిక స్వాతంత్య్రాన్ని కాపాడుకోవాల్సిన దుస్థితిలో చిక్కుకున్నాం. కాని, సోషలిస్టు ఆర్థిక వ్యవస్థ పరిధిల్లోనే అమెరికా పెత్తనానికి గండి కొడుతూ చైనా రిపబ్లిక్‌ ప్రపంచంలోనే నంబర్‌వన్‌ ఆర్థిక వ్యవస్థగా అవ   తరించింది. అమెరికా ఆర్థిక వ్యవస్థ ప్రతిపత్తిని రెండో స్థానానికి నెట్టేయ బోతున్న సమయంలో వాణిజ్య యుద్ధంలో భాగంగా చైనాపై అమెరికా ఆయుధం ఎక్కుపెట్టింది. చైనా, దక్షిణ కొరియా వస్తు సముదాయంతో అమెరికా మార్కెట్లు దశాబ్దాలుగా నిండిపోతూనే ఉన్నాయి. అమెరికా ఆర్థిక వ్యవస్థ చిరకాలంగా ‘పరాన్నభుక్కు’గా, ‘సోమరిపోతు’గా పేరు పొందింది. వలస దేశాల సంపదను, ప్రజలను నిరంతరాయంగా దోచుకుని గడించిన సంపద వల్లే అమెరికా ఈ స్థితికి చేరింది. ఇందులో భాగంగానే ఇండియా వంటి దేశాల కరెన్సీలను అమెరికా డాలర్‌కు బందీలుగా చేశారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ‘బ్రెటన్‌వుడ్స్‌’ సమావేశంలో ఇది జరిగింది. ఈ దోపిడీ బంధం సరాసరి బ్రిటిష్‌ కరెన్సీ పౌండ్‌ స్టెర్లింగ్‌తో ప్రారంభమైంది. మన రూపాయి ఇప్పటికీ ఈ చిక్కు ముడిని విదిలించుకుని, పుంజుకోలేకపోతోంది. కానీ, సోషలిస్ట్‌ రిప బ్లిక్‌గా ప్రయాణం ప్రారంభించిన చైనా కొన్ని దశాబ్దాల తర్వాత ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టి బలోపేతమైంది. అమెరికా కరెన్సీకి పోటీగా తన కరెన్సీని నిలబెట్టి కాపాడుకుంటూ వస్తోంది. భారీ స్థాయిలో ప్రజావసర సరకులు తన ప్రజలకే గాక, ప్రపంచ దేశాల ప్రజా బాహు ళ్యానికి సైతం సరసమైన ధరలకు చైనా అందజేస్తోంది. రోదసీ పరిశోధన సహా సాంకేతిక రంగాల్లో గణనీయ స్థానానికి చేరుకుని, నేడు ప్రపం చంలోనే అమెరికాను తోసిరాజని అగ్రగామి స్థానాన్ని చైనా కైవసం చేసుకోబోతోంది. 

చైనాతో మొదలైన తొలి వాణిజ్యయుద్ధం!
సరిగ్గా ఈ దశలోనే మొట్టమొదటి వాణిజ్య యుద్ధాన్ని చైనాతోనే ట్రంప్‌ ప్రకటించారు. ఆ వరుసలోనే మన మోదీ ప్రభుత్వం అమెరికాతో, ట్రంప్‌ విధానాలతో చేతులు కలిపింది. చేతులు కాల్చుకునే పరిస్థితి తెచ్చుకుంటోంది. అయితే, అమెరికా కక్ష కట్టి మరీ చైనాతోపాటు ఇండి యాకు కూడా సబ్సిడీల్లో కోతపెట్టడానికి నిర్ణయించింది. అమెరికా చేస్తున్న ఈ తాజా విన్యాసాలకు అర్థం ఏమిటో మనం గుర్తించలేక పోయాం. కాని, అమెరికాను ‘వర్థమానదేశం’గానే భావించాలని, ఎవరి కన్నా కూడా ‘వేగవంతంగా అభివృద్ధిచెందే దేశం’గా మార్చాలని డొనాల్డ్‌ ట్రంప్‌ సిగ్గువిడిచి మొదటిసారిగా (8–9–18) ప్రకటించుకోవాల్సి వచ్చింది. ఈ సత్యాన్ని, దాని పరాధార స్థితిని దాచడం కోసమే ఇప్పుడు వర్థమాన దేశాల ఆర్థికవ్యవస్థలను నులిమివేసే ప్రయత్నాలకు ట్రంప్‌ దిగారని గుర్తించాలి. అంతేకాదు, అమెరికా కనుసన్నల్లోనే మొదటి నుంచీ మెసలుతున్న ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీఓ) చైనాను ప్రపంచంలో ‘మహత్తర ఆర్థిక శకి’్తగా పరిగణిస్తున్నందుకు ట్రంప్‌ ఆ సంస్థపై ఇటీవల నార్త్‌ డకోటాలోని  ఫార్గోసిటీ సభలో విరుచుకుపడ్డారు. అందుకే అమెరికాకు చైనా ఎగుమతులను అడ్డుకునేందుకు వాటిపై సుంకాలు పెంచేశారు. ఇంకా అమెరికా నుంచి ఇండియా దిగుమతులపై కూడా (19 సరకులు) సుంకాలు పెంచి, తగ్గిన రూపాయి విలువలో మన సరకులను అమెరికాకు అనుమతించాలని ట్రంప్‌ నిర్ణయించారు. అంటే, రెండు విధాలా మన ఆర్థిక వ్యవస్థకు ‘క్షవరం’ చేసే దుర్మార్గపు వ్యూహానికి ట్రంప్‌ దిగారని మరచిపోరాదు. అమెరికా పాలకులతో సైనిక విన్యాసాలు యథేచ్ఛగా కొనసాగిస్తున్నా భారత కరెన్సీ విలువను మాత్రం కోతపెట్టే చర్యలను ట్రంప్‌ మానుకోవడం లేదు. ఇండియాలో నోట్ల రద్దు ఫలితంగా ఆటోరిక్షా ప్రయాణ చార్జీల కన్నా విమాన ప్రయాణ చార్జీలు తక్కువ అని కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి జయంత్‌ సిన్హా చమత్కరించారంటే–ఈ కుట్ర ఏ దశకు చేరిందో ఊహించవచ్చు.

ఈ పరిస్థితుల మధ్యనే మన ఆర్థిక వ్యవస్థపై ట్రంప్‌ ప్రారంభించిన దాడిని మోదీ ఎదుర్కొనలేకపోతున్నారు. ‘‘భారత్‌ను నాలుగో ఆర్థిక పారిశ్రామిక విప్లవ కేంద్రానికి వేదికగా ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూ ఈఎఫ్‌) ఎంచుకుంది. ఈ విప్లవం ద్వారా ఉద్యోగాల స్వరూపమే మారి పోతుంది. మరిన్ని ఉపాధి అవకాశాలు అంది వస్తాయి. టెక్నాలజీ అభివృద్ధితో ఉద్యోగాలు పోవు’’ అని నరేంద్రమోదీ చిత్రమైన హామీ ఇచ్చారు. అంటే, ఒక వైపున ప్రసిద్ధ ఆర్థికవేత్తలే ట్రంప్‌ పోకడలను దుయ్యబడుతున్నారు. ‘‘అమెరికాలో ప్రజల ఆస్తులను ప్రయివేట్‌ రంగం దారుణాతిదారుణంగా దోచుకోవడానికి ట్రంప్‌ అనుమతిస్తు న్నారు. తిరిగి వాటిని దేశ రాజధాని వాషింగ్టన్‌లోని పాలక పక్ష పెద్దల స్నేహితులకు, వారి మద్దతుదారులకు కుదువ పెడుతున్నారని అమెరికా ప్రసిద్ధ ఆర్థికవేత్త, విశ్లేషకుడు, చరిత్రకారుడైన డాక్టర్‌ పాల్‌ క్రీగ్‌ రాబర్ట్స్‌ (11.5.2018) ప్రకటించారు. అంతేకాదు ట్రంప్‌ పాలన పర్యావరణ వినాశనానికి, మానవ జీవితాల ఉనికికే చేటని ఆయన విమర్శించాడు. ఇంతకీ వాషింగ్టన్‌ పాలకుల అధికారం అంతా దేని మీద ఆధా రపడింది? అమెరికన్‌ డాలర్‌ మారకం విలువ మీదనే. అమెరికాలో పౌర స్వేచ్ఛకు ఉద్దేశించిన అత్యంత రక్షణ క్లాజులైన హెబియస్‌ కార్పస్, చట్టబద్ధ రక్షణలను పాలకులు నాశనం చేశారని డాక్టర్‌ రాబర్ట్స్‌ వెల్లడించారు. ఇలాంటి పౌర హక్కుల అణచి వేతకు అనుకూలంగా, భారత రిపబ్లిక్‌ రాజ్యాంగ నిబంధనలకు కూడా పాలకుల నుంచి ప్రమాదం రాలేదనీ, రాదనీ భరోసా చెప్పుకోగల స్థితిలో ఉన్నామా? ప్రభుత్వరంగ బ్యాంకుల పరిస్థితిని ఎలా దిగజార్చారో మనం కళ్లారా చూస్తున్నాం.

ట్రంప్‌ భారత్‌ను శాసిస్తున్నారా?
బహుశా నరేంద్ర మోదీ విధానాల్ని కొన్ని లోపాయికారీ హెచ్చరికల ద్వారా ట్రంప్‌ ఏమైనా శాసిస్తున్నారా? అమెరికా రాజ్యాంగ నిర్మాతలలో ఒకరైన థామస్‌ జెఫర్సన్‌ అన్నట్టుగా ‘‘దేశంలోని స్టాండింగ్‌ ఆర్మీ కన్నా బ్యాంకింగ్‌ సంస్థలు మన స్వేచ్ఛ, స్వాతంత్య్రాలకు చాలా ప్రమాదకరం. అమెరికా ప్రజలు గనుక తమ కరెన్సీని ద్రవ్యోల్బణం పేరిటగానీ, దాని విలువను తగ్గించే పేరిటగానీ కంట్రోల్‌ చేయడానికి ప్రైవేట్‌ బ్యాంకుల్ని అనుమతిస్తే ఆ బ్యాంకులు ప్రజల మొత్తం ఆస్తిపాస్తుల్ని దోచేసుకుం టాయి. చివరికి, అమెరికా ఖండాన్ని బానిసత్వం నుంచి విమోచన కలి గించిన తమ తల్లిదండ్రుల బిడ్డలకు వారసత్వంగా ఆస్తిపాస్తులు దక్క కుండా బికారుల్ని చేసి వదులుతాయి’’. ఈ రోజున అమెరికాలో మధ్య తరగతి వర్గం సైతం కునారిల్లిపోతుండడం జఫర్సన్‌ జోస్యానికి ప్రబల నిదర్శనమని తాజాగా సంచలనం సృష్టిస్తున్న ‘కుమ్మక్కు’ (కొల్యూషన్‌) అనే పేరిట నోమ్‌ ప్రిన్స్‌ అనే ప్రసిద్ధ అమెరికన్‌ విశ్లేషకుడు తాజా డాక్యు మెంట్ల పేరిట వెల్లడించారు.


ఏబీకే ప్రసాద్‌, సీనియర్‌ సంపాదకులు
abkprasad2006@yahoo.co.in 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement