
బతుకమ్మ సంబరాలను పురస్కరించుకొని 9 రోజులు ప్రతి మనిషి ప్రకృతితో మమేకమై పోతారు అదే బతుకమ్మ పండుగ గొప్పతనం. ఎంగి లిపూల బతుకమ్మతో మొదలై, సద్దుల బతుకమ్మతో బతుకమ్మ సంబరాలు ముగుస్తాయి. ఈ 9 రోజులు తెలం గాణలో సాయంకాలం వేళ ఊరూ వాడా ఏకమై బతుకమ్మ పాటలతో పులకించిపోతుంది. తీరొక్క పువ్వులతో సింగారించుకొనే బంగరు కల్ప వల్లిగా బతుకమ్మను పూజిస్తారు. ఓ పళ్లెంలో గుమ్మడి ఆకులు పరచి, వాటిని పసుపు కుంకుమలతో అలంకరిస్తారు. ముందుగా గుమ్మడి పువ్వుల్ని అమర్చి తంగేడు, గన్నేరు, నిత్య మల్లె, బంతి వంటి పువ్వుల్ని పేర్చుతారు. అదే పువ్వుల దొంతరపై తమలపాకులో పసుపు గౌరమ్మను అలంకరి స్తారు. సముదాయాన్నే బతుకమ్మగా వ్యవహరిస్తారు. ఓ బాలిక భూస్వాముల అకృత్యాలను భరించలేక ఆత్మహత్య చేసుకుంటే, తనను ఆ ఊరి ప్రజలు చిరకాలం ‘బతుకమ్మా!‘ అని దీవించారంట. బతుకమ్మను కీర్తిస్తూ జరుపుకునే పండుగ ఇది. తెలంగాణ సమాజం అమరత్వాన్ని ఆలింగనం చేసుకుంటుంది కానీ అవమానానికి సుదూరంగా ఉంటుంది. అందుకే ఆత్మహత్యకు పాల్పడిన ఆ బాలికను కీర్తిస్తూ బతుకమ్మను ఆడుతారని బాగా వాడుకలో ఉన్న కథనం.
బంగారు తెలంగాణలో ఉయ్యాలో బ్రతుకులు ఛిద్రమయ్యే ఉయ్యాలో/ రాష్ట్రం ఏర్పడితే ఉయ్యాలో ఉద్యోగాలన్నారు ఉయ్యాలో/ నౌకరి లేకే ఉయ్యాలో మరణాన్ని ముద్దాడితిమి ఉయ్యాలో అని విద్యార్ధినులు తమ ఆవేదనంతా బతుకమ్మ పాటలోకి ఒంపి నిరసన తెలిపే రోజు ల్లోనే ఇంకా బతుకమ్మ ఆడటం బాధాకరం. మల్లన్న సాగర్ భూ నిర్వాసితురాలు లక్ష్మి బతుకమ్మ పాట ద్వారా ప్రభుత్వానికి ఆవేదనను తెలిపితే నిర్దాక్షిణ్యంగా అరెస్ట్ చేయించినోళ్లకు బతుకమ్మ ఆడే నైతికత ఎక్కడిదని తెలం గాణ మహిళా సమాజం ప్రశ్నిస్తోంది.
బతుకమ్మ అంటే మహిళలంతా ఒక్కచోట కూడి రెండు చేతులతో చప్పట్లు చరుస్తూ, పాట పాడే గొప్ప సంస్కృతి అని మరిచి బతుకమ్మ అంటే డీజేలతో దుమకడమని ఓ కొత్త శైలిని నేర్పిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి, స్వపరిపాలనకు కారణమైన సోనియాగాంధీకి కాంగ్రెస్ సారథ్యంలో బతుకమ్మ చీరను కానుకగా ఇస్తారని విశ్వసిస్తూ...
ఇందిరా శోభన్, టీపీసీసీ అధికార ప్రతినిధి, మేనిఫెస్టో కమిటీ మెంబర్
Comments
Please login to add a commentAdd a comment