'గెలుపు కోసం బెదిరింపులు సరికాదు'
Published Fri, Dec 25 2015 10:23 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
హుజూర్‌నగర్: ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అప్రజాస్వామిక విధానాలను అనుసరిస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. శుక్రవారం నల్లగొండ జిల్లా హుజూర్‌నగర్‌లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎమ్మెల్సీ ఎన్నికలను ఓపెన్ విధానంలో విప్ జారీ చేసే పద్ధతిన నిర్వహిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు.
రహస్య బ్యాలెట్ విధానంలో ఎన్నికల వల్ల అవకతవకలకు అవకాశం ఉంటుందన్నారు. నల్లగొండ జిల్లాలో టీఆర్‌ఎస్‌కు బలం లేకున్నప్పటికీ అభ్యర్థిని నిలబెట్టి బెదిరింపులతో గెలవాలనే ధోరణి సరికాదన్నారు. నల్లగొండ, మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులను గెలిపించాలని ఆయన కోరారు.
Advertisement
Advertisement