విద్యుత్ సబ్ ఇంజినీర్ల పోస్టులకు నోటిఫికేషన్ | Online Notification for Electrical Sub Engineer Posts | Sakshi
Sakshi News home page

విద్యుత్ సబ్ ఇంజినీర్ల పోస్టులకు నోటిఫికేషన్

Published Fri, Jan 8 2016 7:10 PM | Last Updated on Sun, Sep 3 2017 3:19 PM

Online Notification for Electrical Sub Engineer Posts

హైదరాబాద్ : దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(టీఎస్‌ఎస్పీడీసీఎల్) 153 సబ్ ఇంజనీర్(ఎలక్ట్రికల్) పోస్టుల భర్తీకి శుక్రవారం ఆన్‌లైన్‌లో ప్రకటన విడుదల చేసింది. ఉత్తర హైదరాబాద్, దక్షిణ హైదరాబాద్, సెంట్రల్ హైదరాబాద్, ఉత్తర రంగారెడ్డి, దక్షిణ రంగారెడ్డి, తూర్పు రంగారెడ్డి, నల్లగొండ, మెదక్, మహబూబ్‌నగర్ సర్కిళ్ల పరిధిలో ఈ ఖాళీలు ఉన్నట్లు ప్రకటనలో తెలిపింది.

ఎలక్ట్రికల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ విభాగంలో ఇంజనీరింగ్ డిప్లమా చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ నెల 18 నుంచి వచ్చే నెల 6వ తేదీ లోపు దరఖాస్తులు స్వీకరించనున్నారు. మార్చి 2016లో రాత పరీక్ష నిర్వహిస్తామని, పరీక్షా తేదీని త్వరలో వెల్లడిస్తామని టీఎస్‌ఎస్పీడీసీఎల్ యాజమాన్యం పేర్కొంది. ఈ మేరకు తమ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement