నయీం బాధితులకు 100 శాతం న్యాయం: కేసీఆర్
నయీం బాధితులకు వంద శాతం న్యాయం చేస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు.
హైదరాబాద్: గ్యాంగ్స్టర్ నయీంను పెంచిపోషించిన వారే ఇవాళ జ్యుడీషియల్ విచారణ, సీబీఐ విచారణ అంటూ రాద్ధాంతం చేస్తున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్ విమర్శించారు. నయీం బాధితులకు వంద శాతం న్యాయం చేస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు. కేసు విచారణను పారదర్శకంగా జరుగుతోందని, దర్యాప్తు వివరాలను ప్రతిరోజూ వెల్లడిస్తామని అన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని, దుష్టశక్తుల్ని ఉక్కుపాదంతో అణచివేస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు.
నయీం వ్యవహారంతో సంబంధమున్న వారిని ఉపేక్షించేదే లేదని, రాజకీయ నాయకులైనా, ఎవరైనా సరే చర్యలు తీసుకుంటామని మీడియా సమావేశంలో కేసీఆర్ తెలిపారు. అలాగే ఆత్మహత్యకు పాల్పడిన ఎస్సై రామకృష్ణారెడ్డి కుటుంబానికి న్యాయం చేస్తామని కేసీఆర్ వెల్లడించారు. విచారణ తర్వాత నిందితులపై చర్యలు తీసుకుంటామన్నారు.