11 ప్రాజెక్టులకు రూ.1,155 కోట్లు!
అంగీకరించిన కేంద్రం... నేడు మంత్రి హరీశ్‌రావు సమీక్ష
సాక్షి, హైదరాబాద్: సత్వర సాగునీటి ప్రయోజన ప్రణాళిక (ఏఐబీపీ) కింద రాష్ట్రంలోని 11 సాగునీటి ప్రాజెక్టులకు రూ.1,155 కోట్ల గ్రాంటు ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించింది. శ్రీకొమురంభీం, గొల్లవాగు, రల్లివాగు, మత్తడివాగు, నీల్వాయి ప్రాజెక్టు, జగన్నాథ ప్రాజెక్టు, పాలెం వాగు, ఎస్సారెస్పీ రెండో దశ, రాజీవ్ బీమా ఎత్తిపోతల పథకాలను కూడా ఏఐబీపీ కింద చేర్చాలని కేంద్ర జల వనరుల సమన్వయ కమిటీ సభ్యుడిగా ఉన్న మంత్రి హరీశ్‌రావు కేంద్రాన్ని కోరారు. అందుకు కేంద్రం అంగీకరించింది. దీంతో ఆ ప్రాజెక్టులకు గ్రాంటు ఇచ్చేందుకు కేంద్రం ఒప్పుకున్నట్లు హరీశ్ ఒక ప్రకటనలో తెలిపారు. మరోవైపు ఆ 11 ప్రాజెక్టులపై మంత్రి హరీశ్ శుక్రవారం సమీక్ష నిర్వహించనున్నారు.